Telangana

News June 19, 2024

వీడియో కాన్ఫరెన్స్‌ కేంద్రాలుగా రైతు వేదికల మార్పు

image

రైతులకు సాగులో మెళకువలు, శిక్షణలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రైతు వేదికలను వీడియో కాన్ఫరెన్స్‌ సెంటర్లుగా మారుస్తోంది. నల్గొండ జిల్లాలోని ఆరు రైతు వేదికల్లో ఎల్‌సీడీ, వీడియో కెమెరాలు, సౌండ్‌ సిస్టమ్‌ తదితర సౌకర్యాలు కల్పించి వీడియో కాన్ఫరెన్స్‌ కేంద్రాలుగా మార్చింది. వాటితో పాటు ఇప్పుడు మరో 25 రైతు వేదికలను వీడియో కాన్ఫరెన్స్‌ కేంద్రాలుగా మార్చాలని మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

News June 19, 2024

HYD: ఇంటి అద్దె కట్టలేక వ్యక్తి ఆత్మహత్య

image

ఇంటి అద్దె కట్టలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన బాచుపల్లిలో జరిగింది. పోలీసుల వివరాలు.. తూర్పు గోదావరికి చెందిన వరప్రసాద్ (45) రియల్ ఎస్టేట్ వేస్తూ భార్య శైలజ, కుమారుడితో కలిసి వసంతనగర్ కాలనీలో ఉంటున్నాడు. 3 నెలలుగా ఇంటి అద్దె కట్టలేదు. తన భార్య పోచారం వెళ్లిన సమయంలో ఉరేసుకున్నాడు. కాగా ఇంటి యజమానురాలు అద్దె కోసం వేధించడంతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని శైలజ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

News June 19, 2024

ఎంజీయూ డిగ్రీ విద్యా ప్రణాళిక విడుదల

image

ఎంజీ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ 3, 5 సెమిస్టర్ల విద్యా ప్రణాళికను యూనివర్సిటీ అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ కొప్పుల అంజిరెడ్డి మంగళవారం విడుదల చేశారు. జూన్ 18 నుంచి తరగతులు ప్రారంభించి నవంబర్ 1 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఇంటర్నల్ పరీక్షలు, సంక్రాంతి సెలవులు, ప్రిపరేషన్ హాలిడేస్ వివరాలను తెలుపుతూ సర్క్యులర్ జారీ చేశారు.

News June 19, 2024

HYD: ఇంటి అద్దె కట్టలేక వ్యక్తి ఆత్మహత్య

image

ఇంటి అద్దె కట్టలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన బాచుపల్లిలో జరిగింది. పోలీసుల వివరాలు.. తూర్పు గోదావరికి చెందిన వరప్రసాద్ (45) రియల్ ఎస్టేట్ వేస్తూ భార్య శైలజ, కుమారుడితో కలిసి వసంతనగర్ కాలనీలో ఉంటున్నాడు. 3 నెలలుగా ఇంటి అద్దె కట్టలేదు. తన భార్య పోచారం వెళ్లిన సమయంలో ఉరేసుకున్నాడు. కాగా ఇంటి యజమానురాలు అద్దె కోసం వేధించడంతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని శైలజ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

News June 19, 2024

ఖమ్మం జిల్లాలో మిషన్ భగీరథ సర్వే వివరాలు

image

ఖమ్మం జిల్లాలో 2,46,683 ఇళ్లు ఉండగా వాటిని సర్వే చేస్తుంటే కొత్త గృహాలు లెక్కలోకి వస్తున్నాయి. కొత్త ఇళ్లను ప్రత్యేకంగా నమోదు చేస్తున్నారు. సోమవారం వరకు జిల్లాలో 64,621 పాత ఇళ్లను సర్వే చేయగా మరో 78,302 కొత్త ఇళ్లు గుర్తించి వాటి వివరాలు పొందుపరిచారు. వాస్తవ లెక్కల ప్రకారం ఇంకా 1,82,062 ఇళ్లు సర్వే చేయాల్సి ఉండగా కొత్త గృహాలను ఇంకెన్ని గుర్తిస్తారో తేలాల్సి ఉంది.

News June 19, 2024

జిల్లాలో మిషన్ భగీరథ సర్వే వివరాలు

image

భద్రాద్రి జిల్లాలోని 481 గ్రామ పంచాయతీల్లో సుమారు 1,516 ఆవాసాల్లో 2,70,000 గృహాలకు ప్రస్తుతం మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు సరఫరా అవుతోంది. క్షేత్రస్థాయిలో సర్వేలో భాగంగా మంగళవారం వరకు 1,60,604 నివాసాల వివరాలు పొందుపరిచారు. పంచాయతీల్లో ఆన్లైన్లో ఇంటి నంబర్, పన్ను తదితర వివరాలతో నమోదైన ఇళ్లు 36,541 మాత్రమే. ఆన్లైన్లో నమోదుకాని పెండింగ్లోని నివాసాలు 1,82,615, కొత్త గృహాలు 1,24,063 ఉండటం గమనార్హం.

News June 19, 2024

నార్సింగి: వాన లేక.. అన్నదాత ఆందోళన

image

వర్షాకాలం మొదలై 17 రోజులైనా ఆశించిన స్థాయిలో చినుకు లేక రైతులకు నిరాశే ఎదురైంది. తొలకరి వర్షాలకు దుక్కులు దున్ని, విత్తనాలు ఎరువులను సమకూర్చుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 37,321 ఎకరాల్లో పత్తి సాగు చేస్తారని అధికారులు అంచనా. ఇప్పటికి 9500 ఎకరాల్లో మాత్రమే సాగయింది. అందులో సగం కూడా మొలకెత్తలేదు. పరిస్థితి ఇలాగే ఉంటే మళ్లీ విత్తనాలు వేసుకోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News June 19, 2024

మద్దూర్ మండలంలో చిరుత సంచారం

image

మద్దూర్ మండలంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. తాజాగా మండలంలోని చెన్నరెడ్డిపల్లి, మోమినాపూర్‌ శివారులో చిరుత సంచరిస్తుందని ఆ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్‌ అధికారులు హెచ్చరించడంతో ప్రజలకు భయం పట్టుకుంది. చిరుతలతో జాగ్రతగా ఉండాలే తప్పా, పొలం కంచెలకు షాక్‌ పెట్టడం, విష ప్రయోగాలు చేసి చిరుతల మృతికి కారణమైతే రూ.10లక్షల జరిమానా, కేసులు పెడతామని బోర్డులు ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది.

News June 19, 2024

నిజామాబాద్: సెంచరీ కొట్టిన టమాట

image

టమాట ధర ఆకాశాన్నంటుతోంది. నిజామాబాద్ జిల్లాలో పదిరోజుల క్రితం రూ.40 ఉన్న ధర ఒక్కసారిగా ఎగబాకింది. నిన్న మొన్నటి వరకు రూ.80 ఉండగా నేడు రూ.100కు చేరింది. కిలో కొనుగోలు చేసే వినియోగదారులు పావుకిలోతో తృప్తి పడుతున్నారు. టమాట కొందామన్నా మార్కెట్‌లో దొరకడం లేదు. 20 కిలోల పెట్టెధర రూ.వేయి పలుకుతోంది. అంతంత మాత్రం సాగు.. అకాలవర్షాలు రేటు పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది.

News June 19, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్య అంశాలు

image

✓ వివిధ శాఖల అధికారులతో భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
✓పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన
✓ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
✓పాల్వంచలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
✓భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు