Telangana

News June 17, 2024

NZB: ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

image

బక్రీద్ వేడుకను పురస్కరించుకుని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నిజామాబాద్ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ వేడుకను ఆధ్యాత్మిక వాతావరణంలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అన్ని వర్గాల ప్రజలు సుఖః సంతోషాలతో ఉండాలని, సౌభ్రాతృత్వం, సుహృద్భావ వాతావరణం వెల్లివిరియాలని కోరారు. సోమవారం నాటి వేడుకను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు.

News June 17, 2024

NLG: యువతీ, యువకులకు గుడ్ న్యూస్

image

పోచంపల్లి స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో ఉపాధి సాంకేతిక శిక్షణ కార్యక్రమాలకు గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సంస్థ డైరెక్టర్ PSSR లక్ష్మి తెలిపారు. సంస్థలో 6 నెలల కాల పరిమితితో కూడిన ఎలక్ట్రిషియన్ (డొమెస్టిక్), సోలార్ సిస్టం ఇన్స్టాలేషన్ సర్వీస్, కంప్యూటర్ హార్డ్వేర్ , సెల్ ఫోన్ తదితర కోర్సులు ఆరు నెలలపాటు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.

News June 17, 2024

HNK: సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాం: కలెక్టర్ 

image

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించామని హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. ఈ పరీక్షకు మొత్తం 4,730 మంది అభ్యర్థులకు గాను ఉదయం 2,637 హాజరయ్యారు. అంటే 55.75 %, మధ్యాహ్నం 2,614 అంటే 55.26 % మంది అభ్యర్థులు హాజరయ్యారు. జిల్లాలో యుపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష సజావుగా జరిగినట్లు తెలిపారు.

News June 17, 2024

RGM: ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి: CP

image

బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా జరుపుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్IPS(IG) సూచించారు. ఈ సందర్భంగా కమిషనరేట్ పరిధి పెద్దపల్లి -మంచిర్యాల జిల్లాలోని ముస్లిం కుటుంబాలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. అదే విధంగా పండుగల సందర్భంగా సోషల్ మీడియాలో వచ్చే ఎలాంటి వదంతులు నమ్మవద్దన్నారు. 15 రోజుల నుంచి కమిషనరేట్‌లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి ఆవుల అక్రమ రవాణాను జరగకుండా చేశామన్నారు.

News June 16, 2024

గోదావరిఖని: మహిళను కాపాడిన రివర్ గార్డ్ పోలీసులు

image

గోదావరిఖని ఇందిరానగర్‌కు చెందిన ఓ వృద్ధురాలు కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ రోజు గోదావరి బ్రిడ్జి నుంచి నదిలో దూకే ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా అక్కడే ఉన్న రివర్ గార్డు హెడ్ కానిస్టేబుల్ జంపయ్య, కానిస్టేబుల్ నరేందర్ ఆమెను అడ్డుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ చేసి ఇంటికి పంపించారు.

News June 16, 2024

KMM: రేషన్ కార్డుల కోసం ఇంకెన్నాళ్లీ ఎదురుచూపులు!

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏళ్ల తరబడి రేషన్ కార్డుల కోసం లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. 2018 ఎన్నికలకు ముందు రేషన్ కార్డులను ఇచ్చిన గత ప్రభుత్వం.. తర్వాత ఆ ఊసే ఎత్తలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడిచినా రేపు మాపు అంటూ ఊరించడమే తప్ప ఆచరణలో అమలు చేయడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరుతున్నారు.

News June 16, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ బాధ్యతలు స్వీకరించిన జగిత్యాల, సిరిసిల్ల నూతన కలెక్టర్లు. @ ఎల్లారెడ్డిపేట మండలంలో ఉరివేసుకొని పురోహితుడి ఆత్మహత్య. @ బీర్పూర్ మండలంలో విద్యుత్ షాక్ తో మూడు ఎద్దులు మృతి. @ కథలాపూర్ మండలంలో 2 అక్రమ ఇసుక రావణ ట్రాక్టర్లు పట్టివేత. @ గోదావరిఖనిలో మహిళను కాపాడిన రివర్ గార్డ్ పోలీసులు. @ మెట్ పల్లి మండలంలో దాబాలపై దాడులు నిర్వహించిన ఎక్సైజ్ పోలీసులు. @ జగిత్యాల డిఎంహెచ్వో గా సమియోద్దిన్.

News June 16, 2024

హైదరాబాద్‌ CCSలో 12 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ

image

హైదరాబాద్‌ CCSలో‌ భారీగా బదిలీలు జరిగాయి. ఏకంగా 12 మంది ఇన్‌స్పెక్టర్లను మల్టీ జోన్-2కు బదిలీ చేస్తూ CP శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే రిపోర్ట్‌ చేయాలని‌ అందులో పేర్కొన్నారు. బదిలీ అయిన ఇన్‌స్పెక్టర్ల వివరాలు: శివ శంకర్, రఘుబాబు, అప్పలనాయుడు, భూక్య రాజేశ్, సీత రాములు, హుస్సేన్ ధీరావత్, సత్యం, నాగేశ్వర్ రెడ్డి, ధీరావత్ కృష్ణ, కొత్త సత్యనారాయణ, SA ఇమన్యూల్, బిట్టు క్రాంతికుమార్‌.

News June 16, 2024

హైదరాబాద్‌ CCSలో 12 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ

image

హైదరాబాద్‌ CCSలో‌ భారీగా బదిలీలు జరిగాయి. ఏకంగా 12 మంది ఇన్‌స్పెక్టర్లను మల్టీ జోన్-2కు బదిలీ చేస్తూ CP శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే రిపోర్ట్‌ చేయాలని‌ అందులో పేర్కొన్నారు. బదిలీ అయిన ఇన్‌స్పెక్టర్ల వివరాలు: శివ శంకర్, రఘుబాబు, అప్పలనాయుడు, భూక్య రాజేశ్, సీత రాములు, హుస్సేన్ ధీరావత్, సత్యం, నాగేశ్వర్ రెడ్డి, ధీరావత్ కృష్ణ, కొత్త సత్యనారాయణ, SA ఇమన్యూల్, బిట్టు క్రాంతికుమార్‌. 

News June 16, 2024

పారదర్శకంగా అన్ ఫిట్ చేస్తాం: సింగరేణి C&MD

image

అనారోగ్య కారణాలతో విధులు నిర్వహించలేని కార్మికుల విషయంలో పారదర్శకంగా అన్ ఫిట్ చేస్తామని సింగరేణి సంస్థ C&MD బలరాం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మధ్యవర్తుల విషయంలో మోసాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. సింగరేణి అభ్యర్థన మేరకు అవినీతి నిరోధక శాఖ ఈ విషయంలో పరిశీలిస్తోందన్నారు. అదేవిధంగా ఎవరైనా మోసం చేసినట్లు తెలిస్తే సింగరేణి విజిలెన్స్ 94911 44104 సమాచారం అందించాలన్నారు.