Telangana

News June 19, 2024

HYD: NIMS ఆసుపత్రిలో ఏ రోజు.. ఏ సేవలు..?

image

HYD నగరంలోని NIMS ఆస్పత్రిలో వైద్య సేవల లిస్టును అధికారులు అందుబాటులోకి తెచ్చారు. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు చర్మ సంబంధ వ్యాధులు, జీర్ణాశయ సంబంధ వ్యాధులు, మహిళా సంబంధిత వ్యాధులకు వైద్యం అందిస్తామని తెలిపారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ అవుట్ పేషెంట్ సేవలు సైతం సోమవారం నుంచి శనివారం వరకు అందిస్తామన్నారు. మిగతా అవుట్ పేషెంట్ సేవల లిస్టును పట్టికలో చూడొచ్చు.

News June 19, 2024

కొత్తగూడెం: ఇంట్లో 30 పాము పిల్లలు

image

వర్షాకాలంలో విషసర్పాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు, స్నేక్ రెస్క్యూ టీం సభ్యులు సూచిస్తున్నారు. కొత్తగూడెం పట్టణ పరిధి నెహ్రూబస్తీకి చెందిన రాజు ఇంట్లో పాము పిల్లలు కనిపించడంతో స్నేక్ రెస్క్యూ టీం మెంబర్ బలరాంకు సమాచారం అందించారు. దీంతో బలరాం, సహచరుడు పెద్దిరాజు కలిసి రాజు ఇంటికి వెళ్లి 30 వరకు తాచుపాము పిల్లలను పట్టుకున్నారు.

News June 19, 2024

నల్గొండ: పెట్రోల్ బంకుల్లో మోసాలు

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కొన్ని బంకుల్లో మోసాలు జరుగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ తక్కువగా వస్తోందని, అందులోనూ కల్తీ జరుగుతోందని వినియోగదారులు తరచూ ఆందోళనకు దిగుతున్నా అధికారుల పర్యవేక్షణ కరువైంది. గన్ తీయగా పెట్రోల్ కొట్టకముందే రూ.5.70 చూపిస్తోందని సూర్యాపేటలో ఓ వినియోగదారుడు తెలిపాడు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని డీఎస్ఓ మోహన్ బాబు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 500పైనే బంకులున్నాయి.

News June 19, 2024

NLG: గ్రూప్ 2 అభ్యర్థులకు ఉచిత గ్రాండ్ టెస్ట్

image

నల్లగొండ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాకు చెందిన TGPSC గ్రూప్ – II కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఉచిత గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ విజయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను వెబ్ సైట్: https://tgbcstudycircle.cgg.gov.in లో బుధవారం నుండి జులై 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News June 19, 2024

వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటన

image

భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వి.పాటిల్ గోదావరి పరివాహకంలో వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించనున్నారు. ఈ మేరకు తహశీల్దార్ చంద్రశేఖర్ తెలిపారు.  ఉదయం 8.30 గంటలకు  కలెక్టర్ పర్యటన ఉంటుందని మండల స్థాయి సిబ్బంది ఎంపీడీఓ, ఎంపీవో, మండల వ్యవసాయ అధికారి, విద్యాశాఖ అధికారి, వివిధ శాఖలకు చెందిన అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు.

News June 19, 2024

పోలీసు అధికారులు బాధ్యతగా కృషి చేయాలి: CP

image

సమగ్ర విచారణతో నేరస్తులకు న్యాయస్థానం ద్వార శిక్ష పడే విధంగా పోలీస్ అధికారులు బాధ్యతగా కృషి చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. కమిషనరేట్‌లో మంచిర్యాల జిల్లా పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా CP మాట్లాడుతూ.. వర్టికల్స్ సమర్ధవంతంగా అమలయ్యేలా చూడాలన్నారు. బాధితుల ఫిర్యాదులకు వెంటనే స్పందించాలన్నారు. సత్వర న్యాయం చేస్తామనే నమ్మకం, భరోసా కలిగించాలన్నారు.

News June 19, 2024

సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి సీతక్క

image

ఏటూరునాగారం మండల కేంద్రంలో ఐటీడీఏ కార్యాచరణ ప్రణాళిక సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఐటిడిఏ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర, ఐటిడిఏ అధికారి చిత్రా మిశ్రా పాల్గొన్నారు.

News June 19, 2024

NZB: పేకాట స్థావరంపై పోలీసుల దాడి

image

నిజామాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పేకాట స్థావరంపై దాడి జరిపారు. హైమద్ పురా కాలనీలో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో టాస్క్‌ఫోర్స్ సీఐ అంజయ్య, సిబ్బంది లక్ష్మన్న, రాములు, గజేందర్, అనిల్ కుమార్, సుధాకర్ ఆధ్వర్యంలో మంగళవారం తనిఖీలు జరిపారు. ఆరుగురు జూదరులను అదుపులోకి తీసుకుని రూ.7,460 నగదు సీజ్ చేశారు. ఒకటో టౌన్ పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేశారు.

News June 19, 2024

ఆదిలాబాద్: గ్రూప్-2 అభ్యర్థులకు GOOD NEWS

image

గ్రూప్-2 ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఉచిత గ్రాండ్ టెస్ట్ ల కోసం దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు బీసీ అభివృద్ధి అధికారి ఆదిలాబాద్ కె. రాజలింగు, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి.ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. మొత్తం 12 పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. మొదటి గ్రాండ్ టెస్ట్‌లు జులై 8న
ఉదయం 10 గంటలకు పేపర్-1 మధ్యాహ్నం 1.30కి పేపర్ 2 ఉండును అదేవిధంగా 9న ఉదయం 10 గంటలకు పేపర్-3 ఉంటుందన్నారు.

News June 19, 2024

MBNR: బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

సివిల్ సర్వీసు-2025 సంవత్సరంలో పరీక్ష రాసే అభ్యర్థులకు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ హైదరాబాద్ ఉచితశిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు ఎ.స్వప్న, జిల్లా బి.సి. అభివృద్ధి అధికారి ఆర్.ఇందిరా తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన BC, SC, ST అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేసుకోవాలని కోరారు.