Telangana

News June 22, 2024

మెదక్: మహిళా కడుపు నుంచి 7.50 కిలోల కణతి తొలగింపు

image

మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో అరుదైన చికిత్స నిర్వహించారు. పట్టణానికి చెందిన పుట్టి యశోద అనే మహిళ గత ఆరు నెలలుగా కడుపులో కణతితో బాధపడుతుంది. స్థానికంగా ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేసుకోగా అనస్తీషియా డాక్టర్ రాఘవేంద్ర, డాక్టర్ హేమరాజ్ సింగ్ ఆపరేషన్ నిర్వహించి ఆమె కడుపులో నుండి 7.50 కిలోల కణతి తొలగించారు.

News June 22, 2024

KTDM: పుష్ప-2 వాహనంతో అభిమానుల ఫొటోలు

image

చింతూరు డివిజన్ పరిధి మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ‘పుష్ప-2’ మూవీ షూటింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఆ మూవీలో హీరో అల్లుఅర్జున్ వినియోగించిన లారీతో పాటు జీపు మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఉన్నాయి. వీటి వద్ద అభిమానులు, పర్యాటకులు పలువురు ఫొటోలు దిగుతున్నారు. దీంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా సందడిగా మారింది.

News June 22, 2024

KTDM: పుష్ప-2 వాహనంతో అభిమానుల ఫొటోలు

image

చింతూరు డివిజన్ పరిధి మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ‘పుష్ప-2’ మూవీ షూటింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఆ మూవీలో హీరో అల్లుఅర్జున్ వినియోగించిన లారీతో పాటు జీపు మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఉన్నాయి. వీటి వద్ద అభిమానులు, పర్యాటకులు పలువురు ఫొటోలు దిగుతున్నారు. దీంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా సందడిగా మారింది.

News June 22, 2024

NZB: న్యాక్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్‌స్ట్రక్షన్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అసిస్టెంట్ డైరెక్టర్ ప్రభాకర్ తెలిపారు. ల్యాండ్ సర్వేయర్, ప్లంబర్, జనరల్ సూపర్వైజర్, స్ట్రక్చర్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. జూన్ 25 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News June 22, 2024

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: మంత్రి

image

ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం ముఠాపురం, శంకర్ గిరి తండా, రాజేశ్వరపురం గ్రామాల్లో స్థానిక ప్రజలతో నిర్వహించిన సమావేశాల్లో మంత్రి హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజల నుంచి తెలుసుకున్న ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.

News June 22, 2024

రైతు రుణమాఫీ చరిత్రాత్మక ఘట్టం :మంత్రి పొన్నం

image

రైతు రుణమాఫీ చరిత్రాత్మక ఘట్టమని హుస్నాబాద్ ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. తెలంగాణ రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసి వ్యవసాయాన్ని పండగ చేయాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. రైతు బిడ్డగా, రాష్ట్ర మంత్రిగా రైతన్నకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వ్యవసాయం పండుగలా, రైతే రాజు అనే నినాదాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిజం చేస్తోందన్నారు.

News June 22, 2024

పెరిగిన ఎరువుల ధరలు

image

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎరువుల ధరలకు తోడు పురుగుమందుల ధరలు కూడా బాగా పెరిగాయి. కాంప్లెక్స్ ఎరువులు గతంలో రూ.1,300 ఉంటే ఇప్పుడు రూ.1,900కు చేరాయి. గతంలో రూ.900కు లభించిన పొటాష్ ధర రూ.1,650కు, డీఏపీ ధర రూ.1,350కు చేరింది. ఫలితంగా పంట సాగుకు పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఎరువుల ధరలు, పెట్టుబడితో పోలిస్తే ప్రభుత్వం ప్రకటించే కనీస మద్దతు ధరలు గిట్టుబాటయ్యే పరిస్థితులు లేవని రైతులు పేర్కొంటున్నారు.

News June 22, 2024

జగిత్యాల: ఏసీబీ అధికారులు రావడంతో .. SI పరార్!

image

జగిత్యాల జిల్లా రాయికల్ లో ఏసీబీ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఎస్ఐ లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇది గమనించిన ఎస్ఐ అక్కడి నుంచి పారిపోయారు. పట్టుకున్న ట్రాక్టర్‌ను విడిపించే విషయంలో ఎస్ఐ బాధితుల నుంచి రూ.25 వేలు డిమాండ్ చేశాడు. దీంతో ఏసీబీ అధికారులు ఎస్ఐపై కేసు నమోదు చేశారు.

News June 22, 2024

మా ఊర్లో మిషన్ భగీరథ నీరు వస్తలేదు: కోమటిరెడ్డి

image

తన సొంత గ్రామమైన బ్రాహ్మణ వెల్లంలలో మిషన్ భగీరథ నీరు రావటం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శనివారం జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. గత ప్రభుత్వం ఇంటింటికీ తాగు నీరు అంటూ మిషన్ భగీరథ పథకాన్ని తీసుకువచ్చిందని అన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించి నీరందడానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

News June 22, 2024

ఎమ్మెల్యే యశస్విని రెడ్డిపై రాకేశ్ రెడ్డి కామెంట్స్

image

MLA యశస్విని రెడ్డికి కనీసం మన భారతదేశ పటం పైన అవగాహన లేకపోవడం దురదృష్టకరమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే తన ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్‌లో తప్పులు ఉన్నాయన్నారు. జరిగిన పొరపాటుకు క్షమాపణలు చెప్పి మరోసారి ఇలాంటి తప్పులు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేకు రాకేశ్ రెడ్డి సూచించారు.