Telangana

News June 20, 2024

మంచిర్యాల: ఆ SI కన్ను మహిళలపైనే.!

image

ఓ మహిళా కానిస్టేబుల్ పై కాళేశ్వరం SI భవానీసేన్ లైంగిక వేధింపుల కేసులో డిస్మిస్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన SIగా ఉన్నప్పుడు ఓ యువతికి కానిస్టేబుల్ పరీక్షకు అవసరమైన పుస్తకాలు కొనిస్తానని చెప్పి అసభ్యంగా ప్రవర్తించడంతో అతడిని సస్పెండ్ చేశారు. మంచిర్యాలలో పని చేస్తుండగా ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో అతడి భార్య ఎస్పీకి ఫిర్యాదు చేసింది. అయినా అతడి తీరు మారలేదు.

News June 20, 2024

మెదక్: బావమరిదిని చంపిన బావ

image

గడ్డి మందు తాగి ఈనెల 14న రంజిత్ చికిత్స పొందుతూ మృతిచెందిన కేసును పోలీసులు ఛేదించారు. మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన బాబా శేఖర్, బిక్కనూర్‌కి చెందిన రంజిత్ కలిసి కొద్దిరోజుల క్రితం ఓ బైక్‌ను దొంగిలించినట్లు సీఐ సంపత్ కుమార్ తెలిపారు. ఆ బైక్‌ను తానే సొంతం చేసుకోవాలని బాబా శేఖర్ తన బావమరిది రంజిత్‌కు కళ్ళు సీసాలో గడ్డి మందు కలిపి ఇచ్చి హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు సీఐ వెల్లడించారు.

News June 20, 2024

కోటగిరి: రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి

image

రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందిన ఘటన కోటగిరి మండలంలో చోటు చేసుకుంది. కోటగిరి మండలం కొత్తపల్లికి చెందిన సాయి, పోశవ్వ దంపతులు బైక్‌పై బుధవారం మండల కేంద్రానికి వెళ్లారు. సాయంత్రం తిరిగి కొత్తపల్లికి వెళ్తుండగా ఏక్లాస్ పూర్ వద్ద బైక్ అదుపుతప్పి కిందపడటంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News June 20, 2024

HYD: నేడు పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ!

image

HYD, RR, MDCL,VKB జిల్లాల్లోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా నులిపురుగుల నివారణ కోసం ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేయనున్నారు. ఒకటి నుంచి 19 సంవత్సరాల వయసు కలిగిన వారందరికీ వీటిని అందించాలని కలెక్టర్లు ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ఈ మేరకు DMHO, AMHO అధికారులు వీటిని అందించేందుకు సర్వం సిద్ధం చేశారు.

అడుగంటుతున్న జలాశయాలు.. ఆందోళనలో అన్నదాతలు

image

సాగర్ జలాశయం పరిధిలో ఆయకట్టు
ప్రాంత రైతుల పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతేడాదీ జలాశయానికి ఆశించిన రీతిలో నీరు రాకపోవడంతో సాగర్ కుడి, ఎడమ కాలువ పరిధిలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రుతుపవనాలు సరైన సమయానికి వస్తాయని అధికారులు చెబుతున్నా.. వర్షాలు ముఖం చాటేస్తుండడంతో రైతులు టెన్షన్ పడుతున్నారు. ప్రస్తుతం సాగర్ నీటిమట్టం 590 అడుగులకు 504.90 అడుగుల నీరు నిల్వ ఉంది. 

News June 20, 2024

MBNR: ఉమ్మడి జిల్లాలో 31,360 సీట్లు

image

PU పరిధిలో 23 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 1 స్వయం ప్రతి పత్తి కళాశాల, 57 ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 31,360 సీట్లు అందుబాటులో ఉన్నాయి. దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థుల్లో 4,498 మందికి మొదటి విడతలో సీట్లు కేటాయించగా.. నిర్దేశిత గడువు ముగిసే సమయానికి 3,238 మందే ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. రెండో దఫాలో 2,646 మందికి సీట్లు కేటాయించారు.

News June 20, 2024

భద్రాచలం: రామాలయ ప్రవరపై విచారణ పూర్తి

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ప్రవర నిర్వహణ తీరుపై ప్రత్యేక కమిటీ చేపట్టిన విచారణ పూర్తైంది. మంగళవారం ఇక్కడికి వచ్చిన ఐదుగురు సభ్యులు రెండు రోజులపాటు సమగ్ర వివరాలను సేకరించారు. కళ్యాణం చేసే విధానంలో తప్పులు ఉన్నాయని కొందరు భక్తులు కోర్టును ఆశ్రయించడంతో ఇందులో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేశారు. బుధవారం వారు కళ్యాణ క్రతువును చిత్రీకరించారు.

News June 20, 2024

HYD: బల్కంపేట్ ఎల్లమ్మ హుండీ ఆదాయం రూ.92,29,521

image

ప్రసిద్ధి గాంచిన HYD బల్కంపేట్ ఎల్లమ్మ ఆలయ హుండీల లెక్కింపు కార్యక్రమం పటిష్ఠ బందోబస్తు నడుమ అధికారులు బుధవారం నిర్వహించారు. మార్చి 30 నుంచి జూన్ 19 వరకు మొత్తం 81 రోజులకు గాను సాధారణ హుండీల్లో నోట్లు రూ.87,15,384, నాణేలు రూ.3,53,449.. మొత్తం రూ.90,68,833 వచ్చాయి. అన్నదానం హుండీలో రూ.1,60,686 రాగా మొత్తం ఆదాయం రూ.92,29,521 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.