Telangana

News June 18, 2024

మందమర్రి: సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించాలి

image

రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు బకాయి పడిన రూ.30 వేల కోట్లు చెల్లించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) అధ్యక్షులు సీతారామయ్య డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ గతంలో మాదిరిగానే సింగరేణిలో మితిమీరిన రాజకీయ జోక్యాన్ని అరికట్టాలన్నారు. గుర్తింపు సంఘం పత్రం వెంటనే అందించి స్ట్రక్చర్ కమిటీలు ఏర్పాటు చేయాలని కోరారు. కార్మిక వర్గానికి అండగా నిలిచి కొత్త గనులు సాధిస్తామని తెలిపారు.

News June 18, 2024

అడుగంటిన నాగార్జున సాగర్ 

image

నాగార్జునసాగర్ జలాశయంలో నీటి మట్టం రోజురోజుకూ తగ్గిపోతుంది. మంగళవారం అందిన సమాచారం మేరకు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను 504.50 అడుగులు, పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.00 టీఎంసీలకు 122.5225 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి ఇన్ ఫ్లో నిల్ ఉండగా, అవుట్ ఫ్లో 800 క్యూసెక్కులు ఉంది. ఇక నందికొండ ప్రజలకు తాగు నీటికి కూడా కొన్నిసార్లు ఇబ్బంది కలుగుతోంది. 

News June 18, 2024

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి తుమ్మల

image

తిరుమల తిరుపతి శ్రీవారిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దర్శించుకున్నారు. తెలుగు ప్రజల కష్టాలు తీర్చే శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థించానని అన్నారు. తెలుగుజాతి ఔన్నత్యాన్ని, కీర్తిని కాపాడుకోవాలని, ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకోవాలన్నారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడటం మంచిది కాదని పేర్కొన్నారు.

News June 18, 2024

వరంగల్: వరుణుడి రాక కోసం రైతుల ఎదురుచూపు

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రైతులు వరుణుడి రాక కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాలోని పలువురు రైతులు పొడి దుక్కుల్లో విత్తనాలు వేసి వర్షం పడితే తమ విత్తనాలు మొలకెత్తుతాయని వేచి చూస్తున్నారు. జిల్లాలోని పలు గ్రామాల్లో జోరుగా వర్షం కురవాలని కప్పతల్లి ఆట, వరుణ దేవుడికి ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

News June 18, 2024

వ్యవసాయంలో పెరుగుతున్న యాంత్రికరణ

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. రైతులు విత్తనాలు విత్తుకోగా , మరికొంత మంది విత్తుకునేందుకు భూమిని సిద్ధం చేస్తున్నారు. యాంత్రికరణ పెరిగిన నేపథ్యంలో అన్నదాతలు ట్రాక్టర్ల సాయంతో పనులు పూర్తి చేస్తున్నారు. పత్తిలో కలుపుతీసేందుకు డౌర కొట్టడానికి ఎద్దుల అవసరం ఉండేది. ఎద్దుల పోషణకయ్యే ఖర్చు, మనిషిని కేటాయించే పరిస్థితి లేక చాలా మంది రైతులు కాడెద్దులను దూరం పెడుతున్నారు.

News June 18, 2024

ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తాం: ఎస్పీ శరత్ చంద్ర పవర్

image

నల్లగొండ జిల్లాలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తామని నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. మంగళవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం వారు మాట్లాడుతూ.. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయడంతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. మహిళల రక్షణకు పెద్ద పీట వేస్తామని, వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పమన్నారు.

News June 18, 2024

NLG: భూముల విలువల పెంపుపై క్షేత్రస్థాయిలో అధ్యయనం

image

భూముల మార్కెట్ విలువ సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో క్షేత్రస్థాయిలో అధికారులు అధ్యయనం ప్రారంభించారు. ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఈ పెంపు ఉండాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు కసరత్తు చేస్తున్నారు. NLG, BNG, SRPTల్లో వాస్తవ ధరలకు, మార్కెట్ వెలకు భారీ వ్యత్యాసం ఉందని గుర్తించి వాటి అంతరాన్ని తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.

News June 18, 2024

గద్వాల డీఎస్పీకి మహిళ ఫిర్యాదు.!

image

గద్వాల జిల్లాకు చెందిన ఓ యువకుడు 3 నెలల క్రితం తనను ప్రేమ వివాహం చేసుకొని ఇప్పుడు కలిసి ఉండటం ఇష్టం లేదని చెబుతున్నాడని తిరుపతి జిల్లాకు చెందిన ఓ మహిళ సోమవారం గద్వాల డీఎస్పీ సత్యనారాయణ‌కు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. సదరు మహిళ, యువకుడు సోషల్ మీడియాలో కలుసుకొని వివాహం చేసుకున్నారు. తిరుపతిలో ఉంటూ జీవనం సాగించారు. ఇటీవల అతడు సొంత ఊరికి వచ్చి, తిరిగి రాకపోవడంతో మహిళ పోలీసులను ఆశ్రయించింది.

News June 18, 2024

HYD: సీతారాముల విగ్రహాల ధ్వంసంపై RSS, VHP, బజరంగ్‌దళ్ ఆందోళన

image

మేడ్చల్ మండలం డబిల్‌పూర్ గ్రామంలోని హనుమాన్ గుట్టపై ఉన్న సీతారాముల ఆలయంలో దుండగులు<<13461450>> విగ్రహాలను ధ్వంసం<<>> చేసిన విషయం తెలిసిందే. కాగా విషయం తెలుసుకున్న RSS, విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్ నాయకులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. పోలీసులు వచ్చి ఘటనా స్థలంలో పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News June 18, 2024

HYD: సీతారాముల విగ్రహాల ధ్వంసంపై RSS, VHP, బజరంగ్‌దళ్ ఆందోళన

image

మేడ్చల్ మండలం డబిల్‌పూర్ గ్రామంలోని హనుమాన్ గుట్టపై ఉన్న సీతారాముల ఆలయంలో దుండగులు <<13461450>>విగ్రహాలను ధ్వంసం<<>> చేసిన విషయం తెలిసిందే. కాగా విషయం తెలుసుకున్న RSS, విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్ నాయకులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. పోలీసులు వచ్చి ఘటనా స్థలంలో పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.