Telangana

News June 21, 2024

యాదాద్రి: తుమ్మలగూడెం చెరువులో మృతదేహం లభ్యం

image

రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం (తుమ్మల గూడెం) చెరువులో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికులు జాలర్లు, వలల సహాయంతో మృతదేహాన్ని బయటకి తీశారు. మృతుడు బ్లూ కలర్ చొక్కా, ధరించి ఉన్నాడు, వయసు సుమారు 35 నుండి 45 సంవత్సరాలు ఉంటుందని స్థానికులు తెలిపారు. హత్యా.? ఆత్మహత్యా.? అని చుట్టుపక్కల వారు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 21, 2024

ఖమ్మం: ‘ఇక్కడి కందిపప్పుకు ప్రపంచంలోనే విశిష్ట స్థానం’

image

పెరుగుతున్న అవసరాల దృష్టిలో ఉంచుకుని దేశంలో పప్పు దినుసుల సాగును పెంచాల్సి ఉందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. శుక్రవారం కేంద్ర మంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌‌లో మంత్రి తుమ్మల హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో పండించే తాండూరు కంది పప్పుకు ప్రపంచంలోనే విశిష్ట స్థానం ఉందని, ప్రతి సంవత్సరం 4 లక్షల క్వింటాళ్ళ కందిపప్పు అక్కడ నుంచి మార్కెట్‌కు వస్తుందని మంత్రి తుమ్మల వెల్లడించారు.

News June 21, 2024

బోనకల్: అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన కారు

image

బోనకల్- ఖమ్మం రహదారిలో ఓ కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకు వెళ్లిన ఘటన శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బోనకల్ నుంచి ఖమ్మం వెళ్తున్న కారు అదుపు తప్పి పక్కనే ఉన్న కాలువలకు దూసుకు వెళ్లిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారికి స్వల్ప గాయాలు అయ్యాయని స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 21, 2024

అప్రమత్తంగా ఉందాం.. అభివృద్ధిని సాదిద్ధాం: కోదండరాం

image

ప్రభుత్వం అంటే ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పని చేయాలని, తెలంగాణ అభివృద్ధి విషయంలో ఇప్పుడే మరింత అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్ర జరుగుతోందంటూ ప్రొ.కోదండరాం అభిప్రాయపడ్డారు. శుక్రవారం షాద్నగర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా టి.జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రొ. కె.జయశంకర్ నూతన విగ్రహాన్ని ఆవిష్కరణ చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం మరింత సంఘటితంగా ప్రయత్నించాలన్నారు

News June 21, 2024

HYD: తెలంగాణ భవన్‌లో జయశంకర్ విగ్రహానికి నివాళులు

image

ఆచార్య కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఈరోజు HYD బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్‌లో వారి విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు నివాళులర్పించారు. మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, మహమూద్ అలీతో పాటు పొన్నాల లక్ష్మయ్య సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తన జీవితాంతం తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తి కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని కొనియాడారు.

NZB: బండరాయితో కొట్టి హత్య..?

image

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గురువారం అర్ధరాత్రి వన్ టౌన్ పరిధిలోని పవన్ థియేటర్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి తలపై దుండగులు బండరాయితో మోదడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. పోలీసులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడు ఎవరనేది ఇంకా తెలియలేదు.

News June 21, 2024

HYD: గాంధీ ఆస్పత్రిలో MLA భార్య మృతదేహానికి ముగిసిన పోస్టుమార్టం

image

కాంగ్రెస్ నేత, చొప్పదండి MLA మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి మృతదేహానికి సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్‌లో ఈరోజు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా HYD జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు గాంధీ ఆసుపత్రిని సందర్శించి పోస్టుమార్టం నిర్వహించే మార్చురీ వద్ద డాక్టర్లతో మాట్లాడారు. నిన్న రాత్రి MLA భార్య రూపాదేవి ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే.

నాగార్జునసాగర్ నీటి నిల్వ సమాచారం

image

నాగార్జునసాగర్ జలాశయంలో నీటి మట్టం రోజు రోజుకూ తగ్గుతుంది. పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను 504.40 అడుగులు, పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.00 టీఎంసీలకు గాను 122.3596 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. జలాశయానికి ఇన్ఫో నిల్ ఉండగా, ఔట్ ఫ్లో 800 క్యూసెక్కులు ఉందని పేర్కొన్నారు.