Telangana

News June 21, 2024

కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆర్ఎస్ ప్రవీణ్ ఫైర్

image

దేశంలో హోం మంత్రి, విద్యాశాఖ మంత్రి లేని రాష్ట్రం ఏదైనా ఉందా అంటే అది తెలంగాణ మాత్ర‌మేనని BRS నేత RS ప్ర‌వీణ్ కుమార్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి హోం శాఖ, విద్యాశాఖ, ఎస్సీ సంక్షేమ శాఖ, రకరకాల శాఖలు తన గుప్పెట్లో పెట్టుకుని రాష్ట్రాన్ని పూర్తిగా అభద్రతా భావంలోకి నెడుతున్నార‌ని పేర్కొన్నారు. 24 గంటల్లో 5 హత్యలు, 2 హత్యాయత్నాలు జ‌రుగుతుంటే శాంతి భద్రత వ్యవస్థ ఎక్కడ ఉంది? అని ప్రశ్నించారు.

News June 21, 2024

HYD: ప్రభుత్వ కాలేజీలకు ప్రవేశాల కళ

image

HYD, RR, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లోని ప్రభుత్వ కాలేజీల్లో గతేడాదితో పోలిస్తే ప్రవేశాల సంఖ్య ఈసారి భారీగా పెరిగింది. హైదరాబాద్ జిల్లాలో 22 ప్రభుత్వ కాలేజీల్లో గతేడాది 8 వేల మందికిపైగా విద్యార్థులు చేరగా ఈ ఏడాది జూన్ మొదటి వారంలోనే 6వేల మందికి పైగా దరఖాస్తులు సమర్పించారు. రెండేళ్లుగా ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశాల సంఖ్య వేగంగా పెరుగుతోందని హైదరాబాద్ ఇంటర్ బోర్డ్ అధికారి దాసరి ఒడ్డెన్న తెలిపారు.

రెచ్చగొట్టే ప్రసంగాలు తప్ప.. ఉద్యోగాల చర్చ లేదు: జగ్గారెడ్డి

image

బీజేపీ, మంత్రులకు రెచ్చగొట్టే ప్రసంగాలు తప్పితే ఉద్యోగుల చర్చ లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. గాంధీ భవన్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రానికి ఐటీఐఆర్ యూపీఏ ప్రభుత్వం మంజూరు చేస్తే నరేంద్ర మోదీ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. చేరికల అంశం తన పరిధిలో లేదని తెలిపారు.

News June 21, 2024

BREAKING: HYD: లంచం తీసుకుంటూ దొరికిన CI

image

లంచం తీసుకుంటూ ఓ సీఐ రెడ్ హ్యాండెడ్‌గా ఈరోజు దొరికాడు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాలు.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం సీఐ వెంకటేశం ఓ కేసు పరిష్కారం విషయమై రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఈ మేరకు సూరారం పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

HYD: ఆ ఘటనతో మోదీకి ఏం సంబంధం?: శివాజీ

image

నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఏం సంబంధం ఉందని ప్రతి పక్షాలను శివసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సింకారు శివాజీ ప్రశ్నించారు. శుక్రవారం HYD హిమాయత్‌నగర్‌లోని పార్టీ స్టేట్ ఆఫీస్‌లో ఆయన మాట్లాడారు. ఎన్టీఏను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మలు దహనం చేయడం సరికాదని సూచించారు. విద్యార్థులకు నష్టం చేసే లీకేజీ వ్యవహారాలను ప్రధాని సహించరని అన్నారు.

NLG: నంబర్ ప్లేట్లు లేని వాహనదారులపై కేసు నమోదు: SP

image

జిల్లాలో వాహనాలకు నంబర్ ప్లేట్లు లేకుండా నడపవద్దని, ప్రతి రోజూ జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తూ ట్రాఫిక్ నిబంధనల విరుద్ధంగా వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేయబడుతాయని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు. ఈ రోజు జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 551 వాహనాలను పట్టుబడి చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

News June 21, 2024

ఏసీబీకి చిక్కిన న్యాల్‌కల్ RI దుర్గయ్య

image

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ తహశీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఆర్ఐ దుర్గయ్య రూ.75 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఆర్ఐని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల ఉమ్మడి మెదక్ జిల్లాలో అవినీతి అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నా అధికారుల్లో అవినీతి తగ్గడం లేదని జిల్లాలో చర్చించుకుంటున్నారు.