Telangana

News June 19, 2024

జర్నలిస్టుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది: మంత్రి పొంగులేటి

image

ఖమ్మంలో బుధవారం నిర్వహించిన రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర మహాసభలకు ముఖ్య అతిథిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రిని సీనియర్ జర్నలిస్టులు ఘనంగా సత్కరించారు. తదనంతరం మంత్రి మాట్లాడుతూ.. జర్నలిస్టుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. అతి త్వరలోనే అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తామన్నారు.

News June 19, 2024

HYD: అక్రమ కనెక్షన్లకు యాప్‌తో చెక్!

image

గ్రేటర్ వ్యాప్తంగా పెరుగుతున్న అక్రమ తాగునీటి, మురుగు కనెక్షన్లకు యాప్‌తో అరికట్టేందుకు జలమండలి సిద్ధమైంది. ఇప్పటికే కూకట్‌పల్లి, మాదాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో ఈ యాప్‌ను విజయవంతంగా పరిశీలించిన అధికారులు నగర వ్యాప్తంగా అమలు చేయనున్నారు. కొన్నేళ్లుగా అక్రమ నల్లాలు, మురుగునీటి కనెక్షన్ల వల్ల జలమండలికి నష్టం జరుగుతోంది. అక్రమ కనెక్షన్లను అరికట్టవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.

కాళేశ్వరం ఎస్ఐ భవాని సేన్‌పై కేసు

image

భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఎస్ఐ భవాని సేన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళా కానిస్టేబుల్‌పై గన్ చూపెట్టి బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డట్లు బాధితురాలి ఫిర్యాదు మేరకు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. భవాని సేన్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు.

News June 19, 2024

సైబర్ నేరస్తుల నయాదందా.. స్వీట్ మనీ పేరిట నగదు డిపాజిట్..!

image

ఖమ్మంలో సైబర్ నేరస్థులు నయాదందాకు తెరలేపారు. ఖమ్మం నగరానికి చెందిన ఓ యువకుడి అకౌంట్లో గత వారం స్వీట్ మనీ యాప్ మోసగాళ్లు రూ.1,800 డిపాజిట్ చేశారు. వారం రోజుల తర్వాత సదరు యువకుడికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి రూ.1,800తో పాటు రూ.3వేలు తిరిగి పేమెంట్ చేయకపోతే అంతు చూస్తామని బెదిరించారు. దీంతో బాధిత యువకుడు ఆ రూ.1800ను తిరిగి పేమెంట్ చేసి, సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News June 19, 2024

కాళేశ్వరం ఎస్ఐ భవాని సేన్‌పై కేసు

image

భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఎస్ఐ భవాని సేన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళా కానిస్టేబుల్‌పై గన్ చూపెట్టి బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డట్లు బాధితురాలి ఫిర్యాదు మేరకు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. భవాని సేన్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు.

News June 19, 2024

KMM: భార్యను హత్య చేసిన భర్తకు రిమాండ్

image

రెండో భార్యను హత్యచేసిన కేసులో ఆర్ఎంపీని ఖమ్మం టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మం దివ్యాంగుల కాలనీకి చెందిన మల్లయ్య తన రెండో భార్య కళావతిని సోమవారం తెల్లవారుజామున హత్య చేయడమే కాక సహజ మరణంగా చిత్రీకరించడానికి ప్రయత్నించాడు. అయితే, ఆమె శరీరంపై గాయాలు ఉండడంతో బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారించగా నిజం బయటపడడంతో మంగళవారం మల్లయ్యను అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.

News June 19, 2024

మంత్రి కోమటిరెడ్డిని కలిసిన పంచాయతీ కార్యదర్శులు

image

తెలంగాణ పంచాయతీ సెక్రెటరీ ఫెడరేషన్ నల్లగొండ జిల్లా కమిటీ అధ్యక్షడు మధు ఆధ్వర్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా TPSF జిల్లా గోడ క్యాలెండర్ ను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం పంచాయతీ కార్యదర్శుల సమస్యల గురించి మంత్రికి వివరించారు. TPSF జిల్లా గౌరవ అధ్యక్షుడు ఉపేందర్, ట్రెజరర్ నరేష్, దేవరకొండ డివిజన్ అధ్యక్షుడు జైహిందర్ పాల్గొన్నారు

News June 19, 2024

గుమ్మడిదల: కోళ్ల ఫారంలో అల్ఫాజోలం తయారీ

image

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామంలోని ఓ కోళ్లఫారంలో అల్ఫాజోలం తయారీ చేస్తున్న కేంద్రంపై జిల్లా SP రూపేష్, టీఎస్ న్యాబ్, గుమ్మడిదల పోలీసులు దాడి చేశారు. గ్రామానికి చెందిన పలువురు ఆరు నెలలుగా మత్తు పదార్థాలైన అల్ఫాజోలం తయారు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రూ.40లక్షల విలువైన 2.60 లక్షల విలువైన అల్ఫాజోలం, రూ.60లక్షలు విలువైన ముడి పదార్ధాలను స్వాధీనం చేసుకున్నట్లు SP తెలిపారు.

News June 19, 2024

భైంసా ఆర్టీసీ డీఎంపై సస్పెన్షన్ వేటు

image

భైంసా ఆర్టీసీ డీఎం ఎం.అమృతను సస్పెండ్ చేశారు. ఆమెపై వచ్చిన ఆరోపణలపై కరీంనగర్ జోనల్ ఈడీ ఆదేశాల మేరకు నిజామాబాద్ డిప్యూటీ ఆర్ఎం విచారణ జరిపారు. ప్రాథమిక విచారణ నివేదిక ఆధారంగా సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేశారు. ఆదిలాబాద్ ప్రాంతీయ డిప్యూటీ మేనేజర్ ప్రణీత్ వివరాల ప్రకారం బాసర, ముథోల్, తదితర బస్టాండ్లలో అభివృద్ధి పనులు చేపట్టకుండానే డీఎం బిల్లులు రూపొందించి కాజేసినట్లు తేలింది.