Telangana

News June 16, 2024

రేపు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సోమవారం సెలవు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 17న (సోమవారం) బక్రీద్ పండుగ సందర్భంగా మార్కెట్ కు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. తిరిగి 18న (మంగళవారం) నుండి మార్కెట్లో పంట క్రయవిక్రయాలు యధావిధిగా జరుగుతాయని ప్రకటించారు. కావున జిల్లా రైతులు సోదరులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

News June 16, 2024

KNR: ఆర్టీసీ బస్టాండ్‌లో మహిళ ప్రసవం

image

కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణలో ఆదివారం ఓ మహిళ ప్రసవించింది. ఆర్టీసీ సిబ్బంది తెలిపిన వివరాలిలా.. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి ఇటుకబట్టీలో పనిచేసే అంతర్రాష్ట్ర కూలీలయిన భార్యాభర్తలు ప్రసవం కోసం కరీంనగర్ వచ్చారు. బస్టాండ్ ఆవరణలో ఆ మహిళకు పురిటినొప్పులు అధికమయ్యాయి. మహిళా సిబ్బంది డిపో మేనేజర్‌కు సమాచారమిచ్చి..108 సిబ్బంది సాయంతో గర్భిణీకి ప్రసవం చేశారు. తల్లిబిడ్డ క్షేమంగా ఉన్నారన్నారు.

News June 16, 2024

ఎల్లారెడ్డిపేట: ఉరేసుకుని పురోహితుడి ఆత్మహత్య

image

ఎల్లారెడ్డిపేట మండలంలో ఓ పురోహితుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల ప్రకారం పచ్చకాంతం సంతోష్( హైటెక్ పంతులు) అనే పురోహితుడు దమ్మన్నపేటలో ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఇదే క్రమంలో అతను మనస్తాపానికి గురై ఆదివారం తన స్వగ్రామం రాచర్ల గొల్లపెల్లిలోని ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారమందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News June 16, 2024

ఆమనగల్లులో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

ఆమనగల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. వెల్దండ మండలం అజిలాపూర్ గ్రామానికి చెందిన యాదయ్య, రాగాయిపల్లి చెందిన గిరి ఇద్దరూ కలిసి బైక్ పై ఆమనగల్లు వైపు వెళ్తున్నారు. మార్గమధ్యలో మాడుగుల రోడ్డులో 2 బైక్ లు ఢీకొన్నాయి. దీంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 16, 2024

KMM: ప్రైవేట్ స్కూళ్ల దోపిడీని అడ్డుకోరా?

image

ఉమ్మడి జిల్లాలో ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు తల్లిదండ్రులకు పెనుభారంగా మారుతున్నాయి. దీనికి తోడు యూనిఫాం, షూస్, బెల్టులు, పుస్తకాల ఫీజుల పేరిట ప్రైవేటు స్కూళ్లు నిలువు దోపిడీ చేస్తున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇవే కాకుండా మధ్య మధ్య లో ఈవెంట్లు, వేడుకల కోసం చిన్నారులకు ప్రత్యేక దుస్తులకు, క్యాస్టూమ్కు మరికొంత మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుందని, అధికారులు ఈ దోపిడీని అడ్డుకోవాలని కోరుతున్నారు.

News June 16, 2024

NZB: బక్రీద్ పండగ నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు

image

బక్రీద్ పండుగ సందర్భంగా నిజామాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని NZB సీపీ కల్మేశ్వర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఖిల్లా ఈద్గా, బోధన్ బస్టాండ్ ఈద్గా, పులాంగ్ ఈద్గాల్లో ముస్లిం సోదరులు ప్రార్థన చేయనున్నారు. ఈ మేరకు సోమవారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పై మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలందరూ సహకరించాలని కోరారు.

News June 16, 2024

MBNR: రుణమాఫీపై రైతుల్లో చిగురిస్తున్న ఆశలు

image

రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15లోగా రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఏళ్లుగా రుణమాఫీ కోసం రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 5,49,108 మంది రైతులకు రూ.2,736.76 కోట్ల మేర బ్యాంకులు రుణాలిచ్చాయి . అయితే రుణమాఫీకి సంబంధించిన విధివిధానాలపై ప్రభుత్వం త్వరలోనే స్పష్టత ఇస్తుందని అధికారులు చెబుతున్నారు. 

News June 16, 2024

రామాయంపేట: ఆన్‌లైన్ బెట్టింగ్‌.. యువకుడి ఆత్మహత్య

image

రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం.. గ్రామానికి చెందిన భానుప్రసాద్ ఆన్‌లైన్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకున్నాడు. దీంతో ఈనెల 10న పురుగు మందు తాగగా ప్రసాద్‌ను బంధువులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. ఈమేరకు బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News June 16, 2024

రామాయంపేట: ఆన్‌లైన్ బెట్టింగ్‌.. యువకుడి ఆత్మహత్య

image

రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం.. గ్రామానికి చెందిన భానుప్రసాద్ ఆన్‌లైన్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకున్నాడు. దీంతో ఈనెల 10న పురుగు మందు తాగగా ప్రసాద్‌ను బంధువులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. ఈమేరకు బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News June 16, 2024

కాళేశ్వరం: గోదావరిలో యువకుడు గల్లంతు

image

గోదావరిలో స్నానం చేస్తూ యువకుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో చోటుచేసుకుంది. ఎస్సై భవానిసేన్ తెలిపిన వివరాలిలా.. వరంగల్‌కు చెందిన గరికపాటి అఖిల్ (19) ఆదివారం కాళేశ్వరం వచ్చారు. అందులో భాగంగా స్నానం చేయడానికి గోదావరిలోకి దిగాడు. ఈ క్రమంలో యువకుడు గల్లంతయ్యాడన్నారు. సమాచారమందుకున్న తమ సిబ్బంది నదీతీరానికి చేరుకుని గాలింపు చర్యలు సాగిస్తున్నట్లు తెలిపారు.