Telangana

News June 17, 2024

ఆదిలాబాద్: ఆ గ్రామంలో మద్యపానం నిషేధం

image

ఆదిలాబాద్ రూరల్ మండలంలో అంకొలి గ్రామంలో మద్యపానం నిషేధించారు. గ్రామంలోని ప్రజలు, యువకులు, మహిళలు అందరు కలిసి ఈ తీర్మానం చేశారు. గ్రామంలో మద్యం అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. యువత చెడు అలవాట్లకు లోను రాకుండా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. 

News June 17, 2024

సూర్యాపేట- ఖమ్మం హైవేపై ధర్నా 

image

సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రంలో తుమ్మలపల్లి గ్రామస్థులు దర్నా చేపట్టారు. ఇసుక ట్రాక్టర్ ఢీకొని తుమ్మలపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి మృతి చెందాడు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని ఖమ్మం- సూర్యాపేట హైవేపై బైటాయించి ఆందోళన చేస్తున్నారు. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

News June 17, 2024

HYD: కేబుల్ బ్రిడ్జి మీద యువతి సూసైడ్ అటెంప్ట్ 

image

హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జి‌ మీద సోమవారం‌ ఓ యువతి సూసైడ్ అటెంప్ట్‌ చేసింది. రెయిలింగ్‌ ఎక్కి దుర్గంచెరువులో దూకబోయింది. ఇది గమనించిన అక్కడి పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆమెను క్షేమంగా కిందకు దించారు. కానీ, అప్పటికే నిద్ర మాత్రలు మింగినట్లు‌ తెలియడంతో పోలీసులు ఆస్పత్రికి తరలించారు. సూసైడ్ అటెంప్ట్‌కు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

News June 17, 2024

రైలు ప్రమాదం దురదృష్టకరం: బండి సంజయ్

image

పశ్చిమ బెంగాల్‌లో జరిగిన కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం చాలా దురదృష్టకరమని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈ ఘటనలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశారు. బాధితులకు ఎక్స్‌గ్రేషియా పరిహారం అందిస్తామన్నారు.

News June 17, 2024

షాద్‌నగర్: చేతబడి.. మహిళను చెట్టుకు కట్టేసి కొట్టారు..!

image

షాద్‌నగర్ పరిధిలో అమానవీయ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. చౌదరిగూడ మండలం రావిర్యాల వాసి పద్మమ్మ చేతబడి చేస్తుందన్న నెపంతో కొందరు ఆమెను చెట్టుకు కట్టేసి కొట్టారు. పద్మమ్మ శ్మశానం నుంచి మృతదేహాల బూడిద తీసుకొని వచ్చి గ్రామంలోని ఇళ్లపై చల్లుతుండడాన్ని గ్రామస్థులు గమనించి ఆమెను దారుణంగా కొట్టారు. ఆమెపై దాడి చేసిన 9మందిపై కేసు నమోదైంది. మూఢ నమ్మకాలకు దూరంగా ఉండాలని SI సక్రం తెలిపారు.

News June 17, 2024

HYD: ట్రాఫిక్ నివారణకు డ్రోన్‌ కెమెరాలు

image

ట్రాఫిక్ నివారణకు డ్రోన్‌ కెమెరాలను సైబరాబాద్‌ పోలీసులు అందుబాటులోకి తెచ్చారు. పైలట్‌ ప్రాజెక్టు కింద ఐకియా, దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జి,హఫీజ్‌పేట్, హైటెక్‌ సిటీ, మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి ఐటీ కారిడార్‌ ప్రాంతాల్లో ఈడ్రోన్‌ను వినియోస్తున్నారు. రోడ్లపై ట్రాఫిక్‌ జామ్‌లు,జంక్షన్ల వద్ద వాహనాల వేగం ఎలా ఉంది? ఎక్కడైనా నీరు నిలిచి ఉందా అనే విషయాలు తెలుసుకొని పోలీసులు స్పందించి పరిష్కరించనున్నారు.

వరంగల్ ఎనుమాముల మార్కెట్ రేపు పున:ప్రారంభం

image

మూడు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ మంగళవారం పున:ప్రారంభం కానుంది. మొన్న, నిన్న వారాంతపు సెలవులు, నేడు బక్రీదు పండుగ కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా, ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.

News June 17, 2024

HYD: రేవంత్ రెడ్డి లాగానే ఈటలకు జరుగుతుందా?

image

మల్కాజిగిరి MP స్థానం రాష్ట్ర స్థాయి నేతలకు కీలకంగా మారింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌లో ఓడిన రేవంత్ రెడ్డి.. 2019లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి గెలిచి ఆ తర్వాత T కాంగ్రెస్ చీఫ్‌గా నియామకమయ్యారు. సేమ్ అలాగే 2023అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్, గజ్వేల్ నుంచి ఓడిన ఈటల రాజేందర్.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి గెలిచారు. ప్రస్తుతం T BJP స్టేట్ చీఫ్ నియామక రేసులో ముందు ఉన్నారు.