Telangana

News June 23, 2024

HYD: పార్కింగ్‌ సమస్య పరిష్కారానికి కృత్రిమ మేధ

image

హైదరాబాద్‌తో పాటు అన్ని నగరాల్లో పార్కింగ్‌ సమస్యను పరిష్కరించడానికి కృత్రిమ మేధను ఎలా ఉపయోగించుకోవాలన్న దానిపై ప్రణాళికలు సిద్ధం చేయాలని ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు సూచించారు. HYDలోని సచివాలయంలో ఉన్న తన ఛాంబర్‌లో ‘ఈజీ పార్క్‌ ఏఐ’ సంస్థ డిజిటల్‌ ప్రెజెంటేషన్‌ను మంత్రి తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్కింగ్‌ స్లాట్‌ను ముందే బుక్‌ చేసుకునేందుకు యాప్‌లను రూపొందించాలని పేర్కొన్నారు.

HYD: వివాహేతర సంబంధాలు ప్రాణాలు తీశాయి..!

image

రెండు వేర్వేరు ఘటనల్లో వివాహేతర సంబంధాలు ఇద్దరి ప్రాణాలు తీశాయి. పోలీసులు తెలిపిన వివరాలు..పాతబస్తీ వాసి జాకీర్(29)కు వట్టేపల్లికి చెందిన మహిళకు వివాహేతర సంబంధం ఉంది.జాకీర్ తరచూ ఆ మహిళ ఇంటికి వస్తుండడంతో ఆమె భర్త, సోదరుడు కలిసి జాకీర్‌ను చంపేశారు. మరో ఘటనలో RRజిల్లా షాబాద్ వాసి సంతోష(36)కు, షాద్‌నగర్ వాసి సత్తయ్యకు వివాహేతర సంబంధం ఉంది. ఆమె మరికొందరితో కలుస్తుందనే అనుమానంతో సత్తయ్య ఆమెను చంపేశాడు.

వరంగల్: 19 మంది CIల బదిలీ

image

మల్టీ జోన్ 1 పరిధిలో పని చేస్తున్న 19 మంది CIలను బదిలీ చేస్తూ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఏవి.రంగనాథ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కోడ్ ముగియడంతో పోలీస్ శాఖలో బదిలీల ప్రక్రియ ప్రారంభమైంది. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని భూపాల్ పల్లి, హనుమకొండ, వరంగల్ జిల్లాల పరిధిలో పోలీస్ ఇన్‌స్పెక్టర్‌లు బదిలీ అయ్యారు.

News June 23, 2024

నిజామాబాద్ జిల్లాలో 19 మంది ఇన్‌స్పెక్టర్లు బదిలీ

image

నిజామాబాద్ మల్టీ జోన్1 పరిధిలో పనిచేస్తున్న 19 మంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఐజీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న కొంతమందిని పోస్టింగ్‌ నుంచి తప్పించి వీఆర్‌కు అటాచ్ చేశారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో రానున్న రోజుల్లో మరికొంతమందిని బదిలీ చేసే అవకాశం ఉంది.

News June 23, 2024

సూర్యాపేట: వరకట్నం వేధింపులు, వివాహిత సూసైడ్

image

లక్ష్మీదేవిపల్లి మండలం కారుకొండలో వరకట్నం వేధింపులతో వివాహిత పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. SRPT జిల్లా నడిగూడెం మం. బృందావనపురం గ్రామానికి మానసతో కారుకొండకి చెందిన సంతోశ్‌కు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. కొన్ని రోజుల నుంచి అదనపు కట్నం కోసం భర్త మానసను వేధిస్తున్నాడు. దీంతో పురుగుల మందు తాగిన మానస సృహ కోల్పోయింది. KMM తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.

News June 23, 2024

MBNR: 1,800 మందికి పదోన్నతులు

image

మల్టీ జోన్-2 పరిధిలో ఉన్న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ వేగవంతమైంది. గతేడాది సెప్టెంబరులో బదిలీల కోసం ఉమ్మడి జిల్లా నుంచి 9,824 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం బదిలీల్లో వివిధ విభాగాలకు చెందిన సుమారు ఏడు వేల మంది ఉపాధ్యాయులు బదిలీ అయ్యే అవకాశం ఉంది. వీరిలో సుమారు 1,800 మంది పదోన్నతులు పొందనున్నారు. ఇప్పటికే 229 SA, GHMలు పదోన్నతులు పొందారు.

News June 23, 2024

HYD: వాట్సాప్‌లో మెనేజ్.. రూ.16.68 లక్షలు స్వాహా

image

గూగుల్ మ్యాప్‌లో రేటింగ్ ఇవ్వాలని సైబర్ నేరగాళ్లు రూ.16.68 లక్షలు స్వాహా చేశారు. HYDకు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి గూగుల్ టాస్క్ చేసి ఆదాయం పొందండి అంటూ వాట్సాప్ మెసేజ్ వచ్చింది. లింక్ క్లిక్ చేసిన బాధితుడు టెలిగ్రామ్ గ్రూప్‌లో యాడ్ అయ్యాడు. మొదటగా కొన్ని టాస్క్‌లు చేసిన తర్వాత పెట్టుబడులు పెట్టాలంటూ సూచించారు. విడతల వారీగా రూ.16.68 లక్షలు దండుకున్నారు. మోసపోయానని బాధితుడు PSను ఆశ్రయించాడు.