Telangana

News June 17, 2024

కూకట్‌పల్లి: జేఎన్టీయూలో ఆందోళనలపై నిషేధాజ్ఞలు

image

JNTUలో విద్యార్థుల ఆందోళనలు, ధర్నాలు, ర్యాలీల కట్టడికి వర్సిటీ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రిజిస్ట్రార్ డా.వెంకటేశ్వరరావు వర్సిటీ క్యాంపస్, ఇంజినీరింగ్ కాలేజీలకు సర్కులర్ జారీ చేశారు. సాంబారులో పురుగులు ఉన్నాయంటూ మంజీరా హాస్టల్‌లో విద్యార్థులు ధర్నా చేయడం, వర్సిటీ పాలనాపరమైన కొందరి పదోన్నతులపై ధర్నా నేపథ్యంలో ఇన్‌ఛార్జ్ వీసీ వెంకటేశం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

HYD: పిల్లలకు గంజాయి అలవాటు చేస్తున్నారు.. జర జాగ్రత్త!

image

గంజాయి చాక్లెట్లను కొందరు విక్రయిస్తుండడంతో వారికి తెలియకుండానే పిల్లలు బానిసలు అవుతున్నారు. తాజాగా HYD శేరిలింగంపల్లి ఎక్సైజ్ PSపరిధి హఫీజ్‌పేట్‌ నెహ్రూనగర్‌లో UP వాసి బియాస్ గుప్తా(46) గంజాయి చ్లాకెట్లు తీసుకొచ్చి విక్రయిస్తున్నాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు. అతడి నుంచి 1.65కేజీల చాక్లెట్లను సీజ్ చేశారు. పిల్లలు చాక్లెట్లు తింటున్నప్పుడు తల్లిదండ్రులు వాటిని సరిచూడాలన్నారు.

సిద్దిపేట: ఇష్టారాజ్యంగా చెట్ల నరికివేత !

image

సిద్దిపేట జిల్లాలో 8 విడతల్లో జరిగిన హరితహారంలో సుమారు 15 కోట్ల వరకు మొక్కలు నాటారు. రహదారుల వెంట, ఖాళీ స్థలాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, పార్కులు, పల్లెలు, పట్టణాల్లో హరితహారంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించాయి. విద్యుత్‌ వైర్లకు తగులుతున్నాయనే సాకుతో సిద్దిపేటతో పాటు మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో ఇటీవల అనేక చోట్ల విద్యుత్‌ సిబ్బంది నరికి వేశారు.

News June 17, 2024

వనపర్తి: కల్యాణ గడియల్లో జిల్లాకు బాస్‌గా..

image

జిల్లాకు వచ్చే సివిల్ సర్వీసెస్ అధికారులు కల్యాణ గడియల్లో వస్తున్నారనే చర్చ స్థానికంగా వినిపిస్తోంది. 2023 జనవరి 26న ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రక్షిత కె.మూర్తి నెలరోజుల్లోనే పెళ్లి చేసుకున్నారు. 2023 ఫిబ్రవరి 1న జిల్లాకు కలెక్టర్ హోదాలో వచ్చిన తేజస్ నందలాల్ పవార్ నెలరోజుల్లోనే వివాహం చేసుకోగా.. తాజాగా వచ్చిన కలెక్టర్ ఆదర్శ్ సురభి మ్యారేజ్ సైతం జలై 7న జరగనుంది.

News June 17, 2024

NLG: నకిలీ నక్సలైట్ల ముఠా అరెస్టు

image

ధనవంతులను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేయాలని పథకం వేసిన నకిలీ నక్సల్స్ ముఠాను గుడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద మూడు నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వివరాలను నల్గొండ జిల్లా ఎస్పీ చందనా దీప్తి ఆదివారం తన కార్యాలయంలో దేవరకొండ డీఎస్పీ గిరిబాబుతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

News June 17, 2024

పాల్వంచ: మనవరాలి మృతి తట్టుకోలేక నాయనమ్మ మృతి

image

అల్లారు ముద్దుగా పెంచుకున్న మనవరాలు మృతి చెందడంతో మనస్తాపానికి గురై నాయనమ్మ మృతి చెందిన ఘటన పాల్వంచ మండలంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. రేగులగూడెం గ్రామానికి చెందిన పాపక్క(50) మనవరాలు ఈనెల 13న టైఫాయిడ్‌‌‌తో చికిత్స పొందుతూ మృతి చెందింది. అప్పటినుంచి తీవ్ర మనోవేదనకు గురైన పాపక్క ఆదివారం ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయిందని స్థానికులు తెలిపారు.

News June 17, 2024

HYD: ఉద్యమానికి సిద్ధమవుతోన్న ఉపాధ్యాయులు..!

image

రంగారెడ్డి జిల్లాలో ఉపాధ్యాయులు, నిరుద్యోగులు ఉద్యమ బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. జిల్లాలో 1,363 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వీటిలో ప్రస్తుతం ఆరు వేల మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వీరిలో 4,732 మందికిపైగా ఏళ్ల తరబడి ఒకచోట పని చేస్తున్నట్లు సమాచారం. వీరంతా ఇప్పటికే బదిలీ కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారు. కోర్టు కేసు కారణంగా ప్రస్తుతం ఈ ప్రక్రియ కూడా మధ్యలోనే నిలిచిపోయింది.