Telangana

News June 17, 2024

ఆర్మూర్: రెండు దేవాలయాల్లో చోరీ

image

ఆర్మూర్ పట్టణంలోని తిరుమల కాలనీలో 2 దేవాలయాల్లో చోరీ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హనుమాన్ దేవాలయం, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారని చెప్పారు. హనుమాన్ ఆలయంలో హుండీని పగలగొట్టి నగదును అపహరించగా, శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో చోరీకి విఫలయత్నం చేశారని పేర్కొన్నారు.

News June 17, 2024

ఉమ్మడి జిల్లాలో యథేచ్ఛగా నిషేధిత ప్లాస్టిక్ వాడకం!?

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు పురపాలికల్లో నిషేధిత ప్లాస్టిక్ (సింగల్ యూజ్డ్) విక్రయాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. వాటి వాడకం ఏటా రెట్టింపు అవుతోంది. పట్టణాల్లోంచి ప్రవహించే వాగులు, డ్రైనేజీల్లో వ్యర్థాల్ని అడ్డగోలుగా పారబోస్తున్నారు. ఇవి వర్షాకాలంలో ప్రవాహాలకు అడ్డుగా నిలిచి ముంపు బెడద తీవ్రమవుతోందని బాధిత ప్రాంతాల వాసులు గగ్గోలు పెడుతున్నారు.

News June 17, 2024

ఆదిలాబాద్: ఉచిత శిక్షణకు దరఖాస్తులు.. APPLY NOW

image

రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్లో నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలకు 10 నెలల ఉచిత శిక్షణకు గాను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఉమ్మడి జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రమేష్ తెలిపారు. ఆసక్తి గలవారు http: //tsstudycircle.co.in వెబ్ సైట్ లో ఈ నెల 17 నుంచి జులై 10 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
SHARE IT

News June 17, 2024

సిద్దిపేట జిల్లాలో దారుణం

image

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామలో దారుణ ఘటన వెలుగు చూసింది. కుటుంబ కలహాలతో తల్లి తన ఇద్దరు పిల్లలు  అనన్య(3), సహస్ర(1)ను నీటిలో ముంచి హత్య చేసేందుకు యత్నించింది. అనంతరం ఆమె కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కాగా.. ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News June 17, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా బక్రీద్.
@ కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్‌లో పడి వ్యక్తి మృతి.
@ ముస్తాబాద్ మండలంలో దొంగల హల్ చల్.
@ ఇబ్రహీంపట్నం మండలంలో వ్యవసాయ బావిలో దూకి మహిళా ఆత్మహత్య.
@ మల్హర్ మండలంలో విద్యుత్ షాక్ తగిలి యువకుడి మృతి.
@ జగిత్యాల జిల్లా ఎస్పీగా అశోక్ కుమార్.
@ మెట్ పల్లి మండలంలో అనారోగ్యంతో ఆర్ఎంపి వైద్యుడు మృతి.

News June 17, 2024

BREAKING.. వరంగల్: పిచ్చికుక్కల దాడిలో పసికందు మృతి

image

మహబూబాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. తొర్రూరు మండలం మడిపల్లిలో పిచ్చికుక్కల దాడిలో నెలరోజుల పసికందు మృతి చెందింది. ఇంట్లో నిద్రిస్తున్న 42 రోజుల బాబుపై కుక్కదాడి చేయడంతో బాలుడు మృతి చెందాడు. తల్లి వంట చేస్తూ ఆదమరిచి ఉన్నప్పుడు కుక్క దాడి చేసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 17, 2024

HYD: కట్ట మైసమ్మ గుడిలోకి వరద నీరు

image

ఫిలింనగర్ బసవతారకనగర్‌ బస్తీలో సా. కుండపోత వర్షం కురిసింది. ఇటీవల వినాయక్‌నగర్ నుంచి బాలిరెడ్డినగర్‌ మీదుగా పారామౌంట్‌హిల్స్ ఏరియా వరకు రహదారి పనులు చేపట్టినా.. పూర్తి చేయలేదు. దీంతో రహదారి మీద నీళ్లు నిలిచాయి. పక్కనే ఉన్న కట్ట మైసమ్మ గుడిలోకి భారీగా వరద చేరడంతో ప్రహరీ కూలి ముగ్గురికి గాయాలు అయ్యాయి. గుడి సగానికి పైగా మునిగిపోయిందని.. ఇకనైనా అధికారులు చర్యలు తీసుకోవాలని బస్తీ వాసులు కోరుతున్నారు.

News June 17, 2024

HYD: కట్ట మైసమ్మ గుడిలోకి వరద నీరు 

image

ఫిలింనగర్ బసవతారకనగర్‌ బస్తీలో సా. కుండపోత వర్షం కురిసింది. ఇటీవల వినాయక్‌నగర్ నుంచి బాలిరెడ్డినగర్‌ మీదుగా పారామౌంట్‌హిల్స్ ఏరియా వరకు రహదారి పనులు చేపట్టినా.. పూర్తి చేయలేదు. దీంతో రహదారి మీద నీళ్లు నిలిచాయి. పక్కనే ఉన్న కట్ట మైసమ్మ గుడిలోకి భారీగా వరద చేరడంతో ప్రహరీ కూలి ముగ్గురికి గాయాలు అయ్యాయి. గుడి సగానికి పైగా మునిగిపోయిందని.. ఇకనైనా అధికారులు చర్యలు తీసుకోవాలని బస్తీ వాసులు కోరుతున్నారు.

News June 17, 2024

MBNR, గద్వాల జిల్లాలకు కొత్త పోలీస్ బాసులు

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎస్పీలు బదిలీ అయ్యారు. మహబూబ్ నగర్ ఎస్పీగా జానకి ధరావత్, జోగులాంబ గద్వాల ఎస్పీగా శ్రీనివాసరావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. మహబూబ్ నగర్ ఎస్పీగా విధులు నిర్వహించిన హర్షవర్ధన్‌ను సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీగా, గద్వాల ఎస్పీగా పని చేసిన రితిరాజ్‌ను ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా నియమించింది.

News June 17, 2024

NZB: డిచ్పల్లి 7వ బెటాలియన్ కమాండెంట్‌గా రోహిణీ ప్రియదర్శిని

image

నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి 7వ బెటాలియన్ పోలీస్ కమాండెంట్‌గా 2012 బ్యాచ్‌కు చెందిన IPS అధికారిణి రోహిణీ ప్రియదర్శిని నియమితులయ్యారు. ఇక్కడ పని చేస్తున్న కమాండెంట్ బి.రాం ప్రకాశ్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.