Telangana

News June 21, 2024

భద్రాద్రి జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత

image

భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెంలో శుక్రవారం పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు కారులో తరలిస్తున్న 150 కిలోల నిషేధిత గంజాయిని స్థానిక పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన కారును 150 కిలోల గంజాయిని పోలీసులు సీజ్ చేసి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

News June 21, 2024

HYD: ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం

image

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలసి జూబ్లీహిల్స్‌లో తన నివాసంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తెలంగాణనే ప్రాణంగా, స్వరాష్ట్రమే ధ్యేయంగా తన జీవితాన్ని అర్పించిన వ్యక్తి జయశంకర్ అని అన్నారు.

News June 21, 2024

HYD: ఇంటర్నేషనల్ యోగా డేలో పాల్గొన్న హీరో నవీన్ చంద్ర

image

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలుగు హీరో నవీన్ చంద్ర పాల్గొన్నారు. ఎన్ని కార్యక్రమాలు ఉన్నా, షూటింగ్ ఉన్నా.. ప్రతిరోజు 20 నిమిషాలు యోగాకు కేటాయిస్తానని తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగా చేయడం వల్ల బ్యాలెన్స్‌గా ఉంటారని పేర్కొన్నారు.

News June 21, 2024

ఇంటర్నేషనల్ యోగా డేలో పాల్గొన్న హీరో నవీన్ చంద్ర

image

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలుగు హీరో నవీన్ చంద్ర పాల్గొన్నారు. ఎన్ని కార్యక్రమాలు ఉన్నా, షూటింగ్ ఉన్నా.. ప్రతిరోజు 20 నిమిషాలు యోగాకు కేటాయిస్తానని తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగా చేయడం వల్ల బ్యాలెన్స్‌గా ఉంటారని పేర్కొన్నారు.

News June 21, 2024

HYD: తనిఖీల కోసం మరో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాం!

image

HYD నగరం సహా శివారు జిల్లాల్లో ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల సమక్షంలో ఇప్పటికే తనిఖీలు కొనసాగుతున్నాయి. అయితే ఈ తనిఖీలను మరింత వేగవంతం చేసి, కఠిన చర్యలను తీసుకొని, అమలు చేసే విధంగా ప్రత్యేక మరో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.

కరీంనగర్: డిగ్రీ పరీక్షల్లో ముగ్గురు విద్యార్థుల డిబార్

image

శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ రెండో, నాలుగో సెమిస్టర్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. కాగా రెండో రోజు గురువారం జరిగిన పరీక్షల్లో ముగ్గురు విద్యార్థులు డిబార్ అయినట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఎన్వీ శ్రీరంగ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు సక్రమంగా పరీక్షలకు హాజరుకావాలని సూచించారు.

News June 21, 2024

అల్బెండజోల్‌తో రక్తహీనతకు చెక్: DMHO మాలతి

image

పిల్లలను రక్తహీనత నుండీ కాపాడేందుకు ఆల్బెండజోల్ మాత్రలు వేసే కార్యక్రమం చేపట్టినట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.మాలతి వెల్లడించారు. జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమంలో భాగంగా ఖమ్మంలోని ఎన్నెస్పీ క్యాంప్ కార్యాలయంలో, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం ఆమె, డీఈఓ సోమశేఖర శర్మతో కలిసి విద్యార్థులకు మాత్రలు మింగించే కార్యక్రమం ప్రారంభించారు.

News June 21, 2024

UPDATE.. HYD: విద్యుత్ షాక్ తగిలి విద్యార్థి మృతి

image

విద్యుత్ షాక్ తగిలి ఓ ఇంటర్ <<13480534>>ఫస్టియర్ విద్యార్థి<<>> మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసుల ప్రకారం.. కోహెడ మండలంలోని ఓ కళాశాలలో గిరీశ్ కుమార్ అనే విద్యార్థి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. తనకు హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేక గోడ దూకి పారిపోదామనుకున్నాడు. ఈ క్రమంలో గోడపై ఉన్న విద్యుత్ తీగలు తగిలి గిరీశ్ అక్కడికక్కడే మృతి చెందాడు.

News June 21, 2024

ఉమ్మడి MBNR జిల్లాలో నేటి ఉష్ణోగ్రత వివరాలు ఇలా..

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా.. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండలో 38.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గద్వాల జిల్లా అలంపూర్లో 37.8, మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్లో 37.5, వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్లో 36.8, నారాయణపేట జిల్లా కృష్ణలో 36.7 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.