India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నల్గొండ జిల్లాలోని తెలంగాణ మోడల్ స్కూళ్లలో 2025-26 విద్యా సంవత్సరానికి ఆరు నుంచి పదవ తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో మిగిలిన సీట్లలో నేరుగా ప్రవేశాలు కల్పిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంబంధిత మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లను సంప్రదించాలని ఆయన సూచించారు.
పాలమూరు యూనివర్సిటీలోని లైబ్రరీ ఆడిటోరియంలో నేడు ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.చంద్ర కిరణ్ తెలిపారు. ముఖ్యఅతిథిగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి,PU వైస్ ఛాన్సలర్ జిఎన్. శ్రీనివాస్ హాజరుకానున్నారు. ఇంజనీరింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఎండీ గౌస్ మొయినుద్దీన్ పాల్గొన్నారు.
జిల్లాలోని 317 గ్రామ పంచాయతీల్లో విడుదల చేసిన 3,83,736 డ్రాఫ్ట్ ఓటర్ జాబితాపై అభ్యంతరాలు తెలపాలని పార్టీల ప్రతినిధులను కలెక్టర్ డా.సత్య శారద కోరారు. శుక్రవారం జడ్పీ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమైన ఆమె, జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 30లోపు తెలియజేయాలని కోరారు. ఈ నెల 31 లోపు అభ్యంతరాలు పరిష్కరించి, సెప్టెంబర్ 2న తుది జాబితా ప్రచురిస్తామన్నారు.
మహాగణపతి నిమజ్జన ఘట్టంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని శాంతి భద్రతల విభాగం అదనపు కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్ ఆదేశించారు. ముఖ్యంగా ఖైరతాబాద్ మహా గణపతి క్రేన్ వద్దకు వచ్చే సమయంలో తొక్కిసలాటలు జరగకుండా చూడాలన్నారు. అధికారులు, ట్రాఫిక్ పోలీసులతో కలిసి ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్‌లో పర్యటించారు.
పంచాయతీ ఎన్నికల సమరానికి ఓటర్ జాబితా విడుదలైంది. ఈ జాబితాలో పొరపాట్లు ఉన్నా, కొత్తగా నమోదు చేసుకోవాలన్నా, అభ్యంతరం వ్యక్తం చేయాలన్నా MPDO, పంచాయతీ అధికారికి దరఖాస్తు ఇవ్వాలి.
→ Form-6: కొత్తగా పేరు చేర్చుకోవడానికి
→ Form-7: చెల్లని పేరు తొలగించే అభ్యంతరానికి
→ Form-8: పేరు, అడ్రస్, ఇతర కరెక్షన్స్‌కు
→ Form-8A: ఒక వార్డు నుంచి మరో వార్డుకు మారడానికి
నేడే దీనికి ఆఖరు తేది.
మెదక్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మొత్తం 60 పంచాయతీరాజ్ రోడ్లు దెబ్బతిన్నాయి. ఇందులో 29 చోట్ల కల్వర్టులు, 14 చోట్ల రోడ్లు పాక్షికంగా దెబ్బతినగా.. 17 చోట్ల రోడ్లకు గండ్లు పడ్డాయని పంచాయతీరాజ్ జిల్లా ఇంజినీర్ నర్సింలు తెలిపారు. దెబ్బతిన్న రోడ్ల తాత్కాలిక మరమ్మతులకు రూ.3.99 కోట్లు, శాశ్వత మరమ్మతులకు రూ.17.11 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపామన్నారు. ప్రస్తుతం తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నారు.
పాలమూరు జిల్లా కేంద్రంలో శుక్రవారం డ్రై డే సందర్భంగా కలెక్టర్ విజయేందిర బోయి వివిధ కాలనీలను పరిశీలించారు. బీకే రెడ్డి కాలనీలోని మైనార్టీ గురుకుల బాలుర పాఠశాలను సందర్శించారు. ప్రజలు తమ ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. లేకపోతే వైరల్ ఫీవర్ సోకే ప్రమాదం ఉందన్నారు.
LKG, UKG క్లాసులు ప్రైవేట్ స్కూళ్లల్లోనే కాదు సర్కారు బడుల్లోనూ స్టార్ట్ కానున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచుకునేందుకు ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి యూకేజీ నిర్వహించాలని నిర్ణయించింది. మహానగర వ్యాప్తంగా ఎంపిక చేసిన 114 స్కూళ్లల్లో ఈ అడ్మిషన్లు ఇస్తారు. గ్రేటర్ పరిధిలో 25, మేడ్చల్ పరిధిలో 24, రంగారెడ్డి పరిధిలో 65 పాఠశాలలను ఎంపిక చేశారు. దీనిపై మీ కామెంట్?
నిజామాబాద్ జిల్లాలో మండల, గ్రామ పంచాయతీ, వార్డుల వారీగా విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈనెల 30లోగా తెలియజేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. అభ్యంతరాలను పరిశీలించి, అవసరమైన మార్పులు చేసిన తర్వాత సెప్టెంబర్ 2వ తేదీన వార్డుల వారీగా, ఫొటోతో కూడిన తుది ఓటరు జాబితాను ప్రకటిస్తామని కలెక్టర్ తెలిపారు.
పాలేరు నియోజకవర్గంలో రైతులకు యూరియాను సక్రమంగా అందజేయడానికి PACS ద్వారా సరఫరాకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. శుక్రవారం కూసుమంచిలోని రైతు వేదికలో పాలేరు నియోజకవర్గ పరిధిలోని ప్యాక్స్ ద్వారా యూరియా సరఫరాపై ఆయన వ్యవసాయ శాఖ అధికారులు, ప్యాక్స్ డైరెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. యూరియా పంపిణీలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు.
Sorry, no posts matched your criteria.