India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అడ్డకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నేషనల్ హైవే ఉండటం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటదని ప్రతినిత్యం హైవే పై ట్రాఫిక్ నియంత్రణను జాగ్రత్తగా పర్యవేక్షించాలని ఎస్పీ డి.జానకి తెలిపారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని, హైవేపై రోడ్డు భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు, భూత్పూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు ప్రశాంతంగా వినాయక ఉత్సవాలు జరుపుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని శుక్రవారం ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి గణపతి మండపాన్ని జియో ట్యాగింగ్ చేసి బందోబస్తు పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ యువతకు చేరువై వారి సహకారంతో ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు.
భారీ వర్షాలు, వరదల కారణంగా మెదక్ జిల్లాలో అన్ని చెరువులు నిండుకుండలా మారాయి. కావున వినాయక నిమజ్జనాల సమయంలో భక్తులు జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. శుక్రవారం జిల్లాలో చెరువుల పరిస్థితిపై మాట్లాడారు. మెదక్ జిల్లాలో 2,632 చెరువులు భారీ వర్షాలతో పూర్తిగా నిండిపోయాయన్నారు. వినాయక నిమజ్జన సమయంలో పోలీస్, రెవెన్యూ మున్సిపల్, పంచాయితీ అధికారుల సూచనలు పాటించాలన్నారు.
వాతావరణంలో వచ్చిన మార్పులతో విషజ్వరాలు నగర ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. వైరస్, దోమకాటుతో జలుబు, దగ్గు, డెంగ్యూ, టైఫాయిడ్ వణికిస్తున్నాయి. బస్తీ దవఖానా నుంచి ఏరియా జిల్లా ఆస్పత్రి వరకు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. గాంధీ, నిమ్స్ ఇతర ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రైవేటు ఆస్పత్రుల్లో గత 2 నెలలతో పోల్చితే ఆగస్టులో విషజ్వరాల బాధితుల సంఖ్య గణనీయంగా పెరిగిందని వైద్యాధికారులు తెలిపారు. జాగ్రత్తలు పాటించండి.
అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభవుతున్న నేపథ్యంలో జిల్లా సమస్యలపై అధికార, ప్రతిపక్ష MLAలు తమ గళం వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినా ఏ వర్గానికి న్యాయం చేయలేదని జగదీశ్ రెడ్డి విమర్శించారు. ఉద్యోగుల భృతి, నిరుద్యోగులకు ఉద్యోగాల క్యాలెండర్, రైతుల రుణమాఫీ, యూరియా కొరత వంటి సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని ఆయన పేర్కొన్నారు.
జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద అర్హులైన వారి నుంచి ఇంటింటికి తిరిగి దరఖాస్తులు స్వీకరించాలని ఆర్డీఓ అశోక్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నల్గొండ డివిజన్‌లోని తొమ్మిది మండలాలు, మూడు మున్సిపాలిటీలలో ఏప్రిల్ 12, 2017 నుంచి ఈ నెల 23 వరకు 2,249 మంది మృతి చెందినట్లు ఆయన తెలిపారు. ఈ పథకంపై అవగాహన కల్పించి దరఖాస్తులను సేకరించాలని సూచించారు.
నల్గొండ జిల్లాలోని తెలంగాణ మోడల్ స్కూళ్లలో 2025-26 విద్యా సంవత్సరానికి ఆరు నుంచి పదవ తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో మిగిలిన సీట్లలో నేరుగా ప్రవేశాలు కల్పిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంబంధిత మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లను సంప్రదించాలని ఆయన సూచించారు.
పాలమూరు యూనివర్సిటీలోని లైబ్రరీ ఆడిటోరియంలో నేడు ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.చంద్ర కిరణ్ తెలిపారు. ముఖ్యఅతిథిగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి,PU వైస్ ఛాన్సలర్ జిఎన్. శ్రీనివాస్ హాజరుకానున్నారు. ఇంజనీరింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఎండీ గౌస్ మొయినుద్దీన్ పాల్గొన్నారు.
జిల్లాలోని 317 గ్రామ పంచాయతీల్లో విడుదల చేసిన 3,83,736 డ్రాఫ్ట్ ఓటర్ జాబితాపై అభ్యంతరాలు తెలపాలని పార్టీల ప్రతినిధులను కలెక్టర్ డా.సత్య శారద కోరారు. శుక్రవారం జడ్పీ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమైన ఆమె, జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 30లోపు తెలియజేయాలని కోరారు. ఈ నెల 31 లోపు అభ్యంతరాలు పరిష్కరించి, సెప్టెంబర్ 2న తుది జాబితా ప్రచురిస్తామన్నారు.
మహాగణపతి నిమజ్జన ఘట్టంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని శాంతి భద్రతల విభాగం అదనపు కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్ ఆదేశించారు. ముఖ్యంగా ఖైరతాబాద్ మహా గణపతి క్రేన్ వద్దకు వచ్చే సమయంలో తొక్కిసలాటలు జరగకుండా చూడాలన్నారు. అధికారులు, ట్రాఫిక్ పోలీసులతో కలిసి ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్‌లో పర్యటించారు.
Sorry, no posts matched your criteria.