India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గ్రేటర్ హైదరాబాద్ వాసులకు ముఖ్య గమనిక. మాంసం దుకాణాలు నేడు బంద్ చేయాలని GHMC ఉత్వర్వులు జారీ చేసింది. కబేళాలు, రిటైల్ బీఫ్ దుకాణాలు మూసి ఉంటాయని ప్రకటించింది. మహావీర్ జయంతి సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. GHMC లిమిట్స్‌లోని అన్ని మాంసం దుకాణాలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి.
SHARE IT
ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడుగురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. శాంతినగర్‌లో CCS ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్‌కు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేయగా ఏడుగురు వ్యక్తులు పట్టుబడ్డారని ADB ఒకటో పట్టణ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. వారి నుంచి రూ.2,620 నగదు, ఒక బైక్, 9 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామన్నారు.
ఖమ్మంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. బుధవారం ఎర్రుపాలెంలో అత్యధికంగా 40.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అటు ముదిగొండలో 40.8, నేలకొండపల్లిలో 40.5, ఖమ్మం(U) ఖానాపురం PS, ఖమ్మం(R) పల్లెగూడెంలో 40, లింగాల (కామేపల్లి), కారేపల్లిలో 39.2, సత్తుపల్లిలో 39, మధిరలో 38.6, మంచుకొండ (రఘునాథపాలెం) 38.5, తల్లాడలో 38.5, కల్లూరులో 37.5, గౌరారం ( పెనుబల్లి) 37.1 నమోదైంది.
ఆదిలాబాద్ జిల్లాకు ట్రైనీ కలెక్టర్‌గా 2024 ఐఏఎస్ బ్యాచ్ అధికారి సలోని చాబ్రాను ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.శాంతికుమారీ ఉత్తర్వులు జారీ చేశారు. శిక్షణ నిమిత్తం ఈ జిల్లాకు రానున్న ఆమె ఏడాది పాటు ఇక్కడ అందుబాటులో ఉండనున్నారు. మే 2న కలెక్టర్ రాజర్షి షాను కలిసి రిపోర్టు చేయనున్నట్లుగా సమాచారం. ఇది వరకు ఇక్కడ ట్రైనీ కలెక్టర్‌గా అభిగ్యాన్ మాలవియా ఉన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలోని 356 రేషన్ షాపులకుగాను 6 లక్షల 32 వేల రేషన్ కార్డులు ఉన్న లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. ఈ పథకం ద్వారా 9 రోజుల్లో 70 శాతం సన్నబియ్యం పంపిణీ చేశామన్నారు. మొత్తం జిల్లావ్యాప్తంగా 4,127 మెట్రిక్ టన్నుల బియ్యం, అదనంగా కొత్తగా 14,322 మంది చేరినట్లు చెప్పారు. సన్న బియ్యం పంపిణీపై ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు.
రైలు ఢీకొని ఓ వృద్ధురాలు మృతి చెందిన సంఘటన బాలానగర్ మండలంలోని పెద్దాయపల్లి రైల్వే ట్రాక్‌పై బుధవారం జరిగింది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ మల్లేశ్వర్ వివరాల ప్రకారం.. పెద్దాయపల్లికి చెందిన బొట్టు మైసమ్మ (60) హైదరాబాద్ నుంచి రాయచూర్ వెళ్తున్న రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందింది. స్టేషన్ మాస్టర్ నర్సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
మెదక్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మెదక్ జిల్లాలో ఎవరైనా క్రికెట్ మరే ఇతర బెట్టింగ్లకు పాల్పడిన ప్రోత్సహించిన వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడినట్లు సమాచారం అందితే డైల్ 100 లేదా 8712657888 నంబర్‌కు సంప్రదించాలన్నారు.
గంజాయి తరలిస్తున్న ముగ్గురిని ఉట్నూర్ ఎక్స్ రోడ్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై మనోహర్ కు వచ్చిన సమాచారం మేరకు ముగ్గురు వ్యక్తులు ఓ బైక్ పైన వారిని తనిఖీ చేయగా వారి వద్ద సుమారు కిలోకు పైగా గంజాయి లభించింది. అదిలాబాద్ రూరల్ మండలం అసోద గ్రామంలో గంజాయి ఇచ్చిన కుమ్ర రాహుల్, రాయికల్ మండలనికి చెందిన మెండే అనిల్, తురగ గౌతంలను అదుపులోకి తీసుకున్నారు.
టేక్మల్ మండలం చంద్రుతాండ గ్రామంలోని సన్న బియ్యం లబ్ధిదారుని ఇంట్లో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ భోజనం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి సన్న బియ్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం సన్నబియ్యం పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. కలెక్టర్‌తో పాటు ఎమ్మార్వో, ఎంపీడీవో, ఎంపీఓ, పంచాయతీ అధికారి భోజనం చేశారు.
రాజీవ్ యువ వికాస పథకానికి ఏప్రిల్ 14 లోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. యువత ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకుగాను, గ్రామాలు, మున్సిపల్ పట్టణ ప్రాంతాలలో టామ్ టామ్ నిర్వహించాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఒక కుటుంబానికి ఐదేళ్ల కాలంలో ఒకే సంక్షేమ పథకానికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని అన్నారు.
Sorry, no posts matched your criteria.