Telangana

News June 22, 2024

నిజామాబాద్‌లో హైటెక్ వ్యభిచారం.. గుట్టును రట్టు చేసిన పోలీసులు

image

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వాట్సాప్‌లో అమ్మాయిల ఫొటోలు పంపి విటులను రప్పించి హైటెక్ వ్యభిచారం చేస్తున్న గుట్టును పోలీసులు శుక్రవారం రట్టు చేశారు. సుభాష్ నగర్ ఏరియాలో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే పక్క సమాచారం మేరకు 3 టౌన్ ఎస్ఐ ప్రవీణ్, టౌన్ సీఐ నరహరి వ్యభిచార గృహంపై దాడి చేశారు. ఇద్దరు మహిళలతో పాటు, ఒక విటుడిని, వ్యభిచార నిర్వాహకురాలిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

News June 22, 2024

బండి సంజయ్ పర్యటనలో దొంగల హల్ చల్!

image

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ శుక్రవారం హుజూరాబాద్‌కు వచ్చిన సందర్భంలో అంబేడ్కర్ చౌరస్తాలో జేబు దొంగలు హల్ చల్ సృష్టించారు. BJP నాయకులు, కార్యకర్తలు బండి సంజయ్ వచ్చిన సంబరాల్లో మునిగి తేలగా జేబు దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. ఒకరు ఇద్దరు కాదు ఏకంగా 10, 15 మంది జేబుల్లో ఉన్న డబ్బులను గుట్టు చప్పుడు కాకుండా దొంగలించారు. దీంతో బీజేపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News June 22, 2024

KCR, KTRతోనే నా రాజకీయ ప్రయాణం: వినయ్ భాస్కర్

image

KCR, KTR తోనే తన రాజకీయ ప్రయాణం సాగుతుందని.. అందులో ఎవరూ అనుమానం పెట్టుకోవద్దని హనుమకొండ జిల్లా BRS అధ్యక్షుడు, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ స్పష్టం చేశారు. ప్రాణం లాంటి పార్టీని వీడేది లేదని, తనపై కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని పార్టీ శ్రేణులు తిప్పికొట్టాలని ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజల సమస్యలపై పోరాడాల్సిన బాధ్యత పార్టీపై ఉందన్నారు.

News June 22, 2024

ఓయూ: జులై 6వ తేదీ నుంచి సీపీజీఈటీ పరీక్షలు

image

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల పరిధిలో అన్ని పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే సీపీజీఈటీ – 2024 పరీక్షలను జులై 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి HYDలో తెలిపారు. ఈ పరీక్షలను రోజూ మూడు సెక్షన్లలో నిర్వహిస్తామని చెప్పారు. పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను జులై మూడో తేదీ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. SHARE IT

News June 22, 2024

బస్సు పాస్ కోసం User ID, Password పొందాలి: RM

image

విద్యార్థుల బస్సు పాసుల కోసం యూజర్ ఐడీ, పాస్వర్డ్ పొందాలని ఆర్టీసీ RM ప్రభులత తెలిపారు. ఉమ్మడి జిల్లాలో విద్యాసంస్థలు తెరుచుకున్న సందర్భంగా బస్సు పాసుల కోసం సంగారెడ్డి రీజనల్‌లోని 8 డిపోల్లో అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. బస్సు పాసుల కోసం విద్యార్థులు వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలని, వాటిని కళాశాలల యాజమాన్యం అప్రూవల్ చేయాలన్నారు. తర్వాత బస్సు పాస్ పొందవచ్చని అన్నారు.

News June 22, 2024

HYD: జులై 6వ తేదీ నుంచి సీపీజీఈటీ పరీక్షలు

image

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల పరిధిలో అన్ని పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే సీపీజీఈటీ – 2024 పరీక్షలను జులై 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి HYDలో తెలిపారు. ఈ పరీక్షలను రోజూ మూడు సెక్షన్లలో నిర్వహిస్తామని చెప్పారు. పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను జులై మూడో తేదీ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. SHARE IT

News June 22, 2024

పాల్వంచ: కేటీపీఎస్ అధికారులతో ఎమ్మెల్యే సమావేశం

image

కేటీపీఎస్ స్క్రాప్ టెండర్ల అవినీతి అక్రమాల నిగ్గు తేల్చే వరకు విశ్రమించనని ఎమ్మెల్యే సాంబశివరావు అన్నారు. ఇటీవల కాలంలో కేటీపీఎస్ O&M స్క్రాప్ టెండర్, తరలింపు విషయాల్లో వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం O&M DD ప్రాంతాన్ని ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం సిఈ చాంబర్‌లో అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన టెండర్ ప్రక్రియ, విచారణ కమిటీకి అందించిన నివేదికల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

News June 22, 2024

HYD: జులై 6వ తేదీ నుంచి సీపీజీఈటీ పరీక్షలు

image

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల పరిధిలో అన్ని పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే సీపీజీఈటీ – 2024 పరీక్షలను జులై 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి HYDలో తెలిపారు. ఈ పరీక్షలను రోజూ మూడు సెక్షన్లలో నిర్వహిస్తామని చెప్పారు. పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను జులై మూడో తేదీ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. SHARE IT

News June 22, 2024

వరంగల్ మార్కెట్‌కు రెండు రోజుల సెలవు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు 2 రోజులు సెలవులు రానున్నాయి. శనివారం వారాంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉండనుంది. రైతులు విషయాన్ని గమనించి ఈ రెండు రోజులు మార్కెట్‌కి సరుకులు తీసుకొని రావద్దని, విషయాన్ని గమనించాలని అధికారులు సూచిస్తున్నారు.

News June 22, 2024

డిప్లొమా కోర్సులో ప్రవేశం కొరకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఆదిలాబాద్ శ్రీ కొండా లక్ష్మణ్ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం, ఉద్యాన పాలిటెక్నిక్‌లో 2024-25 విద్యా సంవత్సరం కోసం డిప్లొమా కోర్సులో ప్రవేశం కొరకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు వైస్ ప్రిన్సిపల్ మురళి తెలిపారు. 40 సీట్లు ప్రవేశాల కొరకు జులై 15 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించవలసి ఉంటుందన్నారు. పూర్తి వివరాల కోసం www.skltshu.ac.in వెబ్సైట్‌ను సంప్రదించాలన్నారు.