Telangana

News June 20, 2024

కొల్లాపూర్ ఘటనపై మంత్రి జూప‌ల్లి సీరియస్

image

కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గం మొల‌చింతలప‌ల్లి గ్రామంలో చెంచు మ‌హిళ‌పై జరిగిన అమానవీయ ఘటనపై మంత్రి జూప‌ల్లి కృష్ణారావు సీరియస్ అయ్యారు. పాశ‌విక దాడిని ఖండించిన ఆయన దాడిపై విచారం వ్య‌క్తం చేశారు. బాధిత మహిళలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇలాంటి పాశ‌విక దాడుల‌కు ఎవరూ పాల్పడిన ఉపేక్షించబోమని స్ప‌ష్టం చేశారు. ఈ ఘ‌ట‌న‌పై జిల్లా ఎస్పీకు ఫోన్ చేసి.. కేసు ద‌ర్యాప్తు పురోగ‌తిపై మంత్రి ఆరా తీశారు.

News June 20, 2024

మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి దక్కేనా..!

image

తెలంగాణ రాష్ట్రంలో మరోసారి మంత్రి వర్గ విస్తరణ చేపట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేపడుతున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. మక్తల్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన వాకిటి శ్రీహరి ముదిరాజ్‌కు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. బీసీ కోటాలో ఆయనకు మంత్రి పదవి వస్తుందని ఆయన అనుచరులు అభిప్రాయపడుతున్నారు.

News June 20, 2024

HYD: కాచిగూడలో మృతదేహం కలకలం..!  

image

HYD కాచిగూడలో రైలు పట్టాల వద్ద ఓ యువకుడి మృతదేహం కలకలం సృష్టించింది. రైల్వే ఇన్‌స్పెక్టర్ ఆర్.ఎల్లప్ప తెలిపిన వివరాలు.. రైలు పట్టాల వద్ద అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడి మృతదేహం ఉందని సిబ్బంది రైల్వే పోలీసులకు సమచారం ఇచ్చారు. వారు వెళ్లి పరిశీలించి, పాతబస్తీకి చెందిన కిజార్‌‌(22)గా అతడిని గుర్తించారు. కాగా ఇది హత్యనా.. ఆత్మహత్యనా.. రైలు ఢీకొని చనిపోయాడా.. అనేది పోస్టుమార్టంలో తెలుస్తుందన్నారు.    

మూడేళ్లలో రూ.2.76 లక్షల ఆదాయం

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత ప్రభుత్వం 481 సెగ్రిగేషన్ షెడ్లు నిర్మించింది. దీంతో సేకరించిన తడి, పొడి చెత్త ద్వారా ఆదాయం సృష్టించుకోవాలని ప్రణాళిక రూపొందించింది. నిర్లక్ష్యం కారణంగా అనేక జీపీలలో చెత్త సేకరణ ద్వారా ఆశించిన ఆదాయం లేదు. కొన్ని జీపీలు మాత్రం చెత్త నుంచి మంచి రాబడి పొందుతూ ఔరా అనిపిస్తున్నాయి. ఇందులో అశ్వాపురం జీపీ మూడేళ్లల్లో రూ.2.76 లక్షల ఆదాయం సాధించి జిల్లాలోనే నెం.1గా ఉంది.

News June 20, 2024

నిజామాబాద్‌లోని ఓ బార్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు

image

నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. బోర్గం ప్రాంతంలోని ఓ బార్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారి తారా సింగ్ నాయక్ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. బార్‌లో కాలం చెల్లిన ఫుడ్ కలర్, సాస్‌ను సీజ్ చేశారు. నిల్వ ఉంచిన మటన్ కీమా, చికెన్‌ను చెత్త కుప్పలో పడవేశారు. సీజ్ చేసిన వాటిని ల్యాబ్‌కి పంపినట్లు అధికారులు తెలిపారు. టెస్ట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత బార్‌పై చర్యలు చేపడతామని వెల్లడించారు.

News June 20, 2024

HYD: ఆకాశాన్ని తాకిన బీన్స్ ధర..!

image

HYDలో కూరగాయల ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయాయి. పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతయ్యే బీన్స్ ధర ఆకాశానంటాయి. తాజాగా హైదరాబాద్ మెహిదీపట్నం రైతుబజార్‌లో కిలో బీన్స్ ధర రూ.175గా నిర్ణయించారు. నిన్న కేవలం 3 క్వింటాళ్లు మాత్రమే వచ్చిందని ఎస్టేట్ అధికారి విజయ్ కుమార్ తెలిపారు. బహిరంగ మార్కెట్‌లో కిలో బీన్స్ రూ.300 కంటే ఎక్కువగా పలుకుతోంది. దీంతో కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

News June 20, 2024

సంగారెడ్డికి మెట్రో రైల్‌ తెస్తా: MP రఘునందన్

image

మెట్రో రైలును మియాపూర్‌ నుంచి పటాన్‌చెరు మీదుగా సంగారెడ్డి వరకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ఎంపీ రఘునందన్‌ అన్నారు. సంగారెడ్డిలో నిన్న రాత్రి జరిగిన కార్యకర్తల అభినందన సభలో మాట్లాడారు. సంగారెడ్డి చౌరస్తా వరకు మెట్రో రైలు తప్పకుండా తెస్తానని హామీఇచ్చారు. ఈ విషయంలో త్వరలో మెట్రో సీఎండీని కలుస్తానన్నారు. గత ప్రభుత్వాలు సంగారెడ్డి వరకు మెట్రో రైలు తీసుకురావడంలో ఘోరంగా విఫలమయ్యాయని విమర్శించారు.

News June 20, 2024

HYD: ఆకాశాన్ని తాకిన బీన్స్ ధర..!

image

HYDలో కూరగాయల ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయాయి. పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతయ్యే బీన్స్ ధర ఆకాశానంటాయి. తాజాగా హైదరాబాద్ మెహిదీపట్నం రైతుబజార్‌లో కిలో బీన్స్ ధర రూ.175గా నిర్ణయించారు. నిన్న కేవలం 3 క్వింటాళ్లు మాత్రమే వచ్చిందని ఎస్టేట్ అధికారి విజయ్ కుమార్ తెలిపారు. బహిరంగ మార్కెట్‌లో కిలో బీన్స్ రూ.300 కంటే ఎక్కువగా పలుకుతోంది. దీంతో కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

News June 20, 2024

నర్సంపేట: ‘రీల్స్’ చేస్తూ ప్రాణం తీసుకున్న యువకుడు

image

రీల్స్ చేస్తూ ఓ యువకుడు ప్రాణం తీసుకున్న ఘటన WGL జిల్లా నర్సంపేటలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నర్సంపేటకు చెందిన కందికట్ల అజయ్(23) ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడు. సోషల్ మీడియాలో రీల్స్ చేసే అలవాటు ఉన్న అజయ్ రెండు రోజుల క్రితం ఇంట్లో ఉరి వేసుకుంటూ ఫోన్‌లో వీడియో తీసుకునే క్రమంలో మెడకు ఉరి పడి మృతి చెందాడు. నిజంగానే ఆత్మహత్య చేసుకున్నాడని మొదట భావించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.