Telangana

News June 18, 2024

నల్గొండ: రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

నల్లగొండ మండల పరిధిలోని బాబాసాయిగూడెం స్టేజీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతి చెందిన యువకుడు తిరుమలగిరి సాగర్‌కు చెందిన బత్తుల పవన్‌గా గుర్తించారు. మృతి చెందిన మరో మహిళ వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

News June 18, 2024

ADB: ఫసల్ భీమా కోసం రైతుల ఎదురుచూపులు.!

image

అధిక వర్షాలు, వరదలతో ప్రతిఏటా ఆదిలాబాద్ జిల్లాలో భారీగా పంట నష్టం జరుగుతోంది. అయినప్పటికీ రైతులు మాత్రం పంటనష్ట పరిహారానికి నోచుకోవడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 5.30 లక్షల ఎకరాల్లో పత్తి, సోయా, జొన్న, మొక్కజొన్న తదితర పంటలు సాగవుతున్నాయి. కానీ పంట నష్టం జరిగితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ఇవ్వక అటు కేంద్రం నుంచి వచ్చే పరిహారం రాకపోవడంతో రైతుల మీద అప్పులు, పెట్టుబడి భారం పెరిగిపోతోంది.

News June 18, 2024

HYD: చందనాదీప్తి నేపథ్యం ఇదే..!

image

సికింద్రాబాద్ రైల్వే SPగా చందనాదీప్తి నల్గొండ నుంచి బదిలీపై వస్తున్న విషయం తెలిసిందే. 1983 వరంగల్‌లో జన్మించిన ఆమె ఏపీలో 10th, ఇంటర్ వరకు చదివారు. ఢిల్లీ IITలో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశారు. ఆమె తండ్రి సూచనలతో HYDలో కోచింగ్ తీసుకొని IPS ర్యాంకు సాధించారు. మొదట ఆమె నల్గొండ ప్రొబేషనరీ ఆఫీసర్‌గా, ఆ తర్వాత తాండూరు ASPగా, NZB OSDగా, మెదక్ SPగా, HYD నార్త్ జోన్ DCPగా, నల్గొండ SPగా పనిచేశారు.

News June 18, 2024

HYD: చందనాదీప్తి నేపథ్యం ఇదే..!

image

సికింద్రాబాద్ రైల్వే SPగా చందనాదీప్తి నల్గొండ నుంచి బదిలీపై వస్తున్న విషయం తెలిసిందే. 1983 వరంగల్‌లో జన్మించిన ఆమె ఏపీలో 10th, ఇంటర్ వరకు చదివారు. ఢిల్లీ IITలో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశారు. ఆమె తండ్రి సూచనలతో HYDలో కోచింగ్ తీసుకొని IPS ర్యాంకు సాధించారు. మొదట ఆమె నల్గొండ ప్రొబేషనరీ ఆఫీసర్‌గా, ఆ తర్వాత తాండూరు ASPగా, NZB OSDగా, మెదక్ SPగా, HYD నార్త్ జోన్ DCPగా, నల్గొండ SPగా పనిచేశారు.

News June 18, 2024

వరంగల్: నేడు పత్తి ధర రూ.6,850

image

మూడు రోజుల సుదీర్ఘ విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఈరోజు ప్రారంభమైంది. ఈ క్రమంలో పత్తి భారీగా తరలి రాగా.. శుక్రవారంతో పోలిస్తే ధర తగ్గింది. శుక్రవారం రూ.6,900 పలికిన క్వింటా పత్తి.. ఈరోజు రూ.6,850కి పడిపోయింది. దీంతో రైతన్నలు నిరాశ చెందుతున్నారు. మార్కెట్లో క్రయవిక్రయాల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.

News June 18, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.20,000 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,000 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. గత రోజు కంటే ఈరోజు ఏసీ మిర్చి ధర, పత్తి ధర స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారస్తులు తెలిపారు. మార్కెట్ కు వచ్చే రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలని సూచించారు.

News June 18, 2024

ఎన్పీడీసీఎల్: విద్యుత్ సమస్యలపై 362 ఫిర్యాదులు

image

వినియోగదారుల సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించాలన్న ఉద్దేశంతో ఎన్పీడీసీఎల్ అధికారులు సోమవారం ‘విద్యుత్ ప్రజావాణి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో ఉన్న 16 జిల్లాల్లోని సర్కిల్ కార్యాలయాల నుంచి కింది స్థాయి సబ్ డివిజన్, సెక్షన్ కార్యాలయాల వరకు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. విద్యుత్ సంబంధిత అంశాలు, సమస్యలపై తొలి రోజు 362 ఫిర్యాదులు వచ్చాయి.

News June 18, 2024

KMR: గతంలో కుతూరిపై అత్యాచారం.. ఇప్పుడు ఆమె తండ్రిపై దాడి

image

కామారెడ్డి జిల్లాలో సోమవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు నాగయ్య అనే వ్యక్తి <<13460682>>గొంతు కొసి<<>>న విషయం తెలిసిందే. గతంలో దివ్యాంగురాలైన నాగయ్య కుమార్తెపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసినట్లు స్థానికులు తెలిపారు. కాగా జైలులో శిక్ష అనుభవించిన యువకులు ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చారు. నిన్న రాత్రి నాగయ్యపై కత్తితో దాడి చేసి గొంతు కోసి పరారైనట్లు వెల్లడించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది.

News June 18, 2024

హ్యాండ్లూమ్ టెక్నాలజీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు

image

వరంగల్ జిల్లాలోని విద్యార్థులు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని చేనేత జౌళి శాఖ ఏడీ రాఘవరావు తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులై, 23 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలన్నారు. పూర్తి వివరాలకు www. iihtfulia. ac.inలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.

News June 18, 2024

వాజేడు: మద్యం తాగొద్దని భార్య మందలింపు.. భర్త ఆత్మహత్య

image

భార్య మద్యం తాగొద్దని మందలించినందుకు పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ములుగు జిల్లా వాజేడు మండలంలో జరిగింది. ఎస్సై హరీశ్ వివరాలు.. శ్రీరాంనగర్ గ్రామానికి చెందిన పూనెం ప్రసాద్ (50) ట్రాక్టర్ నడుపుతూ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో భార్యతో గొడవపడుతూ ఉండేవాడని, దీంతో ఆమె మద్యం తాగొద్దని పలుమార్లు మందలించడంతో పురుగుమందు తాగాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.