Telangana

News June 17, 2024

HYD: ఖైరతాబాద్ గణపతి.. 70 ఏళ్లు.. 70 అడుగులు!

image

ఈ సారి ఖైరతాబాద్‌ గణేశ్ వెరీ స్పెషల్. 2023‌లో‌ వరల్డ్ టాలెస్ట్‌ విగ్రహం(63 ఫీట్లు)గా పేరుగాంచిన మహాగణపతి.. 2024‌లో ఆ రికార్డును బ్రేక్ చేయనుంది. 70వ వార్షికోత్సవం సందర్భంగా 70 అడుగుల మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. విగ్రహం ఎత్తులో ఏటా 1 లేదా 2 ఫీట్ల హెచ్చుతగ్గులు‌ ఉండేవి. కానీ, గతేడాది కంటే ఈసారి ఏకంగా 7 ఫీట్లు పెంచుతున్నారు. 1954లో ఒక ఫీట్‌తో మొదలైన గణపయ్య ఇంతింతై వటుడింతవుతూ వస్తున్నాడు.

News June 17, 2024

ADB: జైలుకు వెళ్లకముందు బ్లేడ్ ముక్కలు మింగిన మహిళ ఖైదీ

image

ఆదిలాబాద్ జైలులో శిక్ష అనుభవిస్తున్న మహిళా ఖైదీ అస్వస్థతకు గురైందని ఎలాంటి
హైడ్రామా చేయలేదని జిల్లా జైలు సూపరింటెండెంట్ అశోక్ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు తనకు తినటం ఇబ్బందిగా, కడుపునొప్పి ఉందని తెలిపింది. ఆమెను విచారించగా జైలుకి రాక ముందు చిన్నచిన్న బ్లేడు ముక్కలు మింగిందని చెప్పింది. దీంతో చికిత్స నిమిత్తం రిమ్స్ కు తరలించగా వైద్యులు అవసరమైన చికిత్స అందించి సోమవారం డిశ్చార్జ్ చేశారు.

News June 17, 2024

UPSC సన్నాహక వ్యూహాలపై ‘నారాయణ IAS’ వర్క్‌షాప్

image

నారాయణ IAS అకాడమీ UPSC సివిల్స్ ఆశావహుల కోసం సోమవారం ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో వర్క్ షాప్ నిర్వహించింది. “సివిల్ సర్వీసులకు మార్గం.. అంతర్దృష్టులు & వ్యూహాలు” పేరుతో అభ్యర్థులకు ప్రిపరేషన్ వ్యూహాలపై మార్గ నిర్దేశం చేశారు. DGM, R&D హెడ్ M.శివనాథ్ అభ్యర్థుల సందేహాలకు సమాధానాలు, సలహాలు ఇచ్చారు. తగిన ప్రణాళికలు విజయాన్ని సులభతరం చేస్తుందన్నారు. అధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు.

News June 17, 2024

మల్హర్: విద్యుదాఘాతంతో యువకుడి మృతి

image

మండలంలోని రుద్రారంలో విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. కొయ్యూరు పోలీసులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన నిశాంత్(30) ఇంటి ఆవరణంలోని మోటార్ వైరును సరి చేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు భూపాలపల్లిలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి గత నాలుగు నెలల క్రితమే వివాహమైంది.

News June 17, 2024

HYD: కేబుల్ బ్రిడ్జి మీద యువతి సూసైడ్ అటెంప్ట్

image

హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జి‌ మీద సోమవారం‌ ఓ యువతి సూసైడ్ అటెంప్ట్‌ చేసింది. తీగల వంతెన రెయిలింగ్‌ ఎక్కి దుర్గంచెరువులో దూకబోయింది. ఇది గమనించిన మాదాపూర్‌ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆమెను క్షేమంగా కిందకు దించారు. కానీ, అప్పటికే యువతి నిద్రమాత్రలు మింగినట్లు‌ తెలుసుకున్న పోలీసులు పెట్రోలింగ్ వాహనంలో ఆస్పత్రికి తరలించారు. సూసైడ్ అటెంప్ట్‌కు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

News June 17, 2024

నల్గొండ జిల్లాలో గంజాయి ముఠా అరెస్టు

image

నల్గొండ జిల్లాలో గంజాయి విక్రయిస్తున్న ఓ ముఠాను వాడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 12 మంది ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 6 కిలోల గంజాయి, రూ.46 వేల నగదు, బైకులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయిని ఏపీ నుంచి తెచ్చి మిర్యాలగూడలో అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు.

News June 17, 2024

HYD: కేబుల్ బ్రిడ్జి మీద యువతి సూసైడ్ అటెంప్ట్ 

image

హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జి‌ మీద సోమవారం‌ ఓ యువతి సూసైడ్ అటెంప్ట్‌ చేసింది. తీగల వంతెన రెయిలింగ్‌ ఎక్కి దుర్గంచెరువులో దూకబోయింది. ఇది గమనించిన మాదాపూర్‌ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆమెను క్షేమంగా కిందకు దించారు. కానీ, అప్పటికే యువతి నిద్రమాత్రలు మింగినట్లు‌ తెలుసుకున్న పోలీసులు పెట్రోలింగ్ వాహనంలో ఆస్పత్రికి తరలించారు. సూసైడ్ అటెంప్ట్‌కు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

News June 17, 2024

జాబ్ మేళాలో 58 కంపెనీలు పాల్గొంటాయి: సీతక్క

image

ఈనెల 19న ములుగు జిల్లాలో నిర్వహించే జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సీతక్క అన్నారు. జాబ్ మేళాలో 58 కంపెనీలు పాల్గొంటాయని, 7వ తరగతి నుంచి డిగ్రీ వరకు, వృత్తి విద్య కోర్సులు చేసిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి వెంటనే ఉద్యోగాల్లో చేర్చుకోవడం జరుగుతుందని మంత్రి సీతక్క తెలిపారు.

News June 17, 2024

పార్టీ మార్పు వార్తలపై హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు..!

image

తాను పార్టీ మారబోతున్నట్లుగా జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించి పార్టీ మారనున్నట్లుగా వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. సోషల్‌ మీడియాతో పాటు బ్రేకింగ్స్, వ్యూవ్స్ కోసం పలు మీడియా సంస్థలు తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఇకపై తన విషయంలో తప్పుడు వార్తలు ప్రచారం చేయడం మానాలని ఆయన హితవు పలికారు.

News June 17, 2024

ASF: రిజర్వాయర్‌లో పడ్డ పిల్లలు.. కాపాడబోయి తండ్రి మృతి

image

కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్‌లో మునిగి అసిఫాబాద్ జిల్లాలో పే అండ్ అకౌంట్లో పని చేసే విజయ్ మృతి చెందాడు. ఎల్ఎండీ వద్ద కూతురు సాయినిత్య, కుమారుడు విక్రాంత్ ఫొటో దిగుతుండగా రిజర్వాయర్లో పడ్డారు. ఈ క్రమంలో వారిని కాపాడబోయిన విజయ్ నీటిలో మునిగి మృతి చెందాడు. కాగా, విజయ్ పిల్లలను జాలరి శంకర్ కాపాడారు.