Telangana

News June 23, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓ వర్షాకాలం సీజనల్ వ్యాధులపై భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
✓ పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన
✓ సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
✓ మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓ పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
✓ ఖమ్మంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓ ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు

News June 23, 2024

కిరాయికి ఎద్దులు

image

వానకాలం ప్రారంభం కావడంతో వ్యవసాయ సీజన్ మొదలైంది. నల్గొండ జిల్లాలో చాలా వరకు రైతులు ప్రధానంగా పత్తిని పండిస్తారు. విత్తనాలను విత్తడం, వరుసలు వేయడం, పంటలో కలుపు తీయడానికి గుంటుక కొట్టడం తదితర పనులను ఎద్దుల అవసరం ఉంటుంది. ఎద్దులు ఉన్న రైతులు వాటిని కిరాయికి ఇచ్చి జీవనం సాగిస్తున్నారు. మనిషితో అయితే రూ.2వేలు, మనిషి లేకుండా కేవలం ఎద్దులే అయితే రూ.1500 వరకు అద్దె చెల్లిస్తున్నారు.

News June 23, 2024

HYD: ఉత్సాహంగా ప్రారంభమైన షూటింగ్‌ పోటీలు

image

HYD గచ్చిబౌలిలోని సాట్స్‌ షూటింగ్‌ రేంజ్‌లో 10వ తెలంగాణ రాష్ట్ర షూటింగ్‌ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. పోటీలను తెలంగాణ రైఫిల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అమిత్‌సంగి ప్రారంభించారు. ఈ పోటీల్లో 10ఎం రైఫిల్‌ ఓపెన్‌/సైట్‌ రైఫిల్‌, 25ఎం ఫిస్టల్‌, 50ఎం ఫిస్టల్‌, 10ఎం ఫిస్టల్‌ ఈవెంట్‌లలో 200 మందికి పైగా పోటీదారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.

MBNR: జులై 7 వరకు ఓపెన్ PG పరీక్ష ఫీజు చెల్లించండి

image

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీజీ మొదటి, రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు వార్షిక పరీక్ష ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలని ఉమ్మడి జిల్లా రీజినల్ కో-ఆర్డినేటర్ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. విద్యార్థులు పరీక్షల ఫీజు చెల్లించేందుకు జులై 7 వరకు గడువు ఉందన్నారు. సెకండియర్ పరీక్షలు జులై 31 నుంచి ఫస్టియర్ పరీక్షలు ఆగస్టు 9 నుంచి నిర్వహిస్తామని చెప్పారు. మరింత సమాచారం కోసం వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.

News June 23, 2024

HYD: చాలా భయపడ్డాను: రాజేశ్వరి

image

HYD మణికొండలోని చిత్రపురికాలనీలో రాజేశ్వరిపై <<13490170>>15 కుక్కలు దాడి<<>> చేసిన విషయం తెలిసిందే. బాధితురాలు మాట్లాడుతూ.. ‘ఒక్కసారిగా నాపై అన్ని కుక్కలు దాడి చేశాయి.. చాలా భయపడ్డాను.. ప్రాణాలతో బయటపడుతానని అనుకోలేదు.. చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌తో వాటిని కొడుతూ రక్షించుకోగలిగాను. దేవుడి దయవల్ల బతికి బయటపడ్డాను. చేతిపై ఓ కుక్క కరిచింది. కింద పడడంతో గాయాలయ్యాయి. HYDలో కుక్కల బెడద తీవ్రంగా ఉంది’ అని అన్నారు.

నల్గొండకు సీఎం రేవంత్: మంత్రి కోమటిరెడ్డి

image

సీఎం రేవంత్ రెడ్డి త్వరలో నల్గొండ జిల్లాకు రానున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. శనివారం జరిగిన జడ్పీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా త్వరలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు వస్తారని చెప్పారు. జిల్లాలోని ప్రాజెక్టులు, అభివృద్ధిపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్షిస్తారని తెలిపారు.

News June 23, 2024

కరీంనగర్: డిగ్రీ పరీక్షల్లో 16 మంది డిబార్

image

శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలో జరుగుతున్న డిగ్రీ రెండో, నాలుగో సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈక్రమంలో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన 16 మంది విద్యార్థులు డిబార్ అయినట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ శ్రీరంగ ప్రసాద్ శనివారం ఓ ప్రకటనలు తెలిపారు. విద్యార్థులు సక్రమంగా పరీక్షలు హాజరుకావాలని ఆయన సూచించారు.

News June 23, 2024

ప్రతిరోజు ఆకస్మిక తనిఖీలు జరుగుతాయి: జిల్లా కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలలో ప్రతిరోజు ఆకస్మిక తనిఖీలు జరుగుతాయని జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ తెలిపారు. వైద్యాన్ని వ్యాపారంగా మార్చే వారిపై ఉక్కు పాదం మోపుతానని ఆయన అన్నారు. ముగ్గురు మంత్రుల ప్రాతినిథ్యం జిల్లా అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పారు. ధరణి సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.