Telangana

News June 18, 2024

కంటోన్మెంట్ బోర్డు GHMCలో విలీనం చేస్తారా.. లేదా?

image

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు GHMCలో విలీనం చేస్తారా.. లేదా అనే విషయమై స్థానిక ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఓ వైపు కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు అంటూ ఓటర్ల జాబితా సవరణకు అధికారులు చర్యలు చేపట్టారు. మరోవైపు త్వరలో విలీనం అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటనలు చేశాయి. అయితే ఎన్నికల ప్రక్రియ చేపట్టేందుకు కంటోన్మెంట్ బోర్డు యంత్రాంగం సిద్ధమవుతోంది. దీంతో స్థానికంగా అర్థంకాని పరిస్థితి నెలకొంది.

HYD: నార్త్ జోన్ డీసీపీగా సాధన రష్మీ పెరుమాళ్‌..

image

HYD నార్త్ జోన్ డీసీపీగా సాధన రష్మీ పెరుమాళ్‌ బదిలీపై వస్తున్నారు. ప్రస్తుతం నార్త్‌జోన్‌ డీసీపీగా పనిచేస్తున్న రోహిణి ప్రియదర్శిని నిజామాబాద్‌ డిచ్‌పల్లి 7వ బెటాలియన్‌కు బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో ప్రస్తుతం హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా పనిచేస్తున్న సాధన రష్మీ పెరుమాళ్‌ నార్త్ జోన్ డీసీపీగా బదిలీ అయ్యారు. త్వరలో ఆమె బాధ్యతలు చేపట్టనున్నట్లు పోలీస్ సిబ్బంది తెలిపారు.  

News June 18, 2024

మద్దూర్: పులులకు హాని కలిగిస్తే రూ.10 లక్షలు జరిమానా!

image

మద్దూర్ మండల పరిధిలోనీ చెన్నారెడ్డిపల్లి, కంసాన్‌పల్లి, పరిసర ప్రాంతాల్లో చిరుత పులులు సంచరిస్తున్నాయని, అప్రమత్తంగా ఉంటూ.. వాటికి హాని తలపెట్టకూడదని మద్దూరు మండల ఫారెస్టు అధికారి లక్ష్మణ్ సోమవారం తెలిపారు. వాటికి నష్టం కల్గించే ప్రయత్నాలు పొలాలకు విద్యుత్తు తీగలు ఏర్పాట్లు, చనిపోయిన జీవాలకు విషప్రయోగం చేస్తే.. రూ.10లక్షల జరిమానా, జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు.

News June 18, 2024

HYD: నార్త్ జోన్ డీసీపీగా సాధన రష్మీ పెరుమాళ్‌..

image

HYD నార్త్ జోన్ డీసీపీగా సాధన రష్మీ పెరుమాళ్‌ బదిలీపై వస్తున్నారు. ప్రస్తుతం నార్త్‌జోన్‌ డీసీపీగా పనిచేస్తున్న రోహిణి ప్రియదర్శిని నిజామాబాద్‌ డిచ్‌పల్లి 7వ బెటాలియన్‌కు బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో ప్రస్తుతం హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా పనిచేస్తున్న సాధన రష్మీ పెరుమాళ్‌ నార్త్ జోన్ డీసీపీగా బదిలీ అయ్యారు. త్వరలో ఆమె బాధ్యతలు చేపట్టనున్నట్లు పోలీస్ సిబ్బంది తెలిపారు.

News June 18, 2024

హుస్నాబాద్‌లో కలకలం సృష్టించిన దారుణ హత్య.!

image

హుస్నాబాద్ మండలంలోని కూచన‌పల్లి గ్రామంలో జరిగిన హత్యోదంతం కలకలం రేపుతోంది. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన గీకురు నరసయ్య(55)ను ఇంట్లో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు <<13460973>>గోడ్డలి<<>>తో నరికారు. భూ తగాదాల వల్ల జరిగిందా? లేక ఇంకేమైనా కారణాలతో హత్య చేశారనే కోణంతో పోలీసులు విచారణ చేపట్టారు. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

News June 18, 2024

NZB: సివిల్స్ ఉచిత కోచింగ్.. దరఖాస్తుల ఆహ్వానం

image

HYD SC స్టడీ సర్కిల్ అధ్వర్యంలో నిర్వహించే సివిల్స్ ఉచిత కోచింగ్ కోసం SC, ST, BC విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు NZB జిల్లా SC అభివృద్ధి అధికారి శశికళ తెలిపారు. అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. డిగ్రీ పాసై వార్షిక ఆదాయం రూ.3లక్షలకు కంటే తక్కువ ఉన్నవారు అర్హులన్నారు. జులై 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని జులై 21న రాత పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.

News June 18, 2024

స్టేషన్ ఘనపూర్: GREAT.. చదువుకున్న స్కూల్‌కే HMగా!

image

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం చిన్నపెండ్యాలకు చెందిన శాగ శ్రీనివాస్ అప్పటి మల్కాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1989-90లో పదో తరగతి చదువుకున్నారు. ఆయన ఇటీవల మల్కాపూర్ పాఠశాలకు గెజిటెడ్ హెచ్ఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులైన ఇల్లందుల సుదర్శన్, జనగాం యాదగిరి మాట్లాడుతూ.. చదువుకున్న పాఠశాలకు హెచ్ఎంగా ఉద్యోగం రావడం అభినందనీయమన్నారు.

News June 18, 2024

HYD: మీ ప్రాంతంలో కరెంట్ పోతుందా..?

image

HYD, RR, MDCL,VKB జిల్లాలలోని పలు ప్రాంతాల్లో కరెంట్ కోతలతో ఇబ్బంది పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. రాత్రి బంజారాహిల్స్, చందానగర్, ఎల్బీనగర్, జవహర్‌నగర్ తదితర చోట్ల కరెంట్ కోతలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సమస్యల పరిష్కారానికి TGSPDCL అధికారులు కంట్రోల్ రూమ్ నంబర్లను అందుబాటులోకి తెచ్చారు. HYD, RR, MDCL ప్రజలు పై ఫొటోలోని నంబర్లు, VKB ప్రజలు 9493193177 నంబర్‌లో సంప్రదించండి.
SHARE IT

News June 18, 2024

HYD: మీ ప్రాంతంలో కరెంట్ పోతుందా..?

image

HYD, RR, MDCL,VKB జిల్లాలలోని పలు ప్రాంతాల్లో కరెంట్ కోతలతో ఇబ్బంది పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. రాత్రి బంజారాహిల్స్, చందానగర్, ఎల్బీనగర్, జవహర్‌నగర్ తదితర చోట్ల కరెంట్ కోతలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సమస్యల పరిష్కారానికి TGSPDCL అధికారులు కంట్రోల్ రూమ్ నంబర్లను అందుబాటులోకి తెచ్చారు. HYD, RR, MDCL ప్రజలు పై ఫొటోలోని నంబర్లు, VKB ప్రజలు 9493193177 నంబర్‌లో సంప్రదించండి.SHARE IT