India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వార్షిక తనిఖీల్లో భాగంగా ఈరోజు మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి అడ్డకల్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. స్టేషన్ సిబ్బంది విధులు, రికార్డులు, పరిసరాలను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. సిబ్బంది సేవలపై ఏవైనా సమస్యలు ఉంటే తాము పరిశీలిస్తామని, విధుల విభజన ప్రకారం సమర్థవంతంగా సేవలందించాలని తెలిపారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, ఫిర్యాదుదారులందరికీ సమానంగా సేవలందించాలన్నారు.
యూరియా కొరత వేధిస్తున్న ఈ సమయంలో భూత్పూర్‌లోని పంపిణీ కేంద్రాల వద్ద రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడే టోకెన్లు ఇవ్వడం అక్కడే యూరియా పంపిణీ చేయడంతో ఇబ్బంది పడుతున్నామని అన్నదాతలు వాపోతున్నారు. టోకెన్ల కోసం గంటల తరబడి, యూరియా బస్తాల కోసం రోజుల తరబడి లైన్‌లో నిల్చోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు.
జిల్లాలో గుర్తించిన డిఫెన్స్ ల్యాండ్స్‌కు సంబంధించిన నివేదికలను వారంలో అందించాలని జిల్లా కలెక్టర్ హరిచందన సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కార్వాన్ MLA కౌసర్ మోహియుద్దీన్,
నాంపల్లి MLA మాజీద్ హుస్సేన్, MLC మీర్జా రహమత్ బేగ్‌తో కలసి ఆసిఫ్‌నగర్, గోల్కొండ, నాంపల్లి, షేక్‌పేట్‌లో గుర్తించిన డిఫెన్స్ భూములపై సమీక్షించారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మహబూబ్‌నగర్ కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు కలెక్టర్ విజయేందిర బోయి సమావేశం ఏర్పాటు చేశారు. వార్డుల వారీగా, పంచాయితీ ఓటర్ల జాబితా షెడ్యూల్‌పై అవగాహన కల్పించారు. మండల స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించామన్నారు. ఇప్పటికే ముసాయిదా జాబితాను గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ కార్యాలయాల్లో అంటించామని చెప్పారు.
SRR కళాశాలలోని తెలుగు విభాగం ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ప్రముఖ రంగస్థల కళాకారుడు తూర్పాటి కిష్టయ్య హాజరై మాట్లాడుతూ.. మన తెలుగు భాషలో ఎంతో రసరమ్యమైన పద్యాలు ఉన్నాయన్నారు. ప్రిన్సిపల్ రామకృష్ణ మాట్లాడుతూ.. మాతృభాషను విస్మరిస్తే అవి మనం కోల్పోతామని తెలిపారు. తెలుగు విభాగ అధ్యక్షులు డా. బూర్ల చంద్రశేఖర్ తదితరులున్నారు.
విద్యార్థులకు ఏఐ, కోడింగ్ అంశాలను సులభంగా బోధించాలని డీఈవో భిక్షపతి ఉపాధ్యాయులకు సూచించారు. జిల్లాలోని 29 అటల్ టింకరింగ్ ల్యాబ్ పాఠశాలలకు చెందిన భౌతిక శాస్త్ర, గణిత ఉపాధ్యాయులకు పైథాన్ లాంగ్వేజ్, ఏఐ అంశాలపై మూడు రోజుల శిక్షణ శుక్రవారం డైట్ కళాశాలలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో క్వాలిటీ కోఆర్డినేటర్ రామచంద్రయ్య పాల్గొన్నారు.
నల్గొండలోని పారిశ్రామిక కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐతో పాటు ఇతర చట్టబద్ధ సౌకర్యాలను వెంటనే అమలు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతిపత్రం అందజేశారు. కార్మికులకు శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన కోరారు.
నిడమనూరు మండలం ఎర్రబెల్లి గ్రామాన్ని శుక్రవారం తెలంగాణ రైతు కమిషన్ సభ్యుల బృందం సందర్శించింది. ఈ సందర్భంగా గ్రామంలోని బత్తాయి తోటను పరిశీలించి రైతు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జాలిపర్తి నాగేశ్వరావు అనే రైతు బత్తాయి తోటలో రాలిన కాయలను కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, కమిటీ సభ్యులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో లకుమాల మధుబాబు తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ మహబూబ్‌నగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ఈరోజు ధర్నా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ.. ఐటీ హబ్‌లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి, సంక్షేమానికి కృషి చేయాలన్నారు. భూములు కోల్పోయిన స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆర్భాటం చేసిన ప్రభుత్వం, యాజమాన్యాలు కుమ్మక్కై స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించలేదన్నారు. ఈ మేరకు కలెక్టర్ ఏవోకు విన్నవించారు.
వినాయకచవితి ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు సందడి నెలకొంది. భక్తులు తమ నివాసాలు, వీధుల్లో ప్రతిష్ఠించిన చిన్న విగ్రహాలను చెరువుల వద్దకు తీసుకొస్తున్నారు. ట్యాంక్‌బండ్, సరూర్‌నగర్ చెరువు, మీర్‌పేట మంత్రాల చెరువు, సఫీల్‌గూడ మినీ ట్యాంక్‌బండ్ వద్ద కోలాహలం నెలకొంది. గుండె నిండా భక్తితో మళ్లీ రావయ్య గణపయ్య అంటూ సాగనంపుతున్నారు. గంగ ఒడికి గణపయ్య చేరుతోన్న సమయంలో భక్తుల భావోద్వేగం కంట తడి తెప్పిస్తోంది.
Sorry, no posts matched your criteria.