Telangana

News June 17, 2024

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన అర్బన్ ఎమ్మెల్యే

image

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డిని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సోమవారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ధన్పాల్ మాట్లాడుతూ.. నిబద్దతతో పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేసిన నాయకులను పార్టీ గుర్తిస్తుందన్నారు. దానికి కిషన్ రెడ్డి నిదర్శనమని కొనియాడారు.

News June 17, 2024

బక్రీద్ శుభాకాంక్షలు: రాచకొండ సీపీ తరుణ్ జోషి

image

ముస్లిం ప్రజలకు రాచకొండ సీపీ తరుణ్ జోషి సోమవారం బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో, అందరూ కలిసి పండుగ నిర్వహించుకోవాలన్నారు. కమిషనరేట్ పరిధిలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న పోలీస్ అధికారులకు అందరూ సహకరించాలని కోరారు. ఎటువంటి అసాంఘిక ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

మహబూబ్‌నగర్: జూన్ నెల ఖర్చుల మాసం

image

ఉమ్మడి జిల్లా ప్రజలకు జూన్ నెల ఖర్చుల మాసంగా మారింది. రైతులు వ్యవసాయానికి సిద్ధమవడం వల్ల విత్తనాలు, ఎరువులు కొనాల్సి ఉంటుంది. మరోవైపు పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం కావడంతో పిల్లలకు బుక్స్, నోట్ బుక్స్, యూనిఫామ్, తదితరాల కొనుగోలు తప్పనిసరి అవుతుంది. ప్రైవేటుగా చదివిస్తే ఫీజు తడిసి మోపెడవుతుంది. వీటికి తోడు పెరిగిన ధరలు కూరగాయలతో బెంబేలెత్తిస్తున్నాయి.

News June 17, 2024

మెదక్: గుండెపోటుతో అల్లుడు, అత్త మృతి

image

మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజుపేటలో గుండెపోటుతో ఇద్దరు మృతిచెందారు. గంటల వ్యవధిలోనే అత్త, అల్లుడి మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. స్థానికుల సమాచారం.. గ్రామానికి చెందిన నరసింహులు(58) ఆదివారం రాత్రి గుండెపోటుతో చనిపోయారు. అల్లుడి మరణం తట్టుకోలేక రోదిస్తున్న అత్త నర్సమ్మ సైతం ఈ ఉదయం గుండెపోటుకు గురై మృతిచెందారు.

News June 17, 2024

HYD: భారీగా పెరిగిన టమాట ధర..!

image

నెల క్రితం టమాటకు ధర లేక మిగిలిపోయిన వాటిని రైతు బజార్లలో వదిలిపోయే పరిస్థితి ఎదురైంది. అప్పట్లో రూ.20లోపు ధర పలికింది. ప్రస్తుతం టమాట ధర భారీగా పెరగడంతో వినియోగదారులు బేజారెత్తిపోతున్నారు. HYD, ఉమ్మడి RRలోని పలు రైతు బజార్లలో అధికారికంగా కిలో రూ.57 పలికింది. బహిరంగ మార్కెట్‌లో మాత్రం రూ.100కు చేరువలో ఉంది. రైతు బజార్లలోనూ ఈ వారంలో రూ.100 పలికే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

HYD: త్వరలో ప్రారంభం కానున్న చర్లపల్లి రైల్వే స్టేషన్

image

HYD చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను రూ.430 కోట్లతో నిర్మించారు. ఎన్నికల ముందు దీనిని ప్రారంభించడానికి ప్రయత్నాలు జరిగినా కోడ్ కారణంగా ప్రారంభోత్సవం వాయిదా పడింది. కేంద్రంలో మళ్లీ మోదీ ప్రధాని కావడం, రైల్వే మంత్రిగా అశ్విన్‌కే మళ్లీ బాధ్యతలు అప్పగించడం, కిషన్ రెడ్డి మరోసారి కేంద్రమంత్రి అవడంతో త్వరలో చర్లపల్లి స్టేషన్ ప్రారంభోత్సవం జరుగుతుందని స్థానికులు భావిస్తున్నారు.

మా అత్తయ్యే గేమ్ ఛేంజర్: వరంగల్ కలెక్టర్

image

తన జీవితంలో గేమ్‌ ఛేంజర్‌ అత్తయ్య విజయలక్ష్మినే అని WGL కలెక్టర్‌ డా.సత్య శారదాదేవి అన్నారు. తాను పరిశోధనల్లో ఉన్నపుడు.. ప్రభుత్వ సర్వీసు ఉద్యోగాలు రాయాలని అత్తయ్యే సూచించారని చెప్పారు. HYDకు చెందిన ఈమె HCUలో జెనెటిక్స్‌లో పీహెచ్‌డీ, CCMBలో పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోగా పని చేశారు. అనంతరం గ్రూప్-1 రాసి ప్రభుత్వ సర్వీసులోకి వచ్చారు. కలెక్టర్ భర్త వరప్రసాద్‌ HYD సిటీ కాలేజీలో అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్‌.