Telangana

News June 20, 2024

నూతన చట్టాలపై పోలీసులకు అవగాహన ఉండాలి: ఎస్పీ

image

జూలై 1 నుంచి అమలు కానున్న నూతన చట్టాలపై పోలీసులకు అవగాహన ఉండాలని ఎస్పీ రూపేష్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పోలీసు కళ్యాణమండపంలో పోలీసు అధికారులకు నూతన చట్టాలపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. కొత్త చట్టాలపై అవగాహన కలగాలంటే నేర్చుకోవాలనే తపన ఉండాలని చెప్పారు. అదనపు ఎస్పీ సంజీవరావు, డీఎస్పీలు సత్తయ్య గౌడ్, రవీందర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.

News June 20, 2024

BREAKING: ADB: అదృశ్యమై.. శవమై తేలిన బాలుడు

image

ఉట్నూర్ మండలంలో విషాదం నెలకొంది. శాంతినగర్ చెరువులో ఓ బాలుడి మృతదేహం గురువారం లభ్యమైంది. బాలుడు పాత ఉట్నూర్‌కు చెందిన సాయికుమార్(9)గా గుర్తించారు. ఈ నెల 16న బాలుడు అదృశ్యం కాగా పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసుకున్నారు. అదృశ్యం అయిన బాలుడు నేడు శవమై కనిపించడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

News June 20, 2024

రాష్ట్రంలోనే అత్యల్ప సిజేరియన్లు మేడ్చల్‌లోనే..!

image

తెలంగాణ రాష్ట్రంలోనే ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యల్పంగా సి-సెక్షన్స్ సిజేరియన్లు మేడ్చల్ జిల్లాలో జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. 51 శాతం నమోదైనట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి నెల రిపోర్ట్ విడుదల చేస్తూ.. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రిలో జరిగిన ప్రసవాల వివరాలను అధికారులు వెల్లడించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వికారాబాద్ జిల్లాలో ఏకంగా 86% కడుపు కోతలు జరిగాయని తెలిపారు.

News June 20, 2024

రాష్ట్రంలోనే అత్యల్ప సిజేరియన్లు మేడ్చల్‌లోనే..!

image

తెలంగాణ రాష్ట్రంలోనే ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యల్పంగా సి-సెక్షన్స్ సిజేరియన్లు మేడ్చల్ జిల్లాలో జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. 51 శాతం నమోదైనట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి నెల రిపోర్ట్ విడుదల చేస్తూ.. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రిలో జరిగిన ప్రసవాల వివరాలను అధికారులు వెల్లడించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వికారాబాద్ జిల్లాలో ఏకంగా 86% కడుపు కోతలు జరిగాయని తెలిపారు.

News June 20, 2024

ప్రజావాణిలోనే కాదు మిగిలిన రోజుల్లోనూ కలవొచ్చు: కలెక్టర్

image

పెద్దపల్లి జిల్లా ప్రజలు ప్రజావాణి కార్యక్రమంలోనే కాకుండా మిగిలిన పని దినాల్లో కూడా తనను కలవొచ్చని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. మంగళవారం నుంచి శనివారం వరకు పని దినాల్లో సమీకృత జిల్లా కలెక్టరేట్‌లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్లో సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు తాను అందుబాటులో ఉంటానని అన్నారు. ప్రజలు నేరుగా వారి సమస్యలను తెలుపవచ్చని కలెక్టర్ తెలిపారు.

News June 20, 2024

రంగారెడ్డి జిల్లాలో అదనపు కమిషన్ ఏర్పాటు..?

image

రాష్ట్రంలో మొత్తం 12 జిల్లా కన్జ్యూమర్ కమిషన్లు ఉండగా అందులో ప్రతినెలా 250కి పైగా కేసులు నమోదవుతుంటాయి. రంగారెడ్డి జిల్లాలోనే సుమారు 100 కేసులు నమోదువుతున్నాయి. 50కి పైగా కేసుల నమోదుతో రెండో స్థానంలో హైదరాబాద్-1 కమిషన్ ఉంది. రంగారెడ్డి జిల్లా కమిషన్లో అధిక కేసులు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో అదనపు కమిషన్ ఏర్పాటు చేయాలని న్యాయవాదులు ప్రభుత్వాన్ని కోరారు.

News June 20, 2024

RR: ‘దేశ వ్యాప్తంగా మొక్కజొన్న సాగు పెరగాలి’

image

దేశ వ్యాప్తంగా మొక్కజొన్నల సాగు పెరగాలని, వరి, పత్తి పంటలకు ప్రత్యామ్నాయంగా దీన్ని ప్రోత్సహించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. RR జిల్లా రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వ విద్యాలయంలో జాతీయ మొక్కజొన్న పరిశోధనల మండలి డైరెక్టర్ హెచ్ఎస్ జాట్, అంతర్జాతీయంగా మొక్క జొన్నలకు మంచి డిమాండ్ ఉందన్నారు. మొక్కజొన్న పంట పండించడం ద్వారా రైతులు సైతం మంచి లాభాలు పొందుతారని పేర్కొన్నారు.

News June 20, 2024

NZB: ట్రాక్టర్ పై నుంచి పడి మున్సిపల్ కార్మికురాలి మృతి

image

నిజామాబాద్ ఖిల్లా రోడ్డులో మున్సిపల్ ట్రాక్టర్ పై నుంచి పడి కార్మికురాలు మృతి చెందింది. డ్రైవర్ పక్క సీటులో కూర్చున్న కార్మికురాలు లలిత (50) అకస్మాత్తుగా ట్రాక్టర్ పై నుంచి కిందపడింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అయితే డ్రైవర్ నిర్లక్ష్యంగా ట్రాక్టర్ నడపడంతోనే లలిత పడిపోయినట్లు స్థానికులు పేర్కొన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.

News June 20, 2024

వరంగల్ అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి: ఎమ్మెల్యే

image

వరంగల్ నగర సమగ్ర అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హన్మకొండలో ఆయన మాట్లాడుతూ.. నగర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని, ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. నగరాభివృద్ధికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

News June 20, 2024

HYD: హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్‌లో ప్రవేశాలకు ఆహ్వానం

image

శామీర్‌పేట్ మండలం హకీంపేట్‌లోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్‌లో ప్రవేశాలకు ఆహ్వానిస్తున్నామని జిల్లా విద్య,యువజన క్రీడా అధికారి తెలిపారు. 3విడతలుగా మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నామన్నారు. అందులో సెలెక్ట్ అయిన వారికి అడ్మిషన్లు ఇస్తామన్నారు. వయసు, విద్యార్హత, పుట్టిన తేదీ, ఆధార్, కుల ధ్రువపత్రాలు, 3వ తరగతి గ్రేస్ రిపోర్ట్ ప్రతులు, 5పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకురావాలన్నారు.