Telangana

News June 23, 2024

ఖమ్మం: ప్రేమపేరుతో బాలికతో ఆగ్రాకు.. పోక్సో కేసు నమోదు

image

ఖమ్మంలో ఓ యువకుడు పదో తరగతి విద్యార్థినిని ఆగ్రాకు తీసుకెళ్లిన ఘటనపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఖమ్మంకి చెందిన సాయికి క్రీడల్లో ప్రావీణ్యం ఉంది. తాను చదువుకున్న స్కూల్‌లో ఆటలు నేర్పుతూ విద్యార్థులకు దగ్గరయ్యాడు. ఈ క్రమంలో విద్యార్థినిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడగా ఓసారి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. తీరు మార్చుకోని సాయి, అమ్మాయిని బెదిరించి ఆగ్రాకు తీసుకెళ్లాడు. ఈ ఘటనపై కేసు నమోదైంది. 

News June 23, 2024

HYD: ఫుడ్ సేఫ్టీ తనిఖీలు నిరంతరం నిర్వహించాలి: మంత్రి

image

హెల్త్‌ విభాగంలోని అన్ని ఖాళీ పోస్టులను భర్తీ చేసి, ఆయా సంస్థలను బలోపేతం చేయాలని అధికారులను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ కార్యాలయంలో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఫుడ్‌ సేఫ్టీ తనిఖీలు నిరంతరం నిర్వహించాలని ఆదేశించారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తే సహించబోమన్నారు.

News June 23, 2024

HYD: ఫుడ్ సేఫ్టీ తనిఖీలు నిరంతరం నిర్వహించాలి: మంత్రి

image

హెల్త్‌ విభాగంలోని అన్ని ఖాళీ పోస్టులను భర్తీ చేసి, ఆయా సంస్థలను బలోపేతం చేయాలని అధికారులను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ కార్యాలయంలో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఫుడ్‌ సేఫ్టీ తనిఖీలు నిరంతరం నిర్వహించాలని ఆదేశించారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తే సహించబోమన్నారు.

News June 23, 2024

ములుగు: స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ సస్పెండ్

image

ములుగు SB విభాగంలో విధులు నిర్వహిస్తున్న శ్రీధర్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు మల్టీజోన్ IG రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు ఇలా.. 2022-23లో KMM 2 టౌన్ CIగా ఉన్న సమయంలో ఓ వ్యక్తిని బెదిరించి తప్పుడు సాక్ష్యాలతో కేసు నమోదు చేశారు. 2022లో నిందితులకు అనుకూలంగా వ్యవహరిస్తూ కోర్టును తప్పుదోవ పట్టించినట్లు ఫిర్యాదు వచ్చింది. ఈమేరకు విచారణ జరిపి సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

News June 23, 2024

మానకొండూరులో అదృశ్యం.. కొమురం భీమ్ జిల్లాలో హత్య

image

ASF జిల్లా దహేగాంలో మానకొండూరుకి చెందిన వ్యక్తి హత్యకు గురయ్యాడు. CI రాజ్ కుమార్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సాయికిరణ్ ఏప్రిల్ 18న సిద్దిపేటకు వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో మే 2న భార్య అనుష పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో పనిచేసిన చోట పోలీసులు విచారించగా అక్కడ పనిచేసే సునీత, భర్త శ్రీనివాస్, తండ్రి, మేనమామ కలిసి చంపి బావిలో పడేసినట్లు తెలిపారు.

News June 23, 2024

జూరాలకు తగ్గుతున్న ఇన్‌ఫ్లో

image

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. శనివారం ప్రాజెక్టుకు 908 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, ప్రాజెక్టు నుంచి 2,054 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.830 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు.

News June 23, 2024

మందమర్రిలో JCB ఢీకొని కూలీ మృతి

image

JCB ఢీకొని కూలీ మృతి చెందిన ఘటన మందమర్రిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రాజశేఖర్ వివరాల ప్రకారం.. చెక్ డ్యామ్ నిర్మాణ పనుల కోసం తీసుకువచ్చిన ఇసుక ట్రాక్టర్ మట్టిలో దిగబడింది. దానిని JCB సహాయంతో బయటికి లాగుతుండగా డ్రైవర్ అకస్మాత్తుగా JCBని వెనక్కు తీయడంతో నవీన్(33) అనే కూలీకి బలంగా తాకింది. తీవ్రంగా గాయపడిన నవీన్‌ను మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

News June 23, 2024

బీబీపేట్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలి సూసైడ్

image

ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన బీబీపేట్‌లో చోటుచేసుకుంది. మండలానికి చెందిన వీణ ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తుంది. ఆమెకు సిద్ధిపేటకు చెందిన శ్రావణ్‌తో 2015లో వివాహం కాగా HYDలో కాపురం ఉంటున్నారు. అయితే కొద్దిరోజులుగా వీణ మానసిక పరిస్థితి బాగా లేక పలుమార్లు ఆత్మహత్యాయత్నం చేసింది. కొద్దిరోజుల క్రితం పుట్టింటికి వచ్చిన ఆమె ఈనెల 21న రాత్రి పురుగు మందు తాగింది. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది.

News June 23, 2024

MBNR: 28న జిల్లాస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపికలు

image

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రధాన స్టేడియంలో ఈనెల 28న జిల్లా స్పోర్ట్స్ స్కూల్ ఎంపికలు నిర్వహించనున్నామని డీవైఎస్ఓ శ్రీనివాస్ తెలిపారు. క్రీడా పాఠశాలలో 4వ తరగతి ప్రవేశాలకు జిల్లా స్థాయి ఎంపికలు ఉంటాయని, ప్రవేశాల కోసం ఎనిమిది నుంచి తొమ్మిది సంవత్సరాల వయస్సు ఉండి, 2015 సెప్టెంబరు ఒకటి నుంచి 2016 ఆగస్టు 31 మధ్య కాలంలో జన్మించిన వారు అర్హులని పేర్కొన్నారు.

News June 23, 2024

MBNR: ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో కొత్త కోర్సులు

image

మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో ఈ విద్యాసంవత్సరంలో ప్రభుత్వం కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చిందని ప్రిన్సిపల్ పద్మావతి తెలిపారు. ఈమేరకు కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. BAHP, BSC ఫార్మాసేల్స్, మార్కెటింగ్, BCOM ఫైనాన్స్, BBA రీటెయిల్ ఆపరేషన్స్ వంటి ఒక్కో కోర్సుల్లో 60 సీట్ల ఉన్నాయన్నారు. ఎంవీఎస్ కళాశాలలో పూర్తి స్థాయిలో వసతులు, సిబ్బంది ఉన్నారని తెలిపారు.