Telangana

News June 18, 2024

నిజామాబాద్ ప్రజలకు CP సూచనలు

image

NZB జిల్లా ప్రజలకు CP కల్మేశ్వర్ పలు సూచనలు చేశారు. A సర్టిఫికెట్ సినిమాలకు థియేటర్‌లోకి బాలలను అనుమతించకూడదన్నారు.. జిల్లాలో ఊరేగింపులు, బహిరంగ ప్రదేశాల్లో, కళ్యాణ మండపాల్లో డీజేలు నిషేధమని పేర్కొన్నారు. బహిరంగ సభలకు ACP వద్ద లేదా CP వద్ద, విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు స్టాచ్యూ కమిటీ సిఫార్సు తప్పనిసరన్నారు. గల్ఫ్ ఏజెంట్లకు ఇళ్లు అద్దెకు ఇచ్చే ముందు పోలీస్ స్టేషన్‌లో ఎంక్వయిరీ చేయాలని సూచించారు.

News June 18, 2024

HYD: రోడ్లపై ఒంటరిగా వెళ్లే వారే వీరి TARGET.. జర జాగ్రత్త!

image

భయంకరమైన ధార్ గ్యాంగ్ ఘటనలు మరవకముందే గ్రేటర్ HYDలో మరో ముఠా కలకలం రేపుతోంది. యూపీ షామ్లి జిల్లాకు చెందిన భవారియా గ్యాంగ్ రోడ్లపై ఒంటరిగా వెళ్లేవారినే టార్గెట్ చేస్తూ దాడి చేసి చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతోంది. తాజాగా సిటీ పరిధిలో ఒకేరోజు 4 చైన్ స్నాచింగ్‌లు చేశారు. నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్లతో ఉన్న బైక్‌లపై వచ్చి చైన్ స్నాచింగ్‌లు చేస్తూ పోలీసులకే సవాల్ విసురుతున్నారు. జర జాగ్రత్త!

ఖమ్మం: భార్యను కడతేర్చిన ఆర్ఎంపీ!!

image

ఖమ్మం వికలాంగుల కాలనీలో ఆర్ఎంపీగా ప్రాక్టీస్ చేస్తున్న మల్లయ్యకు తొలుత శైలజతో వివాహమైంది. ఇద్దరు పిల్లలు పుట్టాక ఆమె కనిపించకుండా వెళ్లిపోవడంతో నేలకొండపల్లి మండలం భైరవునిపల్లి కళావతిని రెండో వివాహం చేసుకున్నాడు. ఇటీవల వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం ఆమెను అడ్డు తొలగించాలని గొంతు నులిమి హత్య చేసి గుండెపోటుతో మృతి చెందిందని బంధువులకు తెలిపాడు. ఈమేరకు పోలీసులు విచారించగా నేరం ఒప్పుకున్నాడు.

News June 18, 2024

చిట్యాల ప్రాథమిక పాఠశాల హెచ్ఎం సస్పెండ్

image

అడవిదేవులపల్లి మండలం చిట్యాల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జి.సతీష్ పై సస్పెన్షన్ వేటు పడింది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం రికార్డుల నిర్వహణ, రాగి జావ పంపిణీలో అవకతవకలు జరిగినట్లు అధికారుల తనిఖీలో వెల్లడైంది. దీనిపై పూర్తి విచారణ జరిపి హెచ్ఎం జి.సతీష్ ను సస్పెండ్ చేస్తూ డీఈఓ భిక్షపతి సోమవారం ఉత్తర్వులు జారీచేశారని ఎంఈఓ బాలాజీనాయక్ తెలిపారు.

News June 18, 2024

HYD: రవీంద్రభారతిలో ప్రీతిక కూచిపూడి రంగప్రవేశం

image

శ్రీ అఖిల భారత కూచిపూడి నాట్యకళా మండలి ఆధ్వర్యంలో ప్రఖ్యాత నాట్యగురువు పెనుమర్తి మృత్యుంజయశర్మ శిష్యురాలు పవిరళ అచ్చుత్ దీపిక తనయ ప్రీతిక  సవిరళ కూచిపూడి రంగప్రవేశాన్ని చేసింది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కూచిపూడి శాస్త్రీయ నృత్యంపై మక్కువతో కూచిపూడి రంగప్రవేశాన్ని ఆగ్రేసర వర్తనశోభతో విరాజిల్లింపజేసి అందరి ప్రశంసలందుకుంది. HYD రవీంద్రభారతిలో ప్రముఖులు ఆమె కూచిపూడి రంగప్రవేశాన్ని కొనియాడారు.

వరంగల్: డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలు పొందడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైట్ కళాశాల ప్రిన్సిపల్ నారాయణరెడ్డి తెలిపారు. ఈ నెల 30 వరకు https://deecet.cdse.telangana.gov.in/వెబ్సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.

News June 18, 2024

HYD: ముగిసిన శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

image

HYD హిమాయత్‌నగర్‌లోని టీటీడీ బాలాజీ భవన్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం 19వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పుష్పయాగం వైభవంగా జరిగింది. ఉదయం నుంచి రాత్రి వరకు వేలాది మంది భక్తులు తరలివచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈనెల 12వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవాలు సోమవారం రాత్రి 9 గంటలకు జరిగిన ధ్వజారోహణం కార్యక్రమంతో ముగిశాయి.