Telangana

News June 19, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈరోజు TOPNEWS

image

> జిల్లా వ్యాప్తంగా ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
> గంజాయి పట్టివేత కేసులో ఇద్దరికీ పదేళ్ల జైలుశిక్ష
> ఢిల్లీలో పలువురు కాంగ్రెస్ అగ్ర నేతలను కలిసిన పాలకుర్తి MLA యశస్విని
> కన్నాయిగూడెం: జెసిబి తిరగబడి డ్రైవర్ మృతి
> ములుగులో జాబ్ మేళా నిర్వహణ
> WGL: డిసిపిలుగా బాధ్యతలు చేపట్టిన సలీమా, రాజమహేంద్ర నాయక్
> తాడ్వాయి: పురుగు మందు తాగి బాలిక సూసైడ్
> కాలేశ్వరం ఎస్సై భవాని సేన్ పై కేసు నమోదు

News June 19, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ కరీంనగర్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కి ఘన స్వాగతం.
@ వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్నను దర్శించుకున్న బండి సంజయ్.
@ కమలాపూర్ మండలంలో కారు, బైకు ఢీ.. ఒకరికి తీవ్ర గాయాలు.
@ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన చొప్పదండి ఎమ్మెల్యే సత్యం.
@ రాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి అధ్యక్షుడిని పరామర్శించిన మాజీ గవర్నర్.
@ మేడిపల్లి మండలంలో అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య.

News June 19, 2024

మణుగూరు నుంచి దక్షిణ కొరియాకు భారజలం ఎగుమతి

image

దక్షిణ కొరియాకు 20 వేల లీటర్ల భారజలాన్ని భద్రాద్రి జిల్లాలోని మణుగూరు భారజల ప్లాంటు నుంచి ఎగుమతి చేశారు. గౌతమీనగర్ లోని పర్ణశాల అతిథిగృహం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో భారజలం ఉన్న కంటైనర్ వాహనాన్ని భారజల బోర్డు ఛైర్మన్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎస్.సత్య కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. సీఐఎస్‌ఎఫ్ బలగాల బందోబస్తు మధ్య ఈ వాహనం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనుంది.

News June 19, 2024

వేములవాడ రాజన్న సేవలో బండి సంజయ్

image

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారిని బుధవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బుధవారం రాత్రి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కోడె మొక్కు చెల్లించుకోని సేవలో తరించారు. ఆలయానికి చేరుకున్న బండి సంజయ్‌కు బీజేపీ శ్రేణులు, అభిమానులు, నాయకులు అపూర్వ స్వాగతం పలికారు.
కేంద్ర మంత్రి హోదాలో తొలిసారి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అడుగుపెట్టడంతో బాణాసంచా పేల్చి సంబురాలు చేసుకున్నారు.

News June 19, 2024

ముల్కనూర్‌లో గుప్తనిధుల తవ్వకాలు!

image

భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూర్ గ్రామంలో మూడు రోజుల క్రితం గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఓ రైతు మామిడి తోటలోని రావులమ్మ గుడి కింద గుప్తనిధులు ఉన్నాయని కొంత మంది JCB సహాయంతో తవ్వకాలు జరిపారని తోట యజమాని పోలీసులు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనలో నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

News June 19, 2024

ములుగు: సెల్ ఫోన్ చూడొద్దన్నందుకు ఆత్మహత్య

image

ములుగు జిల్లా తాడ్వాయి మండలం భూపతిపూర్ గ్రామానికి చెందిన అంకిత(15) పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే. గ్రామస్థులు, కుటుంబీకుల వివరాల ప్రకారం.. అంకిత ఇంట్లో ఉంటూ మొబైల్ ఫోన్లో వీడియోలు చూస్తూ, తరచూ ఫోన్‌లో మాట్లాడుతుండగా తల్లి గమనించి పలుమార్లు మందలించింది. దీంతో అంకిత పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News June 19, 2024

బాధ్యతలు చేపట్టిన ఆర్టీసీ ఆర్ఎం విజయభాను

image

వరంగల్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్‌గా విజయభాను బుధవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని చార్మినార్ డివిజన్ డిప్యూటీ ఆర్.ఎంగా పనిచేసిన విజయభాను పదోన్నతిపై వరంగల్ ఆర్.ఎంగా బదిలీపై వచ్చారు. ఇక్కడ పనిచేసిన శ్రీలత రంగారెడ్డి ఆర్.ఎంగా బదిలీ అయ్యారు. బాధ్యతలు చేపట్టిన విజయభానును ఆర్టీసీ అధికారులు, కార్మిక నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.

News June 19, 2024

బిక్కనూరు: బావమరిదిని చంపిన బావ

image

గడ్డి మందు తాగి ఈనెల 14న రంజిత్ చికిత్స పొందుతూ మృతిచెందిన కేసును  పోలీసులు ఛేదించారు. మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన బాబా శేఖర్, బిక్కనూర్‌కి చెందిన రంజిత్ కలిసి కొద్దిరోజుల క్రితం ఓ బైక్‌ను దొంగిలించినట్లు సీఐ సంపత్ కుమార్ తెలిపారు. ఆ బైక్‌ను తానే సొంతం చేసుకోవాలని బాబా శేఖర్ తన బావమరిది రంజిత్‌కు కళ్ళు సీసాలో గడ్డి మందు కలిపి ఇచ్చి హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు సీఐ వెల్లడించారు.

News June 19, 2024

HYDకు దేశంలో‌నే అత్యుత్తమ రీసెర్చ్ సెంటర్ అవార్డు

image

HYD మరోసారి దేశవ్యాప్తంగా సత్తాచాటింది. రాజేంద్రనగర్‌లోని ప్రొ.జయశంకర్ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ కలుపు యాజమాన్య విభాగానికి అవార్డు వరించింది. దేశంలోనే అత్యుత్తమ రీసెర్చ్ సెంటర్ అవార్డు దక్కడం విశేషం. భువనేశ్వర్‌లో అఖిల భారత కలుపు యాజమాన్య సంస్థ వార్షిక సమావేశాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 2023-24 సంవత్సరానికి HYD సైంటిస్టులు డాక్టర్ రామ్ ప్రకాశ్, డాక్టర్ పద్మజ ఈ అవార్డు అందుకొన్నారు.SHARE IT

News June 19, 2024

HYDకు దేశంలో‌నే అత్యుత్తమ రీసెర్చ్ సెంటర్ అవార్డు

image

HYD మరోసారి దేశవ్యాప్తంగా సత్తాచాటింది. రాజేంద్రనగర్‌లోని ప్రొ.జయశంకర్ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ కలుపు యాజమాన్య విభాగానికి అవార్డు వరించింది. దేశంలోనే అత్యుత్తమ రీసెర్చ్ సెంటర్ అవార్డు దక్కడం విశేషం. భువనేశ్వర్‌లో అఖిల భారత కలుపు యాజమాన్య సంస్థ వార్షిక సమావేశాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 2023-24 సంవత్సరానికి HYD సైంటిస్టులు డాక్టర్ రామ్ ప్రకాశ్, డాక్టర్ పద్మజ ఈ అవార్డు అందుకొన్నారు.
SHARE IT