Telangana

News June 19, 2024

జనగాం: ఇద్దరు డిగ్రీ విద్యార్థులు డిబార్

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో నిర్వహిస్తున్న బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ కోర్సుల పరీక్షలు జరుగుతున్నాయి. జనగామ ఏబీవీ డిగ్రీ కళాశాలలో ఇద్దరు వ్యక్తులు ఒకరికి బదులుగా మరొకరు పరీక్షలు రాస్తుండగా తనిఖీ అధికారులు డిబార్ చేసినట్లుగా పరీక్షలు నియంత్రణ అధికారి ప్రొఫెసర్ శ్రీ రామోజు నరసింహచారి, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ నరేందర్లు తెలిపారు. వారిపై నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

News June 19, 2024

HYD: హోటల్, రెస్టారెంట్లకు హెచ్చరిక.. తేడా వస్తే అంతే..!

image

HYD నగరంలోని రాజేంద్రనగర్, ఉప్పల్, చంద్రాయణగుట్ట, మల్లాపూర్, నాచారం, రాజేంద్రనగర్ లాంటి అనేక ప్రాంతాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు స్వయంగా ఆహార నాణ్యతను పరీక్షించే యంత్రాలను ప్రత్యేక వాహనంలో తీసుకెళ్లి అక్కడికక్కడే పరీక్షిస్తున్నట్లు FSO పవన్ తెలిపారు. ఈ ప్రక్రియను ఇటీవల వేగవంతం చేశామని, ప్రమాణాలకు విరుద్ధంగా ఏ మాత్రం తేడా వచ్చినా వెంటనే నిబంధనల ప్రకారం హోటళ్లను మూసివేస్తామని హెచ్చరించారు.

News June 19, 2024

HYD: హోటల్, రెస్టారెంట్లకు హెచ్చరిక.. తేడా వస్తే అంతే..!

image

HYD నగరంలోని రాజేంద్రనగర్, ఉప్పల్, చంద్రాయణగుట్ట, మల్లాపూర్, నాచారం, రాజేంద్రనగర్ లాంటి అనేక ప్రాంతాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు స్వయంగా ఆహార నాణ్యతను పరీక్షించే యంత్రాలను ప్రత్యేక వాహనంలో తీసుకెళ్లి అక్కడికక్కడే పరీక్షిస్తున్నట్లు FSO పవన్ తెలిపారు. ఈ ప్రక్రియను ఇటీవల వేగవంతం చేశామని, ప్రమాణాలకు విరుద్ధంగా ఏ మాత్రం తేడా వచ్చినా వెంటనే నిబంధనల ప్రకారం హోటళ్లను మూసివేస్తామని హెచ్చరించారు.

News June 19, 2024

గోపాల్‌పేట: చేపల వల కాళ్లకు చుట్టుకొని వ్యక్తి మృతి

image

చేపల వల కాళ్లకు చుట్టుకొని వ్యక్తి మృతి చెందిన ఘటన గోపాల్‌పేట మండల పరిధిలోని ఎదుట్ల గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై హరి ప్రసాద్ కథనం ప్రకారం.. కుర్మయ్య (41) అనే వ్యక్తి మంగళవారం కుమారుడు, మరో వ్యక్తితో కలిసి ఊరు పక్కనే ఉన్న బావిలో చేపల వేటకు వెళ్లారని, చేపలు పడ్డాయని బావిలోకి దిగి చూడగా కాళ్లకు వల్ల చుట్టుకొని మృతి చెందినట్లు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు.

News June 19, 2024

నిజామాబాద్: చెప్పేదొకటి.. చేసేదొకటి!

image

జిల్లాలో చాలా ఆసుపత్రులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. ఖలీల్‌వాడిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఆర్థో పేరిట రిజిస్ట్రేషన్ అయింది. అక్కడ జనరల్ ఫిజిషియన్, జనరల్ సర్జన్, స్త్రీ వైద్య నిపుణులు సేవలందిస్తున్నారు. ద్వారకానగర్‌లో ఒక జనరల్ ఫిజిషియన్‌గా అనుమతి తీసుకుని సర్జన్లు సైతం నిర్వహిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకూ 394 ఆసుపత్రులు అనుమతులు పొందగా.. 122 అనుమతులు లేకుండా కొనసాగుతున్నాయి.

News June 19, 2024

రుణమాఫీకి రెడీ.. 5.58 లక్షల మంది రైతుల ఆశలు

image

రైతుల పంట రుణాలను మాఫీ చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. 2023 DEC 12 నాటికి ఉమ్మడి KMM జిల్లాలో 5.58 లక్షల మంది రైతులు వివిధ బ్యాంకుల నుంచి రూ.6,123 కోట్ల మేర పంట రుణాలను తీసుకున్నట్లు లీడ్ బ్యాంక్ గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో ఎందరు మాఫీకి అర్హత సాధిస్తారనే అంశం ప్రభుత్వం విడుదల చేసే మార్గదర్శకాల ద్వారా తేలనుంది. AUG 15 నాటికి అర్హులందరికీ రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.

News June 19, 2024

NLG: 5.36 లక్షల మంది రైతులకే రుణమాఫీ?

image

రైతు రుణమాఫీకి ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంత మంది రైతులకు బ్యాంకుల్లో రుణాలున్నాయి? అందులో ఎంత మంది రూ. లక్షలోపు రుణం తీసుకున్నారు? రూ. లక్ష కంటే ఎక్కువ రుణాలు ఎంత మంది రైతులుకున్నాయనే సమాచారాన్ని సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంకర్ల ద్వారా సేకరిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 5.36 లక్షల మంది రైతులు రుణమాఫీ ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

News June 19, 2024

MHBD: మద్యం తాగుతూ విధులు!

image

మహబూబాబాద్ జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ పై విధులు నిర్వర్తిస్తున్న టెక్నికల్ సపోర్ట్ ఇంజినీరింగ్ సురేశ్ పై వేటు పడింది. అతడిని విధుల నుంచి తప్పిస్తూ హనుమకొండ డీటీసీ శ్రీనివాస్ పుప్పాల ఆదేశాలు జారీ చేశారు. మద్యం తాగి విధులకు హాజరయ్యారనే ఆరోపణలపై సురేశ్‌ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు డీటీసీ తెలిపారు.

News June 19, 2024

హుస్నాబాద్‌లో హత్య UPDATE

image

హుస్నాబాద్(M) కూచన్‌పల్లి వాసి నరసయ్య(55)ను <<13460938>>హత్య <<>>చేసిన విషయం తెలిసిందే. SI మహేశ్ వివరాలు.. నర్సయ్య సామగ్రి ఏరుకుంటూ విక్రయించేవాడు. మద్యానికి బానిసై రోజు భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. సోమవారం రాత్రి అతని భార్య లేచి చూసేసరికి రక్తపు మడుగులో చనిపోయి ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామస్థులతో మాట్లాడి నర్సయ్య భార్య, తమ్ముడి కుమారుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

News June 19, 2024

ప్రజావాణి నిర్వహించేందుకు ఏర్పాట్లు: కలెక్టర్

image

ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో ప్రజాదర్బార్, జిల్లాల్లో ప్రజావాణికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. అందులో భాగంగా సోమవారం నుంచి (ఈనెల 24) మండలాల్లో ప్రజావాణి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందుకు జిల్లా స్థాయి అధికారులను మండలానికి ఒకరిని ప్రత్యేక అధికారులుగా వేస్తున్నట్లు తెలిపారు.