Telangana

News June 23, 2024

జగిత్యాల: జిల్లా అధికారులకు ఆత్మీయ సన్మానం

image

బదిలీపై వెళ్తున్న కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషాను, అడిషనల్ కలెక్టర్ నుంచి కలెక్టర్‌గా ప్రమోషన్ పై వెళ్తున్న దివాకరను జగిత్యాలలో శనివారం ఘనంగా సన్మానించారు. అలాగే ఇటీవల నూతనంగా జగిత్యాల కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సత్యప్రసాద్‌ను, ఎస్పీ అశోక్ కుమార్‌లకు స్వాగతం పలికి సత్కరించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

News June 23, 2024

MHBD: పాల‌న‌ను ప‌రుగులు పెట్టించాలి: సీతక్క

image

అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని, పాలనను పరుగులు పెట్టించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. విధులకు వన్నె తెచ్చేలా అధికారులు పనిచేయాలని, జిల్లాను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉద్యోగులదేనని, నిజాయితీగా కష్టపడి పని చేసే అధికారులకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

News June 23, 2024

పాలమూరులోని వ్యవసాయ మార్కెట్ల రిజర్వేషన్ల వివరాలు

image

ఉమ్మడి జిల్లాలో 19 వ్యవసాయ మార్కెట్లు ఉండగా.. SDNR, ఆమనగల్లు, కొడంగల్ RR, VKB జిల్లాలోకి వెళ్లాయి. ప్రస్తుతం 16 మార్కెట్లు పనిచేస్తున్నాయి. వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు ఇలా అమలు కానున్నాయి. NGKL, మక్తల్ (BC మహిళ), అచ్చంపేట(SC), కొల్లాపూర్(ST), KLKY, దేవరకద్ర (BC మహిళ), MBNR, WNP, పెబ్బేరు, GDL, ALP, నవాబ్ పేట(BC), అత్మకూర్, బాదేపల్లి(OC జనరల్), మదనాపురం, NRPT, కోస్గి(SC)లకు కేటాయించారు.

News June 23, 2024

మెదక్: మంత్రి కొండా సురేఖను కలిసిన జిల్లా నేతలు

image

తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ, మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖను నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జీ పిసిసి ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ సమస్యలు, నియోజకవర్గ అభివృద్దికి నిధుల కేటాయింపు గురించి చర్చించారు. వారితో నాయకులు మైనంపల్లి హనుమంతరావు, ఆంజనేయులు గౌడ్, ఎలక్షన్ రెడ్డి ఉన్నారు.

News June 23, 2024

నల్గొండలో ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి కోమటిరెడ్డి

image

నల్గొండలోని తన క్యాంపు కార్యాలయం సమీపంలోని మున్సిపల్ పార్కులో శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు మూడు గంటల పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులకు సంబంధించి కొన్నింటిని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు.

News June 23, 2024

ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి: కలెక్టర్

image

 గోదావరి నదిలో ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. రాములవారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా గోదావరిలో స్నానం ఆచరిస్తారని.. భక్తులు స్థానాలు చేసే ప్రదేశాలలో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. శనివారం గోదావరిలో మునిగి బాలుడు మృతి చెందడంతో ఆ ప్రదేశాన్ని కలెక్టర్ పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

News June 23, 2024

ఆదిలాబాద్: సివిల్స్ కై ఉచిత శిక్షణ APPLY NOW

image

సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల కొరకు హైదరాబాద్ బంజారాహిల్స్‌లో గల TG స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ADB SC సంక్షేమ శాఖ అధికారిని సునీత కుమారి తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు జులై 10 లోపు http://tsstudycircle.co.in/ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జులై 21 న నిర్వహించనున్న ప్రవేశ పరీక్ష ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేసి 10 నెలల పాటు ఉచితభోజన వసతితో కోచింగ్ ఉంటుందన్నారు.

News June 22, 2024

కరీంనగర్ జిల్లా TOP NEWS

image

☞సిరిసిల్లలో స్కానింగ్ సెంటర్లను డిప్యూటీ డిఎంహెచ్ఓ తనిఖీ
☞ చొప్పదండి ఎమ్మెల్యేను పరామర్శించిన సీఎం
☞మేడిపల్లి: పేకాట స్థావరంపై పోలీసుల దాడులు
☞గంభీర్రావుపేట: నకిలీ గల్ఫ్ ఏజెంట్ అరెస్ట్
☞పెద్దపల్లి తాహశీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ తనిఖీ
☞మెట్ పల్లి సీఐగా నిరంజన్ రెడ్డి

News June 22, 2024

“ఉమ్మడి పాలమూరు జిల్లా నేటి ముఖ్యాంశాలు”

image

√NGKL: త్రాగిన మైకంలో భర్తను చంపిన భార్య.
√MBNR:జడ్చర్లలో వ్యక్తి హత్య..
√ ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల కురిసిన వర్షాలు.
√ రైతు భరోసా అందించడంలో ప్రభుత్వం విఫలం: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.
√ ఉమ్మడి జిల్లాలో పలు ప్రాంతాల్లో ఘనంగా ఏరువాక సంబరాలు.
√ రైతు రుణమాఫీ ప్రకటన పై కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు.
√NGKL: చెంచు మహిళను పరామర్శించిన మాజీ మంత్రి సబితా, బర్రెలక్క.

News June 22, 2024

సిద్ధిపేట: సీఎంకు లేఖ రాసిన హరీష్ రావు

image

సిద్దిపేట: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకుల డిమాండ్ పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ రాశారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన మేరకు గ్రూప్ -2, గ్రూప్-3 పోస్టులను పెంచి పరీక్షలు నిర్వహించాలని లేఖలో కోరారు. జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతిపై కార్యాచరణ ప్రకటించాలన్నారు.