Telangana

News June 19, 2024

ఇంద్రవెల్లి: PM కిసాన్ ఈ కేవైసీ సందేశం.. క్లిక్ చేయగానే నగదు ఖాళీ

image

పీఎం కిసాన్ ఈ కేవైసీ సందేశంతో బ్యాంకు ఖాతాలోని రూ.9,945 ఖాళీ అయిన ఘటన బుధవారం వెలుగుచూసింది. ఇంద్రవెల్లి మండలం దొంగరగావ్‌‌కు చెందిన మడావి సురేశ్ ఫోన్‌కి పీఎం కిసాన్ ఈ కేవైసీ అప్‌డేట్ అనే సందేశం వచ్చింది. అతడు ఆ లింకును ఓపెన్ చేయగానే తన బ్యాంక్ ఖాతా నుంచి రూ.9945 నగదు విత్ డ్రా అయినట్లు మరో సందేశం వచ్చింది. దీంతో అతడు సైబర్ క్రైమ్‌ అధికారులకు ఫిర్యాదు చేశాడు.

News June 19, 2024

ములుగు: పురుగు మందు తాగి బాలిక ఆత్మహత్య

image

పురుగు మందు తాగి ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన ములుగు జిల్లాలో జరిగింది. స్థానికుల ప్రకారం.. తాడ్వాయి మండలం భూపతిపూర్ గ్రామానికి చెందిన అంకిత(15) ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడింది. అప్పుడే వచ్చిన కుటుంబీకులు గమనించి ములుగు ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. కాగా, అప్పటికే చనిపోయిందని వైద్యులు నిర్ధారణ చేశారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News June 19, 2024

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

image

ఖమ్మంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి బుధవారం జిల్లా కలెక్టర్ అబ్దుల్ ముజామిల్ ఖాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆసుపత్రిలో తిరుగుతూ అక్కడ చికిత్స పొందుతున్న రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఆసుపత్రిలో పలు రికార్డులను పరిశీలించి, వైద్య అధికారులకు పలు సూచనలు చేశారు.

News June 19, 2024

‘కేంద్ర బడ్జెట్ ఆధారంగా రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెడతాం’

image

కేంద్ర బడ్జెట్ ఆధారంగా రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెడతామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అప్పులు చేసి సంపద సృష్టిస్తామని ఆ సంపద ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. మహిళా సంఘాలకు ఐదు సంవత్సరాలలో లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తామని చెప్పారు. రైతు రుణమాఫీకి పూర్తిగా తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదని పేర్కొన్నారు.

News June 19, 2024

పార్టీ మారే ప్రసక్తే లేదు: ఎమ్మెల్యే బండ్ల

image

తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వదంతులను పార్టీ శ్రేణులు, ప్రజలు నమ్మొద్దని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. చివరి వరకు కేసీఆర్ నాయకత్వంలో BRS కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. గద్వాల క్యాంప్ ఆఫీసులో మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు 4 రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. అదంతా తానంటే గిట్టని వారు చేసే తప్పుడు ప్రచారం అన్నారు.

News June 19, 2024

షాద్‌నగర్‌కు జూపార్క్ తరలింపు..?

image

HYD నెహ్రూ జూలాజికల్ పార్క్ షాద్‌నగర్‌కు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. జూపార్కు పరిసరాల్లో వాయు, శబ్ద కాలుష్యం ఎక్కువ అవుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వర్షాకాలంలో భారీ వర్షాలు కురిసినప్పుడు జూపార్కు సమీపంలోని మీర్ ఆలం ట్యాంక్ నుంచి వరద ఉద్ధృతి పెరిగి జూపార్కులోకి నీరు ప్రవేశిస్తుండటంతో జూపార్కును మరో చోటికి తరలించాలన్న ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

News June 19, 2024

షాద్‌నగర్‌కు జూపార్క్ తరలింపు..?

image

నెహ్రూ జూలాజికల్ పార్క్ షాద్‌నగర్‌కు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. జూపార్కు పరిసరాల్లో వాయు, శబ్ద కాలుష్యం ఎక్కువ అవుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వర్షాకాలంలో భారీ వర్షాలు కురిసినప్పుడు జూపార్కు సమీపంలోని మీర్ ఆలం ట్యాంక్ నుంచి వరద ఉద్ధృతి పెరిగి జూపార్కులోకి నీరు ప్రవేశిస్తుండటంతో జూపార్కును మరో చోటికి తరలించాలన్న ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

News June 19, 2024

రక్తదానం చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

image

ఏఐసీసీ అగ్ర నేత, రాయ్ బరేలి ఎంపీ రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రక్తదానం చేశారు. గాంధీభవన్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పలువురు నాయకులతో కలిసి రక్తదానంలో పాల్గొన్నారు. భారత్ జోడో యాత్ర చేపట్టి ప్రజల సమస్యలు తెలుసుకొని, దేశంలో ద్వేషానికి చోటు లేదని చాటి చెప్పిన గొప్ప నాయకుడని మంత్రి అన్నారు.

News June 19, 2024

ఇందల్వాయి: అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య

image

అప్పుల బాధతో యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇందల్వాయి మండలంలో జరిగింది. ఎస్ఐ మనోజ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని త్రియంబకపేట్ గ్రామానికి చెందిన బైరీ గణేశ్ (22) ఏడాది క్రితం బతుకుదెరువుకు సౌదీ వెళ్ళాడు. అక్కడ 6నెలలు గడిపి సరైన ఉపాధి అవకాశాలు దొరక్క తిరిగి ఇంటికి వచ్చాడు. అప్పులు అధికమవడంతో మంగళవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.

News June 19, 2024

రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పించిన షర్మిల

image

రామోజీ ఫిలిం సిటీలో రామోజీరావు చిత్రపటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నివాళులర్పించారు. లక్షలాది మందికి ఉపాధి కల్పించిన ఆయన జీవితం ఎంతోమందికి ఆదర్శమని షర్మిల అన్నారు. అనంతరం రామోజీరావు సతీమణి రమాదేవి, మార్గదర్శి శైలజా కిరణ్, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి సహా కుటుంబసభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.