Telangana

News June 16, 2024

HYD: షార్ట్ ఫిలిం పోటీలకు దరఖాస్తుల ఆహ్వానం

image

మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై లఘు చిత్రాల పోటీ పెడుతున్నట్లు HYD నార్కోటిక్ బ్యూరో అధికారులు తెలిపారు. జూన్ 26 అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ పోటీని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు జూన్ 20లోగా లఘు చిత్రాలను పంపాలన్నారు. మొదటి బహుమతిగా రూ.50 వేలు, రెండో బహుమతిగా రూ.30 వేలు, మూడో బహుమతిగా రూ.20 వేల పురస్కారం అందజేస్తామని, వివరాలకు 87126 71111 సంప్రదించాలన్నారు.

News June 16, 2024

పారదర్శకంగా అన్ ఫిట్ చేస్తాం: సింగరేణి C&MD

image

అనారోగ్య కారణాలతో విధులు నిర్వహించలేని కార్మికుల విషయంలో పారదర్శకంగా అన్ ఫిట్ చేస్తామని సింగరేణి సంస్థ C&MD బలరాం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మధ్య వర్తుల విషయంలో మోసాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. సింగరేణి అభ్యర్థన మేరకు అవినీతి నిరోధక శాఖ ఈ విషయంలో పరిశీలిస్తున్నారన్నారు. అదేవిధంగా ఎవరైనా మోసం చేసినట్లు తెలిస్తే సింగరేణి విజిలెన్స్ 94911 44104 సమాచారం అందించాలన్నారు.

News June 16, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ఉష్ణోగ్రత వివరాలివే

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా కిష్టంపల్లిలో 37.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. నారాయణపేట జిల్లా కృష్ణలో 37.7, వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్‌లో 36.7, మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో 36.5, గద్వాల జిల్లా తొత్తినోనిదొడ్డిలో 36.0 డిగ్రీలుగా ఉష్ణోగ్రతను నమోదయ్యాయి.

News June 16, 2024

NZB: రమేశ్‌కార్తీక్‌ నాయక్‌ను వరించిన ‘యువ పురస్కార్‌’

image

నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లికి చెందిన రమేశ్ కార్తీక్ నాయక్‌కు యువ పురస్కార్ అవార్డును కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించింది. వివేక్‌నగర్ తండాలో సామాన్య గిరిజన కుటుంబంలో పుట్టిన రమేశ్.. గిరిజనుల జీవిత గాథలపై రాసిన తెలుగు కథల సంపుటి ‘ఢావ్లో’ రచనకు యువపురస్కారానికి ఎంపికయ్యారు. అతిపిన్న వయస్సులో రమేశ్ ఈ పురస్కారానికి ఎంపికయ్యాడు. రమేశ్ కార్తీక్ నాయక్‌ను బీఆర్ఎస్ నేత కేటీఆర్ అభినందించారు.

News June 16, 2024

MNCL: కవ్వాల్ టైగర్ జోన్‌కు పర్యాటకుల తాకిడి

image

మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కవ్వాల్ టైగర్ జోన్ కు పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. ఆదివారం ఉదయం ఐపీఎస్ అధికారి సుధీర్వెజి తన కుటుంబ సభ్యులతో కలిసి సఫారీలో అడవి ప్రాంతంలో పర్యటించారు. అడవిలో జంతువులు పక్షులను చూసి ఆయన సంబరపడ్డారు. టైగర్ జోన్ ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. శని, ఆదివారాల్లో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉన్నందున పర్యాటకులకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.

News June 16, 2024

పలిమెల: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

image

పలిమెల మండలంలోని సర్వాయిపేట గ్రామానికి చెందిన పురుషోత్తం (28) అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పురుషోత్తం వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగించేవాడు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

News June 16, 2024

మెదక్ పట్టణంలో 45 మంది గుర్తింపు: ఐజీ రంగనాథ్

image

మెదక్ పట్టణంలో నిన్న సాయంత్రం జరిగిన గొడవలకు, అనంతరం జరిగిన ధ్వంసం కేసులో ఇరువర్గాలలో 45 మందిని గుర్తించినట్లు మల్టీ జోన్ ఐజీ రంగనాథ్ తెలిపారు. పశువులు తరలిస్తున్నట్లు సమాచారం ఉంటే పోలీసులకు తెలపాలని సూచించారు. ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే పోలీసులు ఊరుకోరని హెచ్చరించారు. సామాన్య ప్రజలు ఎవరిపైన కేసులు పెట్టే ఉద్దేశం లేదన్నారు. రెచ్చగొట్టే వారిని ఉపేక్షించమన్నారు.

News June 16, 2024

ఖమ్మం: మహిళ మెడలో గొలుసు ఎత్తుకెళ్లిన దొంగ

image

ఖమ్మం రోటరీ నగర్‌లో స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఈజీ మనీ కోసం ఒంటరి ఆడవాళ్లను టార్గెట్ చేసుకుని మెడలోని బంగారాన్ని లాక్కెళ్తున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో రోటరీ నగర్‌లో శనివారం గుర్తు తెలియని ఓ వ్యక్తి బైక్‌పై హెల్మెట్ పెట్టుకుని కిరాణా షాపు దగ్గరకు వచ్చి వాటర్ బాటిల్, పెరుగు ప్యాకెట్ కావాలని అడిగాడు. వాటిని ఇస్తున్న క్రమంలో శనివారం మహిళ మెడలోంచి మూడు తులాల పుస్తెలతాడు లాక్కొని పరారయ్యాడు.

News June 16, 2024

HYD: DEECET-2024 దరఖాస్తులు ఆహ్వానం

image

డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం డీఈఈసెట్-2024కు ఈనెల 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సెట్ కన్వీనర్ రాధారెడ్డి తెలిపారు. HYD, RR, MDCL జిల్లాల్లోనూ జూలై 10న ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. దరఖాస్తు చేసే విద్యార్థుల వయస్సు సెప్టెంబర్ 1 నాటికి 17 ఏండ్లు పూర్తై ఉండాలన్నారు.

News June 16, 2024

GHMC పరిధిలో ఏ ఉద్యోగులు ఎంత మంది.?

image

జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం పర్మినెంట్, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బంది మొత్తం కలిపి 26 నుంచి 28 వేల మంది ఉన్నారు. 18,500 శానిటేషన్ వర్కర్లు, 950 సూపర్ వైజర్లు, 500 నుంచి 800 మంది ఆపరేటర్లు, 500 మంది జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు, 400 మంది సూపరింటెండెంట్లు, సుమారు 100 మంది అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు, 20 మంది జాయింట్ కమిషనర్లు, 20 మంది మెడికల్ ఆఫీసర్లు, 30 మంది డిప్యూటీ కమిషనర్లు ఉన్నారు.