Telangana

News June 17, 2024

పాల్వంచ: గంగాదేవిపల్లిలో తాటిచెట్టుపై పిడుగు

image

పాల్వంచ రూరల్ మండల పరిధిలోని ఉల్వనూరు గ్రామపంచాయతీ గంగాదేవిపల్లిలో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన వగెల రామారావు ఇంటి సమీపంలో ఉన్న తాటిచెట్టుపై పిడుగుపడి కాలిపోయింది. అంతేకాక పిడుగుపాటుకు గ్రామంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.

News June 17, 2024

బక్రీద్ శుభాకాంక్షలు: GHMC మేయర్

image

బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మీ సోమవారం ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. దైవభక్తి, త్యాగ నిరతికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారని అన్నారు. అల్లా అనుగ్రహం తెలంగాణ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆమె ఈ సందర్భంగా ఆకాంక్షించారు. భిన్న సంస్కృతులకు నిలయమే మన హైదరాబాద్ అని కొనియాడారు.

HYD: నేడు సాలార్‌జంగ్ మ్యూజియానికి సెలవు

image

బక్రీద్ సందర్భంగా సెలవు కావడంతో నేడు (సోమవారం) ప్రజావాణి ఉండదని జీహెచ్ఎంసీ ఇన్‌ఛార్జ్ కమిషనర్ ఆమ్రపాలి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని ఆమె కోరారు. అలాగే HYDలోని ప్రసిద్ధ సాలార్‌జంగ్ మ్యూజియానికి కూడా సెలవు ఉంటుందని పరిపాలన అధికారి నాగేశ్వరరావు తెలిపారు.

KNR: వలస కూలీలకు అందని వైద్య సేవలు!

image

పొరుగు రాష్ట్రాల నుంచి జిల్లాకు వలస వచ్చిన కూలీల బతుకులు అత్యంత దుర్భరంగా మారుతున్నాయి. ఇటుక బట్టీలు, రైస్ మిల్లులో పని చేసే వలస కూలీలకు కనీస వసతులు కరవయ్యాయి. సుల్తానాబాద్ ప్రాంతంలోనీ ఓ ఇటుక బట్టీలో పనిచేసే నిండు గర్భిణిని కరీంనగర్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. పురిటి నొప్పులు అధికం కావడంతో KNR బస్టాండులోనే పురుడు పోసుకోవడంతో వారి పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో నిదర్శనంగా నిలుస్తోంది.

News June 17, 2024

హనుమకొండ: యువతిపై అత్యాచారం?

image

HNK జిల్లా ధర్మసాగర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి(25)పై అదే గ్రామానికి చెందిన యువకుడు (27) అత్యాచారం చేసినట్లు సమాచారం. యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో యువకుడు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది. అవివాహితులైన వీరిద్దరూ బంధువులు కావడం గమనార్హం.బాధితురాలు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 17, 2024

ఆదిలాబాద్: ఏడాది నుంచి బాలికపై అత్యాచారం

image

బాలికపై ఆమె బంధువు మాయమాటలు చెప్పి ఏడాది కాలంగా అత్యాచారం చేస్తున్న ఘటన ఆదిలాబాద్ పట్టణంలో వెలుగు చూసింది. పట్టణంలోని ఓ కాలనీకి చెందిన బాలిక(17)ను ఆమె బంధువు రాజమౌళి(30) మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారం చేశాడు. విషయం తెలిసిన బాలిక కుటుంబీకులు అతడిని మందలించగా వారిని సైతం వేధించాడు. దీంతో వారు ఆదివారం 2టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అతడిపై పొక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ అశోక్ తెలిపారు.

News June 17, 2024

MBNR: సివిల్స్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

HYDలోని రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్లో నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలకు 10 నెలల ఉచిత శిక్షణకు గాను ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఆసక్తి గలవారు http://tsstudycircle.co.in లో ఈనెల 17 నుంచి వచ్చే నెల 10 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. SHARE IT..

News June 17, 2024

మహబూబ్‌నగర్: నేడు బక్రీద్.. ప్రత్యేక ప్రార్థనలు ఇలా

image

వానగట్టు వక్స్-ఎ-రహమానియా ఈద్గా మైదానంలో ఉదయం 8.30 గంటలకు జామా మసీదు నాయబ్ ఇమాం సయ్యద్ ముజాహెద్ ఆధ్వర్యంలో ప్రత్యేక నమాజు నిర్వహించనున్నారు. ఉదయం 7.30 గంటలకు జామా మసీదు నుంచి ప్రదర్శనగా వేలాది మంది ముస్లింలు వానగట్టు ఈద్గా మైదానానికి చేరుకుంటారు. ఈ ర్యాలీ ఆకుల చౌరస్తా, గడియారం, పాత బస్టాండు, కలెక్టర్ బంగ్లా చౌరస్తా, బోయపల్లి గేట్ మీదుగా వానగట్టు ఈద్గాను చేరుకుని 8.30 గంకు నమాజు నిర్వహిస్తారు.