Telangana

News June 20, 2024

సిద్దిపేట: పసిబిడ్డను ఆసుపత్రిలోనే వదిలివెళ్లిన తల్లి

image

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన తల్లి ఆ పసిబిడ్డను వదిలిపెట్టి వెళ్లిన ఘటన KNR జిల్లాలో జరిగింది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలానికి చెందిన యువతి, వరుకోలుకు చెందిన మహేశ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో గర్భం దాల్చిన యువతి KNRలోని మాతాశిశు ఆసుపత్రిలో చేరింది. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ తల్లి పసిబిడ్డను వదిలివెళ్లడం కలకలం సృష్టించింది. ప్రస్తుతం ఆ పసిబిడ్డకు ఇతర తల్లుల పాలు పట్టిస్తున్నారు.

News June 20, 2024

పల్లె వైద్యుల మాయ.. 122 మంది గుర్తింపు!

image

అర్హత లేని వైద్యంతో గ్రామీణ ప్రాంతాల్లో కొందరు ఆర్ఎంపీ, పీఎంపీలు రోగులను పీల్చి పిప్పిచేస్తున్నారు. డాక్టర్లుగా చలామణి అవుతూ స్టెరాయిడ్, పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లు ఇస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. ఇటీవల ఉమ్మడి జిల్లాలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 22 ప్రాంతాల్లో తనిఖీలు చేయగా 122 మంది ఆర్ఎంపీ, పీఎంపీలు అర్హత లేకుండా వైద్యం చేస్తున్నట్లు గుర్తించారు.

News June 20, 2024

HYD: యువతిపై యువకుడి అత్యాచారం.. కేసు నమోదు

image

ఓ యువకుడిపై HYDకాచిగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. CIలక్ష్మీకాంత్ రెడ్డి తెలిపిన వివరాలు.. ఫలక్‌నుమాకు చెందిన యువతి(28) చిక్కడపల్లిలోని హాస్టల్‌లో ఉంటోంది. లక్డీకపూల్ వాసి విశాల్(27) ప్రైవేటు ఉద్యోగి. వారిద్దరూ 2016నుంచి లవ్ చేసుకుంటున్నారు. కాగా ఆమెను కాదని మరొకరిని అతడు ఇటీవల వివాహం చేసుకున్నాడు.అయితే తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లాడ్జిలో అత్యాచారం చేశాడని బుధవారం ఆమె PSలో ఫిర్యాదు చేసింది.

News June 20, 2024

HYD: యువతిపై యువకుడి అత్యాచారం.. కేసు నమోదు

image

ఓ యువకుడిపై HYDకాచిగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. CIలక్ష్మీకాంత్ రెడ్డి తెలిపిన వివరాలు.. ఫలక్‌నుమాకు చెందిన యువతి(28) చిక్కడపల్లిలోని హాస్టల్‌లో ఉంటోంది. లక్డీకపూల్ వాసి విశాల్(27) ప్రైవేటు ఉద్యోగి. వారిద్దరూ 2016నుంచి లవ్ చేసుకుంటున్నారు. కాగా ఆమెను కాదని మరొకరిని అతడు ఇటీవల వివాహం చేసుకున్నాడు.అయితే తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లాడ్జిలో అత్యాచారం చేశాడని బుధవారం ఆమె PSలో ఫిర్యాదు చేసింది.

News June 20, 2024

జిల్లాలో 875 మంది పదోన్నతులు.. విధుల్లో చేరిక

image

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లాలో నిర్వహించిన ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ పూర్తి కావటంతో వారు ఆయా స్థానాల్లో విధుల్లో చేరారు. జిల్లాలోని పండిట్, పీఈటీ, ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి లభించింది. జిల్లాలో 954 మందికి పదోన్నతులు రాగా.. 875 మంది బుధవారమే విధుల్లో చేరినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. మిగతా వారు నేడు విధుల్లో చేరే అవకాశం ఉంది.

News June 20, 2024

KNR: పుట్టిన బిడ్డను వదిలేసి తల్లి

image

సిద్దిపేట జిల్లాకి మౌనిక, మహేశ్ పెద్దలను ఎదురించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. అయితే ఆ తల్లి పసిబిడ్డను వదిలివెళ్లడం KNRలో కలకలం సృష్టించింది. మౌనిక ప్రసవం కోసం KNR మాతా శిశు ఆసుపత్రిలో 16న చేరింది. 17న మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంతోషాన్ని తమ కుటుంబ సభ్యులకు తెలిపారు. కానీ మరుసటి రోజు మౌనిక తన తల్లిదండ్రులతో వెళ్లిపోయింది. మహేశ్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

News June 20, 2024

వరంగల్: పెళ్లయిన మూడు నెలలకే SUICIDE

image

నల్లబెల్లి మండల వాసి వైష్ణవి(26) <<13467198>>ఆత్మహత్య <<>>చేసుకున్న విషయం తెలిసిందే. SI రామారావు వివరాల ప్రకారం.. వైష్ణవిని ములుగు(D) వెంకటాపురం వాసి శంకర్‌తో MAR 22న పెళ్లయింది. 2 నెలలకే భర్తకు వివాహేతర సంబంధం ఉన్నట్లు గుర్తించిన వైష్ణవి అత్తమామకు, మరుదులకు తెలిపింది. శంకర్ తీరులో మార్పు రాలేదు. వైష్ణవిని ఇంటి నుంచి వెళ్లగొట్టడంతో 18న పుట్టింటికి వచ్చిన ఆమె.. బుధవారం ఉరేసుకుంది. కేసు నమోదైంది.

News June 20, 2024

గంజాయి దందాకు అడ్డాగా మిర్యాలగూడ

image

మిర్యాలగూడ గంజాయి దందాకు అడ్డాగా మారింది. టెన్త్, ఇంటర్ చదువుతున్న యువకులు పార్టీల పేరుతో కలుసుకుంటూ మత్తుకు బానిసలుగా మారుతున్నారు. వ్యాపారులు 17 నుంచి 25 ఏళ్ల యువకులే టార్గెట్‌గా చేసుకుని దందా చేస్తున్నారు. మొదట అలవాటు చేసి తర్వాత పెడ్లర్లుగా మారుస్తున్నారు. యువత మత్తుకు బానిసలుగా మారకుండా తల్లిదండ్రులు ఓ కంట కనిపెడుతూ ఉండాలని డీఎస్పీ రాజశేఖర రాజు చెప్పారు.

News June 20, 2024

ఖమ్మం: ఈనెల 22న జేఎల్ఎంలకు పోల్ క్లైంబింగ్ టెస్ట్ 

image

ఖమ్మంలోని విద్యుత్ శాఖ సర్కిల్ కార్యాలయ ఆవరణలో ఈనెల 22న ఉమ్మడి జిల్లాలోని జూనియర్ లైన్ మెన్ పోస్టుల భర్తీ కోసం అభ్యర్థుల సర్టిఫికెట్స్ పరిశీలన, పోల్ క్లైంబింగ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు విద్యుత్ శాఖ ఎస్ఈ ఎ.సురేందర్ తెలిపారు. నియామక ప్రక్రియ పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 

News June 20, 2024

HYD: భరతనాట్యంలో వన్సిక సుదర్శన్‌ అరంగేట్రం

image

HYD రవీంద్రభారతిలో బుధవారం శ్రీరామనాటక నికేతన్‌ ఆధ్వర్యంలో ప్రముఖ నాట్యగురువు మంజులా రామస్వామి మనువరాలైన వన్సిక సుదర్శన్‌ భరతనాట్యంలో అరంగేట్రం చేసింది.గణేశ స్తుతి, పాద వర్ణం,శంకర శ్రీగిరి, విషమకర, తిల్లాన తదితర అంశాల్లో నర్తించి భళా అనిపించింది. నట్టువాంగంపై గురువు మంజుల రామస్వామి, గణేశ్ గానం చేయగా, మృదంగంపై రాజగోపాలచారి,వయొలిన్‌పై సాయికుమార్‌, ఫ్లూట్‌పై దత్తాత్రేయ వాయిద్య సహకారం అందజేశారు.