Telangana

News June 21, 2024

HYD: సచివాలయంలో నేడు కేబినెట్ భేటీ

image

సచివాలయంలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటి కానుంది. పరిపాలనకి సంబంధించిన అనేక అంశాలపై కేబినెట్ చర్చించనున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల పంపకాలపై చర్చించనున్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసాకి నిధుల సమీకరణపై చర్చ.. కట్ ఆఫ్ పెట్టాలని ప్రభుత్వం ఆలోచన చెయ్యనుంది. రుణమాఫీపై మహారాష్ట్ర, రాజస్థాన్‌లో పర్యటించి అధ్యయనం చేసిన అధికారులు, విద్యుత్ ఒప్పందాలు, కాళేశ్వరంపై మాట్లాడతారు.

News June 21, 2024

NLG: జిల్లాలో భూముల విలువ పెంపు!

image

భూముల విలువలు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 2022లో పెంచిన భూముల రేట్లను మళ్లీ ఇప్పుడు ఆగస్టు 1 నుంచి పెంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఉన్న ధరలకు, ప్రభుత్వం మార్కెట్ ధరకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. జిల్లాలో పొటెన్షియల్ ఏరియాను బట్టి ఏ మేరకు భూముల విలువ పెంచవచ్చనే దానిపై భూముల విలువకు సంబంధించిన కమిటీ నిర్ణయాలు తీసుకోనుంది.

News June 21, 2024

యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం: కిషన్ రెడ్డి

image

తెలంగాణలో ఘనంగా అంతర్జాతీయ యోగా దశాబ్ధి ఉత్సవాలు జరుగుతున్నాయి. నిజాం కాలేజీ గ్రౌండ్‌లో ఉత్సవాల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర బొగ్గు గనుల సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబే, రాజ్య సభ సభ్యుడు లక్ష్మణ్ బిజెపి నేతలు పాల్గొన్నారు. విద్యార్థులు యోగా శరీరం మనుసును కలుపుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం, యోగానే ఒక్క డాక్టర్ అని అన్నారు.

సుంకేసుల జలాశయంలో గుర్తుతెలియని శవం లభ్యం

image

రాజోలిలో సుంకేసుల జలాశయంలో గుర్తుతెలియని మృత దేహం శవం లభ్యమైనట్టు రాజోలి ఎస్సై జగదీశ్ తెలిపారు. వివరాల ఇలా.. సుంకేసుల బ్యారేజీ దగ్గర ఉదయం మృతదేహం ఉన్నట్టుగా సమాచారం రావడంతో అక్కడికి వెళ్లి దర్యాప్తు చేపట్టామన్నారు. బ్యారేజ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడా..! లేక ఎగువ నుంచి మృతదేహం నీటి ప్రవాహానికి కొట్టుకు వచ్చిందా అనే పలు అనుమానాలతో కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు.

News June 21, 2024

NLG: ఉమ్మడి జిల్లాలో డిగ్రీ డీలా..!

image

ఉమ్మడి జిల్లాలో డిగ్రీ కాలేజీల మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది. డిగ్రీ సంప్రదాయ కోర్సుల్లో అడ్మిషన్ తీసుకునేందుకు విద్యార్థులు అంతగా ఆసక్తి చూపడం లేదు . ఒకప్పుడు విద్యార్థులతో కళకళలాడిన ఈ కాలేజీలు నేడు వెలవెలబోతున్నాయి. MG యూనివర్సిటీ పరిధిలో 62 ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలో 24 వేల సీట్లు ఉన్నాయి. 2 విడతల్లో దోస్త్ ద్వారా ప్రవేశాల ప్రక్రియ నిర్వహించినా 16 శాతం కూడా అడ్మిషన్లు దాటలేదు.

News June 21, 2024

BREAKING.. HYD: కరెంట్ షాక్‌తో ఇంటర్ విద్యార్థి మృతి

image

కరెంట్ షాక్‌తో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి మృతి చెందిన ఘటన హయత్ నగర్ వద్ద ఓ ప్రైవేట్ కళాశాలలో జరిగింది. కాగా, మృత దేహాన్ని ఉస్మానియా ఆస్పత్రకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఖమ్మం జిల్లాలో ధరణి దరఖాస్తులు 10 శాతం పెండింగ్

image

ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు దాదాపు 90 శాతం ధరణి దరఖాస్తులను అధికారులు క్లియర్ చేశారు. మరో 10 శాతం పెండింగ్ ఉన్నా.. వాటిలో తహశీల్దార్ల స్థాయిలోనే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో మొత్తం 78,710 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఇప్పటి వరకు 57,101. (73 శాతం) దరఖాస్తులను పరిష్కరించగా, 13,269 (27 శాతం) అప్లికేషన్లను రిజక్ట్ చేశారు. మరో 8,340 దరఖాస్తులు పెండింగ్ ఉన్నట్లు అధికారులు తెలిపారు.

News June 21, 2024

మహబూబాబాద్: విధుల్లో మద్యం తాగిన ఉద్యోగి సస్పెండ్

image

ఆర్టీఏలో ఔట్‌సోర్సింగ్ పద్ధతిపై విధులు నిర్వహిస్తున్న డేటా ఎంట్రీ అసిస్టెంట్ సురేశ్ విధుల్లో నిర్లక్ష్యంగా మద్యం తాగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో సదరు ఉద్యోగి సురేశ్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ బుద్ధ ప్రకాశ్ జ్యోతి ఉత్తర్వులు జారీ చేశారు. ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వహించకుండా బ్లాక్ లిస్టులో ఉంచామన్నారు.