Telangana

News June 19, 2024

మెదక్: సమస్యలు పరిష్కారించాలని MPకి వినతి

image

ఉమ్మడి జిల్లాలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని బుధవారం తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కప్పర ప్రసాద్ రావు ఎంపీ రఘునందన్ రావును కలిసి కోరారు. ఎంపీగా గెలిచిన రఘునందన్ రావును ప్రసాదరావు మర్యాదపూర్వకంగా కలిసారు. శాలువా కప్పి అభినందనలు తెలిపి మాట్లాడుతూ.. ప్రజల గొంతుకగా ఎంపీ పార్లమెంట్లో వాణి వినిపించి ఉమ్మడి జిల్లా ప్రజల సమస్యలు పరిష్కరిస్తారన్న నమ్మకం ఉందన్నారు.

News June 19, 2024

నాగర్‌కర్నూల్‌లో అమానవీయ ఘటన

image

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో బుధవారం అమానవీయ ఘటన వెలుగుచూసింది. జిల్లా కేంద్రంలోని నాగనూల్ రోడ్డులో శ్మశానవాటిక ఎదురుగా అప్పుడే పుట్టిన శిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. అయితే అప్పటికే ఆడశిశువు మృతి చెందింది. స్ధానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 19, 2024

బాన్సువాడ: రూ.2.09లక్షలు పొగొట్టుకున్న యువకుడు

image

సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ఓ యువకుడు రూ.2.09 లక్షలు పోగొట్టుకున్న ఘటన బాన్సువాడలో చోటుచేసుకుంది. తాడ్కోల్ గ్రామానికి చెందిన మహేందర్ ఫోన్‌కు ఈనెల 8న ఓ మెసేజ్ వచ్చింది. క్లిక్ చేయడంతో రూ.400 బోనస్ అతని అకౌంట్లో జమయ్యాయి. దీన్ని నమ్మిన యువకుడు విడతల వారీగా రూ.2.09 లక్షలు వివిధ అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ చేశాడు. తర్వాత ఎలాంటి రిఫండ్ రాకపోవడంతో మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.

News June 19, 2024

వరంగల్ మార్కెట్‌కు ఇకపై బుధవారం సెలవు రద్దు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఇకనుంచి ప్రతి బుధవారం ఓపెన్ ఉండనుంది. ఎండాకాలంలో ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని మూడు నెలల క్రితం చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యుల విజ్ఞప్తి మేరకు ప్రతి బుధవారం మార్కెట్‌కు సెలవు ప్రకటించారు. ఇక ఎండాకాలం ముగిసి వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఆ సెలవులు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. విషయాన్ని రైతులు గమనించి బుధవారం సైతం మార్కెట్‌కు సరుకులు తీసుకొని రావచ్చన్నారు.

News June 19, 2024

సికిల్ సెల్ అనీమియా.. సైలెంట్ కిల్లర్: డిఎంహెచ్వో

image

సికిల్ సెల్ అనీమియా అనేది సైలెంట్ కిల్లర్‌గా ఉంటుందని.. దీనిని గుర్తించి చికిత్స తీసుకోవాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. NLG కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో ప్రపంచ సికిల్ సెల్ రోజును పురస్కరించుకొని సికిల్ సెల్ అనీమియా వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

News June 19, 2024

ధర్మపురి: నేటి ఆలయ ఆదాయ వివరాలు

image

సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బుధవారం రూ.1,08,321 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.63,010, ప్రసాదం అమ్మకం ద్వారా రూ.35,000, అన్నదానం రూ.10,311 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.

News June 19, 2024

సంగారెడ్డి: కిసాన్ సాగర్ చెరువులో యువకుడి మృతదేహం

image

సంగారెడ్డి జిల్లా కంది సమీపంలోని కిసాన్ సాగర్ చెరువులో గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి రూరల్ ఎస్సై వినయ్ కుమార్ చేరుకొని క్లూస్ టీమ్ ఆధారంగా వివరాలను సేకరిస్తున్నారు. మృతుడి వయసు 22 నుంచి 25 ఏళ్ల మధ్య ఉంటుందన్నారు. కాగా మృతుడు ఎవరు..?, మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. ఎవరికైనా మృతుడి వివరాలు తెలిస్తే చెప్పాలని ఎస్సై కోరారు.

News June 19, 2024

యాదాద్రిలో సందడి చేసిన అనసూయ

image

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని ప్రముఖ సినీ నటి, టీవీ యాంకర్ అనసూయ భరద్వాజ్ బుధవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చక పండితులు వేద ఆశీర్వచనం అందించారు. స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని ఆలయ అధికారులు అందజేశారు. ఆమెతో సెల్ఫీలు దిగడానికి అభిమానులు ఎగబడ్డారు.

News June 19, 2024

రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొన్నం

image

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ సీనియర్ నేతలు హనుమంతరావు, సంపత్ కుమార్ పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే తరానికి మార్గదర్శి రాహుల్ గాంధీ అని కొనియాడారు.

News June 19, 2024

తాండూరులో ఘోర రోడ్డు ప్రమాదం

image

వికారాబాద్ జిల్లాలో‌ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూర్ నుంచి కొడంగల్ వెళ్లే ప్రధాన రహదారిలో (కాగ్న వంతెన సమీపంలో) లారీ బీభత్సం సృష్టించింది. రెండు ద్విచక్రవాహనాలను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి, బిడ్డ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.