Telangana

News June 18, 2024

సిద్దిపేట: జూన్ 24న జాబ్ మేళా

image

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జూన్ 24న హుస్నాబాద్ వేదికగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. 60కి పైగా కంపెనీల్లో 5వేల ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థులనుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. తిరుమల గార్డెన్స్ అండ్ ఫంక్షన్ హాల్‌లో జరిగే ఈ జాబ్ మేళాలో 18-35 ఏళ్ల వయసు గల నిరుద్యోగ యువతకు అవకాశం కల్పించింది. వివరాలకు 9642333667, 6300670339 నంబర్లను సంప్రదించాలని సూచించింది.

News June 18, 2024

ADB పోలీస్ బెటాలియన్ కమాండెంట్‌గా కలెక్టర్ భార్య

image

ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న యాపల్ గూడ 2వ పోలీస్ బెటాలియన్ కమాండెంట్‌గా నిఖిత పంత్ జిల్లాకు బదిలీపై వస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న రాజర్షి షా, నిఖిత పంత్ దంపతులు. ఒకే జిల్లాలో IPS, IASగా దంపతులు విధులు నిర్వర్తించడం విశేషం.

News June 18, 2024

నేటి నుంచి కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దర్శన వేళల్లో మార్పులు

image

పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శన వేళలను పునరుద్ధరించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వాతావరణంలో మార్పుల వల్ల భక్తులు, అర్చకులు సిబ్బంది సౌకర్యార్థం మార్పులు చేసినట్లు చెప్పారు. మధ్యాహ్నం 1:30 గంటల నుంచి 4 గంటల వరకు విరామ సమయంగా నిర్ణయించారు. ఉదయం 6:30 గంటల నుంచి 1:30 గంటల వరకు తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు భక్తులు దర్శనాలు వివిధ పూజలు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

News June 18, 2024

ఇప్పట్లో నిజామాబాద్ CP బదిలీ లేనట్లే.!

image

నిజామాబాద్ CP కల్మేశ్వర్ బదిలీపై ఊహాగానాలకు తెరపడింది. నిన్న జరిగిన IPSల బదిలీల్లో ఆయన పేరు లేకపోవడంతో ఇప్పట్లో ఆయన బదిలీ లేనట్లేనని స్పష్టత వచ్చింది. కల్మేశ్వర్ సతీమణి అయిన IPS అధికారిణి రోహిణీ ప్రియదర్శిని డిచ్పల్లి 7వ బెటాలియన్ కమాండెంట్‌గా బదిలీపై వస్తుండటంతో CP ట్రాన్స్ఫర్ వార్తలకు చెక్ పడింది. సీపీ కల్మేశ్వర్ బదిలీ అవుతారంటూ కొద్ది రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

News June 18, 2024

నేటి నుంచి కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దర్శన వేళల్లో మార్పులు

image

పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శన వేళలను పునరుద్ధరించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వాతావరణంలో మార్పుల వల్ల భక్తులు, అర్చకులు సిబ్బంది సౌకర్యార్థం మార్పులు చేసినట్లు చెప్పారు. మధ్యాహ్నం 1:30 గంటల నుంచి 4 గంటల వరకు విరామ సమయంగా నిర్ణయించారు. ఉదయం 6:30 గంటల నుంచి 1:30 గంటల వరకు తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు భక్తులు దర్శనాలు వివిధ పూజలు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

News June 18, 2024

HYD: డబుల్ బెడ్రూం ఇండ్లు.. పని చేయని లిఫ్ట్‌లు?

image

HYD శివారు అమీన్‌పూర్‌లోని డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాల్లో మౌలిక వసతులు కరువయ్యాయని లబ్ధిదారులు వాపోతున్నారు. కొన్ని బ్లాకుల్లో లిఫ్ట్‌లు పని చేయడం లేదన్నారు. నిత్యావసరాలు, తదితర సామగ్రి తీసుకొని 7, 8, 9 ఫ్లోర్లు ఎక్కాలంటే‌ వృద్ధులు అలసిపోతున్నారని‌ చెబుతున్నారు. ఉన్నతాధికారులు చొరవ తీసుకొని లిఫ్ట్‌లను బాగుచేయాలని వేడుకుంటున్నారు.

హుస్నాబాద్ పార్టీ కార్యాలయంలో మంత్రి పొన్నం సమావేశం 

image

హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండల పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ వర్షాకాలంలో వ్యవసాయానికి సంబంధించిన ఎరువులు, విత్తనాల గురించి.. విద్యుత్ అంతరాయం తాగునీటి ఇబ్బందులపై సమస్యలు ఉంటే త్వరగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.   

News June 18, 2024

పుట్టిన ఊరు రుణం తీర్చుకుంటా: అందే శ్రీ

image

తాను పుట్టిన ఊరు రుణం తీర్చుకుంటానని తమ గ్రామాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్తానని కవి అందె శ్రీ అన్నారు. శనివారం తన స్వగ్రామమైన జనగాం నియోజకవర్గ పరిధిలోని మద్దూరు మండలం రేబర్తి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల అవసరాలను, గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అందెశ్రీ రాసిన గేయం జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదించిన సందర్భంగా గ్రామస్తులు, ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు.

News June 18, 2024

MBNR: ఈనెల 19 వరకు బడిబాట

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 2,975 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. బడిబాట కార్యక్రమానికి రూ.29.75 లక్షలు కేటాయించారు. బ్యానర్, కరపత్రాల ముద్రణ, ఇతర ఖర్చుల కోసం ప్రతి ప్రభుత్వ పాఠశాలకు రూ.వెయ్యి చొప్పున మంజూరు చేశారు. ఈనెల 19 వరకు బడిబాట కార్యక్రమం కొనసాగనుందని అధికారులు తెలిపారు.