Telangana

News June 20, 2024

HYD: ‘హిందూ మతంలో విద్వేషాలకు, అసమానతలకు చోటు లేదు’

image

హిందూ మతంలో విద్వేషాలకు, అసమానతలకు చోటు లేదని విభిన్న హిందూ సంస్థల ప్రతినిధులు, పీఠాధిపతులు, ఆధ్యాత్మికవేత్తలు, సాధువులు పేర్కొన్నారు. సమతా ఆధ్యాత్మికమూర్తి అన్నమయ్య జయంతి సందర్భంగా ‘అన్నమయ్య కళాక్షేత్రం’, ‘హిందూస్‌ ఫర్‌ ఫ్లూరాలిటీ అండ్‌ ఈక్వాలిటీ’ సంయుక్తంగా హైదరాబాద్‌లోని బిర్లాసైన్స్‌ సెంటర్‌లో ‘ద్వేషం, అసమానత్వానికి వ్యతిరేకంగా హిందూమతం’ నినాదంతో సమ్మేళనం నిర్వహించారు.

News June 20, 2024

HYD: జులై 7న చేనేత, పవర్‌లూమ్ కార్మికుల పోరుయాత్ర

image

రాష్ట్రంలో చేనేత, పవర్‌లూమ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జులై ఏడో తేదీన పోరుయాత్ర చేపట్టబోతున్నామని, అదే నెల 15న కమిషనరేట్‌ను ముట్టడిస్తామని మాజీ MLC చెరుపల్లి సీతారాములు ప్రకటించారు. HYDలో తెలంగాణ పవర్‌లూమ్ వర్కర్స్ యూనియన్, చేనేత కార్మికుల సంఘం సంయుక్త సమావేశం జరిగింది. ఉపాధి దొరక్క, వస్త్రపరిశ్రమై ఆధారపడ్డ చేనేత, పవర్‌లూమ్ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

HYD: పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలి: MRPS

image

రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశంలో పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లను పరిష్కరించేలా నిర్ణయాలు తీసుకోవాలని తెలంగాణ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. HYD విద్యానగర్‌లోని సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ, మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్‌ చేసి వేతనాలు పెంచాలన్నారు. కార్మికులకు రూ.5 వేల పెన్షన్‌ ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఖమ్మం మార్కెట్లో స్వల్పంగా పెరిగిన పత్తి ధర

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గురువారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.20,000 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7050 జెండా పాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు, వ్యాపారస్తులు తెలిపారు. మిర్చి ధరలు నిన్న, ఈ రోజు స్థిరంగా కొనసాగుతుండగా, అటు పత్తి ధర మాత్రం 75 రూపాయలు పెరిగినట్లు వ్యాపారస్తులు తెలిపారు.

News June 20, 2024

HYD: వచ్చేసారి PM రాహుల్ గాంధే: నిరంజన్

image

కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ వచ్చేసారి ప్రధాని అవ్వడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర సేవాదళ్ జనరల్ సెక్రటరీ నిరంజన్ యాదవ్ అన్నారు. రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని ఓయూ ఆర్ట్స్ కాలేజీలో ఆయన మాట్లాడారు. రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షకుడని కొనియాడారు. విద్యావంతుడు, ప్రజల కోసం పనిచేసే మనిషి అని అన్నారు. భారత్ జోడో యాత్రతో తన సత్తా ఏంటో దేశానికి చూపించారని పేర్కొన్నారు.

బాసర: 2రోజుల్లో ముగియనున్న దరఖాస్తు గడువు

image

బాసర ఆర్జీయూకేటీ పీయూసీ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి ఇప్పటి వరకు 14,500 మంది దరఖాస్తులు చేసుకున్నట్లు ఉపకులపతి వెంకటరమణ తెలిపారు. జులై 3న ఎంపిక జాబితాను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. మే 27న నోటిఫికేషన్ విడుదల చేయగా ఈ నెల 22వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. కాగా దరఖాస్తు గడువు మరో రెండు రోజుల్లో ముగియనుంది.

News June 20, 2024

MBNR: 229 మంది SAలు, GHMలకు పదోన్నతులు

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 229 మంది ఎస్ఏలు, జీహెచ్ఎంలుగా పదోన్నతి పొందారు. స్కూల్ అసిస్టెంట్ల బదిలీలు, ఎన్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతలు, ఎస్జీటీల బదిలీలు చేపట్టాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలోని 3,230 పాఠశాలల్లో 12,708 మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా.. వారిలో సుమారు 700 మందికి పదోన్నతులు పొందనుండగా మరో 8 వేల మంది ఉపాధ్యాయులు బదిలీ అయ్యే అవకాశం ఉంది.