Telangana

News June 18, 2024

KNR: సివిల్స్ సర్వీసెస్‌కు ఉచిత శిక్షణ

image

బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లిలోని డిగ్రీ పాసైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అభ్యర్థులకు సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవి కుమార్ తెలిపారు. ఈనెల 19 నుంచి జూలై 03 వరకు వెబ్ సైట్ www.tgbcstudycircle.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవలని సూచించారు. ఆన్ లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తామన్నారు.

News June 18, 2024

NLG: రేపటి వరకు ఉచిత రేషన్ బియ్యం పంపిణీ

image

పౌర సరఫరాల కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలోని ఆహార భద్రత కార్డుదారులకు జూన్ నెలకి సంబంధించి ఉచిత బియ్యాన్ని ఈనెల 19 వరకు పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ చౌక ధరల దుకాణాలు ఈనెల 19 వరకు తీసి ఉంచాలని.. ప్రతి కార్డుదారునికి బియ్యం పంపిణీ చేయాలని.. లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News June 18, 2024

మేడిగడ్డలో 92.77 లక్షల టన్నుల ఇసుక పూడికతీత

image

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ ముంపు ప్రాంతంలో 92.77 లక్షల టన్నుల ఇసుక పూడికను తీయనున్నారు. దీనికోసం తెలంగాణ ఖనిజ అభివృద్ధి సంస్థ 14 బ్లాకులను గుర్తించింది. ఆయా ప్రాంతాల్లో ఇసుకను తవ్వి తరలించనున్నారు. ఈ మేరకు 14 బ్లాక్‌లో విడివిడిగా టెండర్లను ఆహ్వానించింది. ఇసుక పూడిక తీయడం ద్వారా బ్యారేజీలో నీటి నిలువ సామర్థ్యం పెరుగుతుందని భావిస్తోంది.

News June 18, 2024

నల్గొండ: పోలీస్ స్టేషన్లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

image

నిడమనూరు పోలీస్ స్టేషన్‌లో ఎర్రబెల్లికి చెందిన వెంకయ్య అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. భూవివాదంలో పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని మనస్థాపం చెంది మంగళవారం వెంకయ్య పురుగుల మందు తాగినట్లు తెలుస్తుంది. వెంకయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

News June 18, 2024

గద్వాల: 14 మంది వైద్య సిబ్బందికి షోకాజ్ నోటీసులు

image

గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించని కారణంగా 14 మందికి కలెక్టర్ సంతోష్ షోకాజ్ నోటీసు జారీచేశారు. మంగళవారం ఆస్పత్రి తనిఖీకి వెళ్లిన ఆయన సిబ్బంది గైర్హజరయిన విషయాన్ని గుర్తించారు. వారందరికీ నోటీసులు జారీచేశారు. అనంతరం వార్డుల్లో పర్యటించి వైద్యసేవల గురించి రోగులను ఆరాతీశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.

News June 18, 2024

అడుగంటిన నాగార్జున సాగర్ 

image

నాగార్జునసాగర్ జలాశయంలో నీటి మట్టం రోజురోజుకూ తగ్గిపోతుంది. మంగళవారం అందిన సమాచారం మేరకు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను 504.50 అడుగులు, పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.00 టీఎంసీలకు 122.5225 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి ఇన్ ఫ్లో నిల్ ఉండగా, అవుట్ ఫ్లో 800 క్యూసెక్కులు ఉంది. ఇక నందికొండ ప్రజలకు తాగు నీటికి కూడా కొన్నిసార్లు ఇబ్బంది కలుగుతోంది. 

News June 18, 2024

ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్

image

ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాగల ఐదు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతవరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలుంటాయని వాతావరణ విభాగం తెలిపింది. ఈ నెల 22 వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.

News June 18, 2024

నిజామాబాద్ జిల్లాకు ఎల్లో అలర్ట్

image

నిజామాబాద్ జిల్లాకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. రాగల ఐదు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలుంటాయని వాతావరణ విభాగం తెలిపింది. ఈ నెల 22 వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.

News June 18, 2024

శంషాబాద్ ఎయిర్‌‌పోర్టు‌కు బాంబు బెదిరింపు

image

శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఇంటెలిజెన్స్ అధికారులకు ఓ ఆగంతకుడు బాంబు పెట్టామని లేఖ పంపాడు. మెయిల్ చూసిన అధికారులు భద్రత సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎయిర్ పోర్ట్‌లో తనిఖీలు చేసిన సిబ్బంది అది ఆకతాయి పని అని తేల్చారు. మెయిల్ పంపిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఒక్కసారిగా సిబ్బంది తనిఖీలు చేయడంతో ప్రయాణికులు కాస్త కంగారు పడ్డారు.

News June 18, 2024

శంషాబాద్ ఎయిర్‌‌పోర్టు‌కు బాంబు బెదిరింపు

image

శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఇంటెలిజెన్స్ అధికారులకు ఓ ఆగంతకుడు బాంబు పెట్టామని లేఖ పంపాడు. మెయిల్ చూసిన అధికారులు భద్రత సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎయిర్ పోర్ట్‌లో తనిఖీలు చేసిన సిబ్బంది అది ఆకతాయి పని అని తేల్చారు. మెయిల్ పంపిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఒక్కసారిగా సిబ్బంది తనిఖీలు చేయడంతో ప్రయాణికులు కాస్త కంగారు పడ్డారు.