Telangana

News June 18, 2024

నాగిరెడ్డిపేట్‌లో వ్యక్తి గొంతు కోసిన దుండగులు

image

వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి గొంతు కోసిన ఘటన నాగిరెడ్డిపేటలో చోటుచేసుకుంది. మండలంలోని రాఘవపల్లికి చెందిన నాగయ్య(55) సోమవారం రాత్రి కాలకృత్యాలు తీర్చుకొని వస్తుండగా పోచమ్మ గుడి వద్ద గుర్తు తెలియని దుండగులు అతడిపై కత్తితో దాడి చేసి గొంతు కోసి పరారయ్యారు. అతడిని చికిత్స నిమిత్తం స్థానికులు ఎల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News June 18, 2024

సిర్పూర్ టీ: విద్యుత్ షాక్‌తో బాలిక మృతి

image

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండలంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామపంచాయతీ పరిధిలోని దుబ్బగూడ కాలనీకి చెందిన వరలక్ష్మి(12)ఇంట్లో ఉన్న కూలర్ తగిలి విద్యుత్ షాక్‌తో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

News June 18, 2024

కరీంనగర్: ఖాళీ స్థలాల్లో చెత్తా చెదారం!

image

కరీంనగర్‌ కార్పొరేషన్‌తో పాటు జమ్మికుంట, హుజూరాబాద్, చొప్పదండి, కొత్తపల్లి మున్సిపాలిటీల పరిధిలో ఇళ్ల మధ్య ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఇప్పటికే చెత్తా చెదారంతో నిండిపోగా వాటిని ఎప్పటికప్పుడూ శుభ్రం చేసుకోవాల్సిన యజమానులు పట్టించుకోవడం లేదు. వర్షం పడితే ఆయా స్థలాల్లో మురుగునీరు నిలిచి దోమలకు ఆవాసంగా మారే ప్రమాదం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో స్థల యజమానులు స్పందించి పరిసరాల పరిశుభ్రతకు సహకరించాల్సిన అవసరం ఉంది.

News June 18, 2024

కాజీపేట: ప్రేమ పేరుతో బాలికపై అత్యాచారం

image

ప్రేమ పేరుతో బాలికను నమ్మించి అత్యాచారం చేసిన ఓ వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు కాజీపేట పోలీసులు తెలిపారు. భట్టుపల్లికి చెందిన రాజారపు ఉమేశ్, కాజీపేటకు చెందిన ఓ బాలికను ప్రేమిస్తున్నానని నమ్మించి గతేడాది HYD తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు చెప్పారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఉమేశ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై నవీన్ కుమార్ పేర్కొన్నారు.

News June 18, 2024

ఖమ్మం జిల్లాలో బస్సుల సమస్య..!

image

ఖమ్మం జిల్లాలో అనేక ప్రాంతాల్లో బస్సుల సర్వీసులు లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. కూసుమంచి మండలంలో 33గ్రామాలకు, రఘునాథపాలెం మండలంలో 15పంచాయతీలకు, చింతకాని మండలంలో 21గ్రామాలకు బస్సులు తిరగడం లేదు. ఈ సందర్భంగా విద్యార్థిని మన్విత మాట్లాడుతూ.. తాను డిగ్రీలో చేరినప్పుడు తన ఊరికి బస్సొచ్చేదని..ఏడాదిక్రితం రద్దు చేశారని తెలిపింది. బస్సెక్కాలంటే 3KM దూరంలోని నాగులవంచకు వెళ్లాల్సి వస్తోందని వాపోయింది.

News June 18, 2024

HYD: రెవెన్యూ శాఖలో అధికారాల వికేంద్రీకరణ జరపాలని మంత్రికి వినతి

image

రెవెన్యూ శాఖలో అధికారాల వికేంద్రీకరణ జరపాలని తెలంగాణ తహశీల్దార్స్‌ అసోసియేషన్‌ (టీజీటీఏ) నాయకులు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిని కోరారు. HYD నాంపల్లిలోని టీజీటీఏ కార్యాలయంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.రాములు ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం సోమవారం జరిగింది. అనంతరం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కలిసి సమస్యలు, పదోన్నతులపై వినతిపత్రం సమర్పించారు.

మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీగా జానకి ధరావత్ నేపథ్యం!

image

మహబూబ్ నగర్ జిల్లా నూతన ఎస్పీగా జానకి ధరావత్ రానున్నారు. ఎస్పీ స్వస్థలం సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం రోళ్లబండ తండా. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 2007లో 6 నెలల పాటు ప్రొబేషనరీ డీఎస్పీగా పనిచేసిన ఆమెకు MBNRపై అవగాహన ఉంది. 2013లో ఐపీఎస్‌గా పదోన్నతి పొందారు. ప్రస్తుతం సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా పనిచేస్తున్నారు. అక్కడ నుంచి బదిలీపై జిల్లాకు వస్తున్నారు.

News June 18, 2024

HYD: ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, సినిమాటోగ్రఫీ రంగాల్లో ఉచితంగా డిప్లొమా

image

తెలంగాణ ప్రభుత్వ భాషా, సాంస్కృతిక శాఖ, సిగ్మా అకాడమీ ఆఫ్‌ ఫొటోగ్రఫీ సంయుక్త ఆధ్వర్యంలో ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, సినిమాటోగ్రఫీ రంగాల్లో 6 నెలల పాటు ‘ఆఫ్‌, ఆన్‌లైన్‌’లో ఉచితంగా డిప్లొమా కోర్సుకు శిక్షణ ఇస్తున్నామని సిగ్మా అకాడమీ ఆఫ్‌ ఫొటోగ్రఫీ ఛైర్మన్‌ ఎంసీ.శేఖర్‌ సోమవారం తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు సెల్‌ నంబర్లు 80080 21075, 70956 92175లో సంప్రదించి ఈ నెల 30లోపు పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.