Telangana

News June 18, 2024

వరంగల్ మార్కెట్‌లో మిర్చి ధరలు ఇలా..

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం పలు రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. ఏసీ తేజ మిర్చి క్వింటాకు రూ.19 వేల ధర పలికింది. అలాగే ఏసీ 341 రకం మిర్చి రూ.17 వేలు, ఏసీ వండర్ హాట్ (WH) మిర్చి రూ.17,200 ధర పలికినట్లు వ్యాపారులు తెలిపారు. నేడు మార్కెట్‌కు మిర్చి భారీగా తరలి వచ్చింది.

News June 18, 2024

HYD: పూర్తి స్థాయిలో ఎమర్జెన్సీ పంపింగ్‌కు రెడీ

image

ఎత్తిపోతల ద్వారా HYD నగరానికి గోదావరి జలాల తరలింపు ప్రక్రియ మొదలుకానుంది. బుధవారం నుంచి ఎల్లంపల్లి రిజర్వాయర్‌ నుంచి అత్యవసర పంపింగ్‌తో నగరానికి రోజూ 168 ఎంజీడీల వాటర్‌ను తరలించనున్నారు. ఈ సందర్భంగా ఏడు పంపులను అధికారులు సిద్ధం చేసి ట్రయల్‌ రన్‌ పూర్తి చేశారు. బుధవారం నుంచి పూర్తి స్థాయిలో ఎమర్జెన్సీ పంపింగ్‌కు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

కాజీపేట- సికింద్రాబాద్: మూడేళ్లుగా పట్టాలెక్కని కవచ్!

image

KZPT- SEC మార్గంలో 2 రైళ్లు ఒకే పట్టాల మీదకు వచ్చినప్పుడు.. వాటికవే గుర్తించి వేగం తగ్గించుకొని నిలిచిపోయే ‘కవచ్‌ వ్యవస్థ’ ప్రతిపాదన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 2022 మార్చి 4న రైల్వే మంత్రి అశ్వినివైష్ణవ్ వికారాబాద్-లింగంపల్లి మధ్య ప్రయోగాత్మకంగా కవచ్ వ్యవస్థను పరిశీలించి విజయవంతం చేశారు. ఆ తర్వాత KZPT- SEC మార్గంలో కవచ్‌ను అభివృద్ధి చేస్తారని ప్రకటించారు. కానీ మూడేళ్లుగా జాడ కనిపించడం లేదు.

News June 18, 2024

MDK: ‘RRR’@ రూ.31 వేల కోట్లు..!

image

HYD రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులకు అడుగులు వేగంగా పడుతున్నాయి. ఉత్తర, దక్షిణ భాగాలుగా నిర్మించే దీనికి అయ్యే మొత్తం వ్యయంపై అధికారులు ఒక అంచనాకు వచ్చారు. 2 భాగాలు కలిపి మొత్తం 350 కిలోమీటర్ల మేర నిర్మాణం కానున్నట్లు లెక్కగట్టారు. తొలుత నిర్మాణం చేపట్టే ఉత్తర భాగం రహదారికి ఆగస్టు రెండో వారంలో టెండర్లకు వెళ్లాలని నిర్ణయించారు. దక్షిణ భాగం అలైన్‌మెంట్‌పై NHAI అధికారులు చర్చలు జరుపుతున్నారు.

News June 18, 2024

HYD: ‘RRR’@ రూ.31 వేల కోట్లు..!

3 రోజుల వ్యవధిలో ఉన్నతాధికారులు ఇద్దరు బదిలీ

image

నల్లగొండ జిల్లాలో 3 రోజుల వ్యవధిలో జిల్లా ఉన్నతాధికారులు ఇద్దరు బదిలీ కావడం చర్చనీయంశంగా మారింది. వీరిద్దరూ జిల్లాకు ఈ ఏడాది తొలి వారంలో వచ్చారు. వచ్చిన 6నెల్లలోపే బదిలీ అయ్యారు. ఈ నెల15న కలెక్టర్‌ హరిచందన బదిలీ కాగా.. తాజాగా నిన్న జిల్లా ఎస్పీ చందనా దీప్తి కూడా బదిలీ అయ్యారు. చందనాదీప్తి స్థానంలో శరత్‌ చంద్ర పవార్‌ను జిల్లా ఎస్పీగా నియమించారు. హరిచందన స్థానంలో నారాయణ రెడ్డి బదిలీపై వచ్చారు.

News June 18, 2024

HYD: మెట్రో ఎండీ NVS రెడ్డిని కలిసిన ఎంపీ రఘునందన్ రావు

image

హైదరాబాద్ మెట్రో రైల్ భవన్‌కి ఎంపీ రఘునందన్ ఈరోజు వచ్చారు. బేగంపేట్‌లోని మెట్రో స్టేషన్‌లో మెట్రో రైల్ ఎండీ NVS
రెడ్డిని ఎంపీ రఘునందన్ రావు కలిసి వినతిపత్రం అందజేశారు. మియాపూర్ నుంచి పటాన్‌చెరుకు, అక్కడి నుంచి సంగారెడ్డికి మెట్రో రైల్‌ను విస్తరించాలని మెట్రో రైలు ఎండీని మెదక్ ఎంపీ రఘునందన్ రావు కోరారు. దీనికి ఎండీ NVS రెడ్డి సానుకూలంగా స్పందించారు.

News June 18, 2024

HYD: మెట్రో ఎండీ NVS రెడ్డిని కలిసిన ఎంపీ రఘునందన్ రావు

image

హైదరాబాద్ మెట్రో రైల్ భవన్‌కి ఎంపీ రఘునందన్ ఈరోజు వచ్చారు. బేగంపేట్‌లోని మెట్రో స్టేషన్‌లో మెట్రో రైల్ ఎండీ NVS రెడ్డిని ఎంపీ రఘునందన్ రావు కలిసి వినతిపత్రం అందజేశారు. మియాపూర్ నుంచి పటాన్‌చెరుకు, అక్కడి నుంచి సంగారెడ్డికి మెట్రో రైల్‌ను విస్తరించాలని మెట్రో రైలు ఎండీని మెదక్ ఎంపీ రఘునందన్ రావు కోరారు. దీనికి ఎండీ NVS రెడ్డి సానుకూలంగా స్పందించారు.