Telangana

News June 20, 2024

KMM: ఒక్కసారిగా కుప్పకూలిన మిర్చి ధరలు

image

ఖమ్మం జిల్లాలో మిర్చి ధరలు పతనమయ్యాయి. గత ఏడాది మేలో క్వింటాల్ మిర్చి కనీస ధర రూ.9 వేలు, గరిష్ట ధర రూ.26,500 పలికాయి. ఈ ఏడాది ధరలు తగ్గడంతో క్వింటాల్ కనీస ధర రూ.8 వేలు, గరిష్ఠ ధర 20,700కి పడిపోయింది. తేజ రకానికి చెందిన మిర్చి మాత్రమే క్వింటాల్ రూ.19,500 ధర పలుకుతోంది. మిగిలిన అన్నిరకాల మిర్చి ధరలు గణనీయంగా తగ్గాయి. ఎగుమతులు ప్రారంభంకాకపోవడంతో కోల్డ్ స్టోరేజీల్లో మిర్చి నిల్వలు పేరుకుపోతున్నాయి.

News June 20, 2024

MBNR: డిగ్రీ సెమిస్టర్‌ ఫలితాలు విడుదల

image

జిల్లా కేంద్రలోని MVS డిగ్రీ కళాశాల UG డిగ్రీ సెమిస్టర్‌ 2,4,6 సెమిస్టర్‌ రెగ్యులర్‌, 1,2,3,4,5,6 సెమిస్టర్‌ బ్యాగ్‌లాగ్‌ ఫలితాలను బుధవారం PU ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌ మధుసూదన్‌రెడ్డి విడుదల చేశారు. ఈ ఫలితాలలో 2వ సెమిస్టర్‌లో 919 మందికి 355, 4వ సెమిస్టర్‌లో 935 మందికి 489, 6వ సెమిస్టర్‌లో 919 మందికి 812 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను MVS డిగ్రీ కళాశాల వెబ్‌సైట్‌‌లో చెక్ చేసుకోండి.

News June 20, 2024

సంగారెడ్డి: ప్రభుత్వ పాఠశాలల్లో 8,019 విద్యార్థుల చేరిక

image

ఈనెల 7 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో 8,019 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరినట్లు డీఈఓ వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. 1వ తరగతిలో 3,501, 2 నుంచి 9వ తరగతిలో 3,896 మంది చేరినట్లు చెప్పారు. ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలో 642 మంది చేరినట్లు వివరించారు. బడిబాట విజయవంతం చేసిన ఉపాధ్యాయులను అభినందించారు.

News June 20, 2024

మెదక్: సైబర్ వలలో ప్రభుత్వ టీచర్.. రూ.75వేలు స్వాహా

image

తూప్రాన్‌లో సైబర్ నేరగాళ్ల వలలో పడి ఓ ప్రభుత్వ టీచర్ డబ్బులు పోగొట్టుకున్నాడు. టీచర్ మనీష్ రెడ్డి ఆన్లైన్‌లో క్రెడిట్ కార్డు ద్వారా వివేకానంద వాల్ పోస్టర్ బుక్ చేశారు. అయితే ఈ క్రమంలో సైబర్ నేరగాళ్లు ఉపాధ్యాయుడి ఖాతాలో ఉన్న రూ.75 వేలను మూడు విడతలుగా కాజేశారు. సైబర్ మోసాన్ని గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News June 20, 2024

సంగారెడ్డి: ‘గృహ కార్మికులకు ఉచిత న్యాయ సహాయం’

image

ఇళ్లలో పని చేసే గృహా కార్మికులకు ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రమేష్ అన్నారు. అంతర్జాతీయ గృహ దినోత్సవం పురస్కరించుకొని సంగారెడ్డి లోని మెద్వాన్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గృహ కార్మికులు హక్కులపై అవగాహన ఎంచుకోవాలని చెప్పారు. సమావేశంలో కార్మికులు పాల్గొన్నారు.

News June 20, 2024

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయాలని వినతి

image

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను వెంటనే చేపట్టాలని కోరుతూ షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తదితరులు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు బుధవారం ఆయన చాంబర్లో వినతిపత్రం అందజేశారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. ఆయన వెంట పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సిద్ధార్థ రెడ్డి, తదితరులు ఉన్నారు.

News June 20, 2024

నన్ను నమ్మి ఓటు వేసినందుకు కృతజ్ఞతలు: ఈటల

image

కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గం, మైత్రినగర్ వాసులు ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో MP ఈటల రాజేందర్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో అన్ని నియోజకవర్గాలు తిరగాలి కాబట్టి సమయం దొరకలేదు. అందుకే ఇప్పుడు కడుపునిండా మాట్లాడి పోదామని వచ్చానని అన్నారు. మల్కాజిరిలో నన్ను నమ్మి ఓటు వేసి చరిత్రలో నిలిచిపోయే తీర్పు ఇచ్చారన్నారు.

News June 20, 2024

అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల నమోదు శాతం పెంచాలి: కలెక్టర్

image

జనగామ జిల్లాలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సీడీపీవోలు, ఐసీడీఎస్ సూపర్వైజర్‌లతో అంగన్వాడీ కేంద్రాలపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల నమోదు శాతం పెరగాలన్నారు. కొత్తగా పిల్లల నమోదును పెంచాలని సూచించారు.

News June 20, 2024

NGKL: ఫ్రీగా నీట్‌ లాంగ్ టర్న్ కోచింగ్.. మీ కోసం

image

అచ్చంపేట: సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాల బాలబాలికలకు ఉచితంగా నీటిలో లాంగ్ టర్న్ కోచింగ్ ఇస్తున్నట్లు గురుకులాల ఆర్సీఓ వనజ బుధవారం తెలిపారు. షెడ్యూల్డ్ కులాల బాల, బాలికలు ఇంటర్ ఉత్తీర్ణత సాధించి నీట్ పరీక్షకు హాజరైనవారు www.tgswreis.telangana.gov.in వెబ్ సైట్లో రూ.200. చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.

News June 20, 2024

రుణమాఫీపై 5,36,726 లక్షల మంది రైతుల ఆశలు

image

రైతుల పంట రుణాలను మాఫీ చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 5.36 లక్షల మంది రైతులు పంట రుణాలలు తీసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. AUG 15 నాటికి అర్హులందరికీ రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీంతో 5,36,726 లక్షల మంది రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. రుణమాఫీని ఒకేసారి చేస్తారా..? విడతల వారీగా చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.