Telangana

News June 21, 2024

MBNR: 25 నుంచి సెమిస్టర్-1 ప్రయోగ పరీక్షలు

image

డా.బీ.ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ మొదటి సంవత్సరం సైన్స్ విద్యార్థులకు సెమిస్టర్-1 ప్రయోగ పరీక్షలు ఈ నెల 25 నుంచి ప్రారంభిస్తున్నట్లు మహబూబ్ నగర్ ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలోని రీజినల్ జిల్లా కో-ఆర్డినేటర్ డా.జి. సత్యనారాయణ గౌడ్ తెలిపారు. విద్యార్థులు హాల్‌టికెట్‌తో పాటు ఏదైనా గుర్తింపు కార్డుతో హాజరు కావాలని తెలిపారు.

News June 21, 2024

మోటకొండురు మండల యువతికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్

image

మోటకొండూరు మండలం అమ్మనబోలుకు చెందిన సంధ్య టీజీ పీఈసెట్‌లో రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించి ప్రతిభకు పేదరకం అడ్డుకాదని నిరూపించింది. గురువారం విడుదలైన ఫలితాల్లో ఆమె మొదటి స్థానం సాధించింది. భవిష్యత్‌లో పోలీస్ ఉద్యోగం సాధిస్తానని ఆమె చెబుతోంది. ఆమెను తల్లిదండ్రులు, గ్రామస్థులు, వ్యాయామ ఉపాధ్యాయుులు అభినందించారు.

News June 21, 2024

బాలల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలి: RJD

image

బాలల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని మహిళా శిశు సంక్షేమ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ మోతి పేర్కొన్నారు. గురువారం సంగారెడ్డిలోని బాల రక్షాబంధన్‌ను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాలల హక్కుల రక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News June 21, 2024

NGKL: ‘పక్కదారి పట్టిస్తే చర్యలు తప్పవు’

image

వానాకాలం, యాసంగి 2022-23 సీజన్‌కు సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ రైస్‌ను(సీఎంఆర్) ఈనెల 26లోగా అందించాలని రైస్ మిల్లర్లను కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. గురువారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్లో అధికారులు, రైస్ మిల్లర్ల యజమానులతో మాట్లాడారు. ఈనెల 26వ తేదీలోగా రైస్ మిల్లర్లు బియ్యంను ఎఫ్సీఐకి పంపాలని, ధాన్యం నిలువలను పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News June 21, 2024

అరచేతిపై యోగా లోగో, యోగా నమస్కారాలు

image

జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటారు. యోగాతో పొందే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం గురించి అవగాహన పెంచడం లక్ష్యం. “యోగం” అనే పదం సంస్కృత మూలం. దీని అర్థం “చేరడం”, “కలయిక” లేదా “ఏకం చేయడమని ఖేడ్ కు చెందిన లీఫ్ ఆర్టిస్ట్ శివకుమార్ తెలిపారు. ఈ మేరకు తన అరచేతిపై యోగ కార్యక్రమాల చిత్రాలను పెయింట్ వేసి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

News June 21, 2024

సిద్దిపేట: ‘అభ్యర్థులు తప్పక పాటించాలి’

image

ఈనెల 24 నుంచి 29 వరకు జరుగనున్న TGPSC పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు సూచనలు పాటించాలని జిల్లా అదనపు కలెక్టర్ గరిమా సూచించారు. గిరిజన సంక్షేమ, ఎస్సీ అభివృద్ధి, బీసీ అభివృద్ధి శాఖ గ్రేడ్1 & 2 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, డైరెక్టర్ ఆఫ్ డిజేబుల్ అండ్ సీనియర్ సిటిజన్స్ సంక్షేమంలో మార్టన్ గ్రేడ్1 & గ్రేడ్ 2, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖలో లేడీ సూపరింటెండెంట్ ఉద్యోగాలకు పరీక్షలు జరగనున్నాయి.

News June 21, 2024

ఈనెల 27న యాదాద్రి హుండీ లెక్కింపు

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి భక్తుల కానుక రూపంలో సమర్పించిన హుండీ‌ ఆదాయాన్ని ఈనెల 27న లెక్కించనున్నట్లు గురువారం ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండపం హాల్ 2లో ఉదయం 7 గంటలకు ఆలయ సిబ్బంది, వాలంటీర్లతో.. భద్రత సిబ్బంది, అధికారుల పర్యవేక్షణలో హుండీ లెక్కింపు నిర్వహించనున్నట్లు తెలిపారు.

News June 21, 2024

భద్రాచలం: కమర్షియల్ షాపులకు టెండర్లు ఆహ్వానం: DY.RM

image

ఖమ్మం రీజియన్, భద్రాచలం డిపో పరిధిలోని కూనవరం రోడ్‌లో కొత్తగా నిర్మించనున్న 11 కమర్షియల్ షాపులకు ఆన్‌లైన్ విధానంలో టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా TGSRTC డిప్యూటీ రీజినల్ మేనేజర్ (ఆపరేషన్) G.N పవిత్ర తెలిపారు. ఆసక్తి గలవారు ఈనెల 20 నుంచి జూలై 09 వరకు అధికారిక వెబ్ సైట్ https://tender.telangana.gov.in టెండర్ వేయాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9963507506 సంప్రదించాలన్నారు.

News June 21, 2024

ఆసిఫాబాద్ జిల్లా నూతన ఎస్పీని కలిసిన శ్యామ్‌నాయక్

image

ఆసిఫాబాద్ జిల్లాకు నూతనంగా విచ్చేసిన SP,DV.శ్రీనివాస్ రావును నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ అజ్మీర శ్యాం నాయక్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్, నాయకులు మారుతీ పటేల్ తదితరులు ఉన్నారు.

News June 20, 2024

హైదరాబాద్‌ నుంచి ZOO PARK తరలింపు.. క్లారిటీ!

image

HYD బహదూర్‌పురా నుంచి నెహ్రూ జూలాజికల్ పార్క్‌ తరలింపు‌‌ అవాస్తవం అని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఈ విషయమై PCCF వైల్డ్ లైఫ్ వార్డెన్ మోహన్ పర్గెయిన్(తెలంగాణ మెంబర్) క్లారిటీ ఇచ్చారు. షాద్‌నగర్‌కు తరలిస్తున్నట్లు జరిగిన ప్రచారం అవాస్తవం అని‌ పేర్కొన్నారు. నగరం నుంచి ఇతర ప్రాంతాలకు షిఫ్ట్ చేయాలన్న ప్రతిపాదన కూడా లేదని వివరణ ఇచ్చారు. కాగా,‌ జూ పార్కుకు నిత్యం వందలాది మంది వస్తుంటారు.
SHARE IT