Telangana

News June 20, 2024

సింగరేణి తెలంగాణకే తలమానికం: భట్టి

image

సింగరేణి ఉద్యోగాల గని, తెలంగాణకే తలమానికం అని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఖమ్మం కలెక్టరేట్‌లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సింగరేణిలో 42 వేలమంది రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారని, 6 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారన్నారు. రాష్ట్రంలో 40 గనుల్లో బొగ్గు ఉత్పత్తి జరుగుతోందని తెలిపారు. ప్రస్తుతం 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరగుతుందని స్పష్టం చేశారు.

News June 20, 2024

HYD‌లో కిషన్ రెడ్డికి గ్రాండ్‌ వెల్‌కమ్

image

కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న BJP స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి‌‌కి ఘన స్వాగతం లభించింది. ఆయనతో పాటు‌ ఎయిర్‌పోర్టు‌కు వచ్చిన బండి సంజయ్‌‌‌కి పండితులు ఆశీర్వచనం అందజేశారు. తెలంగాణలోని నలుమూలల నుంచి వచ్చిన కీలక నేతలు‌ కేంద్రమంత్రులను కలిసి అభినందనలు తెలియజేశారు. అనంతరం తెలంగాణ సెల్యూట్‌ యాత్ర ప్రారంభించారు.

News June 20, 2024

NZB: రోడ్డు ప్రమాదంలో విద్యుత్ శాఖ ఏఈ మృతి

image

బోధన్ పట్టణ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యుత్తు శాఖ ఏఈ రవిచంద్ర(47) మృతి చెందారు. బోధన్ రూరల్ ఏఈగా పని చేస్తున్న జి.రవిచంద్ర విధుల్లో భాగంగా గురువారం నిజామాబాద్ స్టోర్‌కు వచ్చారు. తిరిగి బోధన్‌కు వెళ్తుండగా మార్గమధ్యలో ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలపాలైన ఆయన్ను108లో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News June 20, 2024

HYD బోనాలకు రావాలని సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

image

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గోల్కొండ, సికింద్రాబాద్, లాల్‌దర్వాజ దేవాలయాల కమిటీ సభ్యులు జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో గురువారం కలిశారు. ఆషాఢ మాసం బోనాల నేపథ్యంలో ముఖ్యమంత్రికి ఆహ్వానం అందించారు. ఆలయ అర్చకులు సీఎంకు ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఇతర నాయకులు ఉన్నారు. ఈ ఏడాది జులై 7 నుంచి ఆగస్టు 4 వరకు భాగ్యనగరంలో‌ భోనాలు జరగనున్నాయి.

News June 20, 2024

HYD‌లో కిషన్ రెడ్డికి గ్రాండ్‌ వెల్‌కమ్

image

కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న BJP స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి‌‌కి ఘన స్వాగతం లభించింది. ఆయనతో పాటు‌ ఎయిర్‌పోర్టు‌కు వచ్చిన బండి సంజయ్‌‌‌కి పండితులు ఆశీర్వచనం అందజేశారు. తెలంగాణలోని నలుమూలల నుంచి వచ్చిన కీలక నేతలు‌ కేంద్రమంత్రులను కలిసి అభినందనలు తెలియజేశారు. అనంతరం తెలంగాణ సెల్యూట్‌ యాత్ర ప్రారంభించారు.

News June 20, 2024

HYD బోనాలకు రావాలని సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

image

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గోల్కొండ, సికింద్రాబాద్, లాల్‌దర్వాజ దేవాలయాల కమిటీ సభ్యులు జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో గురువారం కలిశారు. ఆషాఢ మాసం బోనాల నేపథ్యంలో ముఖ్యమంత్రికి ఆహ్వానం అందించారు. ఆలయ అర్చకులు సీఎంకు ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఇతర నాయకులు ఉన్నారు. ఈ ఏడాది జులై 7 నుంచి ఆగస్టు 4 వరకు భాగ్యనగరంలో‌ భోనాలు జరగనున్నాయి.

News June 20, 2024

పెద్దపల్లి: పల్లె దవాఖాన వద్దనే క్షుద్ర పూజలు!

image

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని కొత్తూరులో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. స్థానికుల ప్రకారం.. గ్రామంలోని పల్లె దవాఖాన వద్ద గత కొద్ది రోజులుగా గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి వేళల్లో ఆకులపై కుంకుమ, పసుపు, కోడిగుడ్డు, మిరపకాయలు, నిమ్మకాయలు పెట్టి వెళ్తున్నారు. దీనిని చూసిన స్థానికులు, పల్లె దవాఖానకు వెళ్లే పేషెంట్లు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

News June 20, 2024

ధర్మపురి దేవస్థానంలో భక్తుల రద్దీ

image

ధర్మపురి ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో గురువారం భక్తుల రద్దీ పెరిగింది. వేకువ జామునే సుదూర ప్రాంతాల నుంచి క్షేత్రానికి వచ్చిన భక్తులు గోదావరి నదిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.

News June 20, 2024

NLG: వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువు పొడగింపు

image

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాలశాఖ స్పెషల్ కమీషనర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లాస్థాయి అక్రిడిటేషన్ కమిటీ ఛైర్మన్లు అయిన జిల్లా కలెక్టర్లు తగుచర్యలు తీసుకోవాల్సిందిగా ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ నెల 30తో ముగిస్తుండగా , గడువు తేదీని SEP 30 వరకు పొడిగించినట్లు తెలిపారు.

News June 20, 2024

ఆదిలాబాద్ : POLYCET షెడ్యూల్ ఇదే.. స్లాట్ బుక్ చేసుకోండి

image

POLYCETకు సంబంధించిన అడ్మిషన్ల ప్రక్రియ నేటినుండి ప్రారంభం కానుంది.
★ ఈనెల 20 నుంచి 24 వరకు వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాలి.
★ జూన్ 22 నుంచి 25 వరకు సర్టిఫికెట్ వేరిఫికేషన్ ఉంటుంది.
★ జూన్ 22 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి.
★ జూన్ 30 న సీట్ల కేటాయింపు ఉంటుంది.
★ జూన్ 30 నుంచి జులై 4 వరకు ఫీజు చెల్లించి కళాశాల కన్ఫర్మ్ చేసుకోవాలి.
★ జులై 7 నుంచి రెండవ విడత ప్రారంభం అవుతుంది.