Telangana

News June 22, 2024

సిద్దిపేట: ధరణి పేరుతో చేసిన మోసాలు బయటపెడతా: ఎంపీ

image

మొదట కలెక్టర్‌గా చేసి అనంతరం ప్రజాప్రతినిధిగా మారిన వెంకట్రామిరెడ్డి ధరణి పేరుతో చేసిన మోసాలు బయటపెడతానని మెదక్ ఎంపీ రఘునందన్ రావు చెప్పారు. ఓ గెస్ట్ హౌస్‌లో ఉండి వివాదాస్పద ల్యాండ్‌ను తన నియంత్రణలోకి తెచ్చుకున్నారని, లావణి పట్టా భూముల్లో నిరుపేదలను బెదిరించి భూములు కొని.. కంపెనీల పేరుతో లాక్కున్నారని చెప్పారు. మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు పెండింగ్ చెక్కులను క్లియర్ చేయించే ప్రయత్నం చేస్తానన్నారు

News June 22, 2024

TU: Way 2News ఎఫెక్ట్.. హెడ్‌కుక్‌ను తొలగిస్తూ ఉత్తర్వులు

image

టీయూ గర్ల్స్ హాస్టల్లో నిన్న <<13488521>>అల్పాహారంలో కీటకం<<>> ఘటన పై వర్సిటీ అధికారులు స్పందించారు. హాస్టల్ కేర్ టేకర్, వార్డెన్ విచారణ జరిపి రిజిస్ట్రార్‌కు నివేదిక అందజేశారు. దీంతో వైస్ ఛాన్స్‌లర్ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి హెడ్ కుక్ రాజేష్‌ను సస్పెండ్ చేసి, విధుల నుంచి తొలగించారు. మిగతా సిబ్బంది కిచెన్లో పరిశుభ్రత పాటించాలని లేదంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

News June 22, 2024

జగిత్యాల: ఉరివేసుకొని యువకుడు మృతి

image

ఉరి వేసుకుని యువకుడు మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దోనూరు గ్రామంలో జరిగింది. ధర్మపురి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మామిడి ధనుంజయ్ (22) హైదరాబాదులో నివాసం ఉంటున్నాడు. ఈనెల 18న వైజాగ్‌కు ఓ వివాహానికి వెళ్లి ఓ లాడ్జిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 22, 2024

ఆదిలాబాద్: ఈనెల 24 నుంచి CBRT పరీక్షలు

image

TGPSC CBRT హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ (works Grade-ll). పరీక్షలకు సంబంధించి శనివారం ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తన ఛాంబర్‌లో లైన్ డిపార్ట్మెంట్స్ తో సమావేశం నిర్వహించారు. ఈ నెల 24 నుంచి 29 వరకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్ష జరుగుతుందని, జూన్ 30 నుంచి జులై 4 వరకు డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని నలంద కళాశాలలో పరీక్ష కేంద్రం ఉందన్నారు.

News June 22, 2024

నల్గొండ జిల్లాలోనే అత్యధికంగా

image

ధరణి సమస్యల పరిష్కారానికి మోక్షం లభించనుంది. ఎన్నికల కోడ్‌ ముగియడం, జిల్లాలకు కొత్త కలెక్టర్లు రావడంతో పెండింగ్‌లో ఉన్న ధరణి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. నల్గొండ జిల్లాలోనే అత్యధికంగా 16,733 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. సూర్యాపేటలో 7,293, యాదాద్రిలో 8,342 దరఖాస్తులు అపరిష్కృతంగా ఉన్నాయి. వచ్చే నెలాఖరులోగా అన్ని అర్జీలు పరిష్కారం అయ్యేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది.

News June 22, 2024

పాఠశాల ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు

image

ములకలపల్లిమండలం రాజీవ్ నగర్ కాలనీలో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడు పత్తిపాటి వీరయ్యను జిల్లా విద్యాశాఖ అధికారి శనివారం సస్పెండ్ చేశారు. సదరు ఉపాధ్యాయుడు నిన్న ఆల్కహాల్ సేవించి మద్యం మత్తులో పాఠశాల విధులకు హాజరైనందుకు గాను, విధులలో అలసత్వం వహించినందుకుగాను, క్రమశిక్షణా చర్యలలో భాగంగా వీరయ్యను సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

News June 22, 2024

నిర్మల్: మద్యానికి బానిసై ఆత్మహత్య

image

మద్యానికి బానిసై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిర్మల్ జిల్లా బాసర మండలంలోని కీర్గుల్ కే గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం కదం గంగాధర్ (45) అనే వ్యక్తి మద్యానికి బానిస అయ్యాడు. జీవితం మీద విరక్తితో రోడ్డమోడ్ గుట్ట వద్ద గల చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

News June 22, 2024

MBNR: సాయానికి అన్నదాతల ఎదురుచూపు!

image

పంట రుణమాఫీ, రైతుభరోసాకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 15 నాటికి రూ.2లక్షలోపు రుణం ఉన్న రైతులందరికీ ప్రభుత్వం మాఫీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. దీంతో ఉమ్మడి పాలమూరులో 5.49 లక్షల రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు. వానాకాలం సాగు ప్రారంభం కావడంతో రైతులు రైతు భరోసా పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

News June 22, 2024

రైతులకు స్వీట్లు తినిపించిన వేములవాడ ఎమ్మెల్యే

image

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకకాలంలో రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేయడం హర్షనీయమని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఈరోజు కథలపూర్ మండలం తాండ్రియాల్ గ్రామంలో రైతులతో కలసి ఆది శ్రీనివాస్ మిఠాయిలు పంపిణీ చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

News June 22, 2024

మెదక్: ఆరుద్ర కార్తె వచ్చినా.. వానల కోసం ఎదురుచూపులాయే!

image

ఆరుద్ర కార్తె వచ్చినా.. వానల కోసం రైతన్నలకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆశించినంత మేర వానలు పడకపోవడంతో ఇప్పటి వరకు చాలామంది రైతులు వరినార్లు పోయలేదు. ఈనెల మొదటి వారం నుంచే వరి పంట పండించే రైతులు నార్లు వేసే పనిలో నిమగ్నమయ్యేవారు. కానీ ఇప్పటివరకు ప్రక్రియ మొదలుకాలేదు. దీంతో ఈ యేడు వరి నాట్లు ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.