Telangana

News June 22, 2024

జడ్చర్లలో వ్యక్తి హత్య

image

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో దారుణ హత్య చోటుచేసుకుంది. స్థానిక MB మెడికల్ సెంటర్ వద్ద ఆంజనేయులు అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి చంపారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News June 22, 2024

ఎల్లారెడ్డిలో కత్తిపోట్లకు గురైన వ్యక్తి మృతి

image

నాగిరెడ్డిపేటలోని రాఘవపల్లిలో <<13461096>>కత్తిపోట్లకు<<>> గురైన నాగయ్య(55) చికిత్స పొందులూ శుక్రవారం మృతి చెందారు. ఈనెల 18న ఇద్దరు యువకులు అతడిపై కత్తితో దాడి చేసి గోంతు కోశారు. తీవ్రంగా గాయపడిన నాగయ్యను చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతున్న అతడికి నిన్న గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.

News June 22, 2024

మోత మోగుతున్న టమాటా ధర.. కిలో 80 పైనే

image

టమాటా ధర ఆకాశాన్నంటుతోంది. స్థానికంగా ఉత్పత్తి లేకపోవటంతో ధరకు రెక్కలొచ్చాయి. నెల క్రితం రైతు బజార్లలో కిలో రూ.25కు లభించిన టమాటా ప్రస్తుతం రూ.80 నుంచి రూ.100 వరకు పలుకుతోంది. కొత్తగూడెం మార్కెట్కు నిత్యం 300 టన్నుల మేర టమాటాను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకొని వ్యాపారులకు విక్రయిస్తారు. ప్రస్తుతం ఉత్పత్తి లేక వ్యాపారులు ఆర్డర్ చేసినా 100 టన్నులకు మించి రావడం లేదు.

News June 22, 2024

దంపతుల మృతి ఘటన.. భార్యను కాపాడబోయి..

image

విద్యుదాఘాతంతో <<13487218>>దంపతులు మృతి<<>> చెందిన ఘటన వైరాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంజనేయులు (60) నరసమ్మ (55) దంపతులు వైరాలోని హనుమాన్ బజార్ నివాసం ఉంటున్నారు. నరసమ్మ దుస్తులు ఆరేస్తుండగా కరెంట్ షాక్ వచ్చింది. కేకలు వేయగా ఆంజనేయులు కాపాడేందుకు వెళ్లాడు. ఇద్దరూ కరెంట్ షాక్‌తో మృతి చెందారు.

News June 22, 2024

MBNR: సీనియార్టీ జాబితా విడుదల.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల

image

స్కూల్ అసిస్టెంట్ సమానస్థాయి ఉపాధ్యాయుల బదిలీలకు రంగం సిద్ధమైంది. సెప్టెంబరులో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా 9,824 మంది ఉపాధ్యాయులు బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మల్టీజోన్-2లో శుక్రవారం స్కూల్ అసిస్టెంట్ బదిలీల కోసం తాత్కాలిక సీనియార్టీ జాబితాలను విడుదల చేశారు. వీటిపై అభ్యంతరాలు స్వీకరించి శనివారం ఉదయం వెబ్ ఆప్షన్ల నమోదు పూర్తి కాగానే ఆన్లైన్‌లో బదిలీ ఉత్తర్వులు జారీ చేయనున్నారు.

News June 22, 2024

హైదరాబాద్‌లో‌ మరో దారుణహత్య

image

హైదరాబాద్‌లో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. 24 గంటల్లోనే మరో మర్డర్ జరిగింది. పాతబస్తీలోని నవాబ్‌సాహెబ్‌కుంట అచ్చిరెడ్డినగర్‌లో మొహమ్మద్ జాకీర్ హుస్సేన్ దారుణ హత్య‌కు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫలక్‌నుమా పోలీసులు‌, క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తున్నారు. జాకీర్‌ హుస్సేన్‌‌ను బంధువులే హత్య చేసినట్లు‌ తెలుస్తోంది.

News June 22, 2024

హైదరాబాద్‌లో‌ మరో దారుణహత్య

image

హైదరాబాద్‌లో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. 24 గంటల్లోనే మరో మర్డర్ జరిగింది. పాతబస్తీలోని నవాబ్‌సాహెబ్‌కుంట అచ్చిరెడ్డినగర్‌లో మొహమ్మద్ జాకీర్ హుస్సేన్ దారుణ హత్య‌కు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫలక్‌నుమా పోలీసులు‌, క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తున్నారు. జాకీర్‌ హుస్సేన్‌‌ను బంధువులే హత్య చేసినట్లు‌ తెలుస్తోంది..

News June 22, 2024

ADB: అటవీ ప్రాంతంలో ట్రాప్ కెమెరాకు చిక్కిన చిరుత

image

ఆదిలాబాద్ జిల్లాలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. తలమడుగు మండలం కుచులాపూర్ అటవీప్రాంతంలో సంచరిస్తున్న చిరుత అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమరాకు చిక్కింది. తాజాగా అటవీశాఖ అధికారులు చిరుత ఫొటోను విడుదల చేశారు. కాగా అడవికి పశువుల కాపరులు ఎవరూ వెళ్లకుండా అవగాహన కల్పిస్తున్నట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రణ్‌వీర్ తెలిపారు. బేస్ క్యాంపులు సైతం ఏర్పాటు చేశామన్నారు.

News June 22, 2024

KNR: డిగ్రీ పరీక్షల్లో ఆరుగురు విద్యార్థులు డిబార్

image

శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలో జరుగుతున్న డిగ్రీ రెండో, నాలుగో సెమిస్టర్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన ఆరుగురు విద్యార్థులు డిబార్ అయినట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ శ్రీరంగ ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలు తెలిపారు. విద్యార్థులు సక్రమంగా పరీక్షలు హాజరుకావాలని ఆయన సూచించారు.

News June 22, 2024

వరంగల్: పోలీసు శాఖపై ఆందోళన

image

కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ మహిళా హెడ్ కానిస్టేబుల్‌పై లైంగిక దానికి పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. రక్షణ కల్పించాల్సిన పోలీసుల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని కొందరు పోలీసుల వైఖరి పోలీసు శాఖకు తలవంపులు తెస్తోంది. కొంతమంది తరచూ ఏదోచోట వివాదాల్లో తల దూర్చి వార్తల్లో నిలుస్తున్నారు.