Telangana

News June 22, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో TODAY HEADLINES

image

∆} వివిధ శాఖల అధికారులతో ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం ∆} పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన ∆} అన్నపురెడ్డిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} పాల్వంచలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} వైరా నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు

News June 22, 2024

భద్రాద్రి రాములోరి భూములకు రక్షణ కవచం

image

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానం భూముల రక్షణకు ఆ శాఖ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి అంగుళం భూమికి పక్కా దస్త్రాలను ఆన్లైన్లో సిద్ధం చేయాలని భావిస్తున్నారు. మాన్యం ఆక్రమణకు గురి కాకుండా ఉండేందుకు వ్యూహరచన చేస్తున్నారు. దేవుని ఆస్తి ఎక్కడున్నా అది దేవునికే చెందుతుందని ఇప్పటికే ఉన్నత వర్గాలు స్పష్టం చేశాయి. రాములవారికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖరీదైన భూములు ఉన్నాయి.

News June 22, 2024

రఘునాథపల్లి: అత్తారింటిపై అల్లుడి దాడి 

image

అత్తగారి ఇంటిపై అల్లుడు దాడి చేసిన ఘటనలో ఆరుగురుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలానికి చెందిన ఆరూరి అనితకు నెల్లుట్లకి చెందిన ఉమేందర్‌తో వివాహం జరిగింది. ఉమేందర్ అనితను అదనపు కట్నం తేవాలని వేధిస్తుండగా పుట్టింటికి వెళ్ళింది. దీంతో ఉపేందర్ తన స్నేహితులతో కలిసి అత్తారింటిపై దాడి చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News June 22, 2024

సుల్తానాబాద్: వృద్ధుడిపై పోక్సో కేసు నమోదు

image

సుల్తానాబాద్ పట్టణంలో మరో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల బాలికపై వృద్ధుడు లైంగిక దాడికి యత్నించాడు. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామంలో బాలికకు తాత వరుసైన పోచాలు(60) ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. భయపడిన బాలిక తల్లిదండ్రులకు తెలుపగా బాలిక తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో వృద్ధుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News June 22, 2024

కాంగ్రెస్‌లోకి BRS హైదరాబాద్ MLAలు?

image

గ్రేటర్‌‌లో BRS‌ను వీడేందుకు MLAలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నలుగురు లేదా ఐదుగురు కాంగ్రెస్ మంత్రులతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. MP ఎన్నికల ముందు‌ మేయర్‌తో పాటు పలువురు కార్పొరేటర్లు పార్టీని వీడారు. ఇటీవల ఒక్కరిద్దరు BRS MLAలు మంత్రులను కలిశారు. దీనికితోడు కాంగ్రెస్‌లోకి రావాలని ఇటీవల దానం నాగేందర్‌ ఓపెన్ ఆఫర్ చేయడం‌ గమనార్హం. ఇక పార్టీ మారే‌ MLAలు ఎవరనేది‌ తెలియాల్సి ఉంది.

News June 22, 2024

కాంగ్రెస్‌లోకి BRS హైదరాబాద్ MLAలు?

image

గ్రేటర్‌‌లో BRS‌ను వీడేందుకు MLAలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నలుగురు లేదా ఐదుగురు కాంగ్రెస్ మంత్రులతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. MP ఎన్నికల ముందు‌ మేయర్‌తో పాటు పలువురు కార్పొరేటర్లు పార్టీని వీడారు. ఇటీవల ఒక్కరిద్దరు BRS MLAలు మంత్రులను కలిశారు. దీనికితోడు కాంగ్రెస్‌లోకి రావాలని ఇటీవల దానం నాగేందర్‌ ఓపెన్ ఆఫర్ చేయడం‌ గమనార్హం. ఇక పార్టీ మారే‌ MLAలు ఎవరనేది‌ తెలియాల్సి ఉంది.

News June 22, 2024

వైరాలో కరెంట్ షాక్‌తో దంపతులు మృతి

image

ఖమ్మం జిల్లా వైరాలో తీవ్ర విషాదం జరిగింది. విద్యుదాఘాతంతో వృద్ధ దంపతులు మృతి చెందారు. హనుమాన్ బజార్‌లో ఈ ఘటన జరిగింది. ప్రమాదం ఎలా జరిగిందో తెలియాల్సి ఉంది.

News June 22, 2024

వనపర్తి: 270 ట్రాక్టర్ల ఇసుక సీజ్

image

వనపర్తి జిల్లా రేవల్లి మండలం కేశంపేట చెరువులో ఫిల్టర్ ఇసుకను తయారుచేయడానికి నిల్వచేసిన 270 ట్రాక్టర్ల ఇసుకను శుక్రవారం రెవెన్యూ, పోలీసు అధికారులు సీజ్ చేశారు. అక్రమ ఇసుక వ్యాపారులు చెరువులోని మట్టితో కూడిన ఇసుకను ఓ చోట నిల్వచేశారు. సమాచారమందుకున్న తహసీల్దార్ లక్ష్మీ, ఎస్సై తిరుపతిరెడ్డి పోలీసు సిబ్బందితో అక్కడికి వెళ్లారు. నిల్వచేసిన ఇసుక డంపును పరిశీలించారు. సీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

News June 22, 2024

తెలంగాణలోకి మావోయిస్టులు?

image

దండకారణ్యంలో పోలీసు నిర్బంధం పెరిగిపోవడంతో మావోయిస్టులు షెల్టర్ జోన్‌గా తిరిగి తెలంగాణ బాట పడుతున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ కగార్లో భాగంగా ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై భద్రతా దళాలు దాడులను తీవ్రం చేశాయి. జనవరిలో మొదలైన ముప్పేట దాడులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. దీంతో ఆత్మరక్షణ కోసం మావోయిస్టు పార్టీలో నేతలు తమ వ్యూహాలను మార్చి లేఖలను విడుదల చేస్తున్నారు.

News June 22, 2024

మెదక్: ఉమ్మడి జిల్లాలో రుణమాఫీ లబ్ధిదారులు వీరే!

image

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. శుక్రవారం వాటి విధివిధానాలను ప్రకటించింది. ఉమ్మడిజిల్లాలో రైతుల వివరాలిలా ఉన్నాయి. మెదక్‌లో 1,48,218 మంది రైతులు రూ.828 కోట్ల రుణం తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో 1,79,322 మంది రైతులకు రూ. 2505.52 కోట్ల అప్పు మాఫీ కానుంది. సిద్దిపేట జిల్లాలో 1.75లక్షల మంది రైతులకు సుమారు రూ.2,600 కోట్ల బకాయిలు తీరనున్నాయి.