Telangana

News August 29, 2025

చర్లపల్లి జైలులో ముగ్గురు అధికారుల సస్పెన్షన్

image

చర్లపల్లి జైలులో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు అధికారులను జైళ్లశాఖ సస్పెండ్ చేసింది. గత ఆదివారం రిమాండ్ ఖైదీ శంత్ కమర్‌కు పెయింటింగ్ పనులు అప్పగించారు. అతడు పెయింటింగ్ వేస్తున్నట్లు నటించి గోడదూకి పరారయ్యాడు. సీరియస్‌గా పరిగణించిన ఉన్నతాధికారులు వార్డెన్ భరత్‌తో పాటు అసిస్టెంట్ డిప్యూటీ జైలర్లు సుబ్బరాజు, వసంత్ కుమార్‌లను సస్పెండ్ చేశారు. విచిత్రమేమంటే అదేరోజు అతడు పోలీసులకు చిక్కాడు.

News August 29, 2025

HYD: ‘తెలుగు రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించాం’

image

సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ కార్యక్రమం ఈనెల 30న రవీంద్రభారతిలో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సీపీఐ తెలంగాణ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఈ సంస్మరణ సభకు తెలుగు రాష్ట్రాల సీఎం చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డిని ఆహ్వానించామని ఆయన పేర్కొన్నారు.

News August 29, 2025

SEP 22 నుంచి టెన్త్, ఇంటర్ పరీక్షలు

image

సెప్టెంబర్ 22 నుంచి వారం రోజుల పాటు (28 వరకు) ఓపెన్ 10, ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అలాగే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు కూడా అక్టోబర్ 6- 13 వరకు నిర్వహించనున్నట్లు తెలంగాణ ఓపన్ స్కూల్ సొసైటీ (TOSS) డైరెక్టర్ శ్రీహరి తెలిపారు. విద్యార్థులు ఈ విషయం గమనించి పరీక్షలకు హాజరు కావాలని కోరారు.

News August 29, 2025

HYD: రామయ్య రూపంలో గణపయ్య!

image

KPHBలోని అడ్డగుట్ట సొసైటీలో ఏకదంత మిత్రమండలి ఆధ్వర్యంలో 4 ఏళ్లుగా వినాయక నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది అయోధ్యలోని బలరాముడి తరహాలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి అందరిని ఆకట్టుకున్నారు. సంస్కృతి సంప్రదాయాలు ప్రజలందరికీ తెలిసేలా ఇక్కడ నిత్యం కార్యక్రమాలు చేపడుతున్నారు.

News August 29, 2025

సెప్టెంబర్‌ 1 నుంచి రేషన్‌ షాపుల బంద్‌ పాటిస్తాం

image

డీలర్లకు నెలలు తరబడి పెండింగ్ ఉన్న కమీషన్‌ను ఈనెల 31వ తేదీ వరకు విడుదల చేయాలని రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బానోతు వెంకన్న, షేక్ జానీమియ కోరారు. లేనిపక్షంలో సెప్టెంబర్ 1నుంచి రేషన్ షాపులు బంద్ చేస్తామని ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. 1వ తేదీన తహసీల్ ఎదుట, 2న ఆర్డీఓ కార్యాలయాల ఎదుట, 3వ తేదీన కలెక్టరేట్ ఎదుట ధర్నా చేయడమే కాక 4న అసెంబ్లీ ముట్టడి చేపడతామని తెలిపారు.

News August 29, 2025

మాస్టర్ల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

image

పీఎం ధర్తీ ఆబా జన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష అభియాన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు. అనంతరం 63 మంది మాస్టర్‌లకు శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. జిల్లాలో 9 మండలాల పరిధిలో 35 గ్రామాలలో అమలుచేసే గిరిజన జనాభాకు అందుబాటులో ఉన్న వనరులు పరిశీలించారు. ఇంకా ఏమేమి వసతులు కావాలో ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు సూచించారు.

News August 29, 2025

HYD: బుల్లెట్లను క్యారీ చేస్తున్న నిందితుడు ఇతడే

image

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బుల్లెట్ల కలకలం రేపిన విషయం తెలిసిందే. అమృత్‌సర్ ప్రయాణికుడి లగేజీలో సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారులు 8 లైవ్ బుల్లెట్లు గుర్తించారు. 32 ఏళ్ల పంజాబ్ వాసి సుఖ్దీప్‌సింగ్ ఇండిగో విమానంలో ఢిల్లీ మీదుగా అమృత్‌సర్ వెళ్లేందుకు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాడు. లగేజీలో చెకింగ్‌లో పట్టుబడగా అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

News August 29, 2025

HYD: బ్రహ్మసూత్ర మరకత శివలింగంపై సూర్యకిరణాలు

image

HYD శివారు శంకర్‌పల్లిలోని చందిప్ప గ్రామంలో గల 11వ శతాబ్దపు శ్రీరాముడు ప్రతిష్ఠించిన పురాతన బ్రహ్మసూత్ర మరకత శివలింగంపై శుక్రవారం ఉదయం సూర్య కిరణాలు పడ్డాయి. ఆలయ అర్చకుడు స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. అనంతరం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. శివలింగంపై సూర్య కిరణాలు పడటం చాలా అరుదని ఆలయ నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు.

News August 29, 2025

వరంగల్ జిల్లాలో తగ్గుముఖం పట్టిన వర్షాలు

image

రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఈరోజు ఉదయం 6 గంటల వరకు మొత్తం 29.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. వరంగల్ మండలంలో 11.2 మి.మీ అత్యధిక వర్షపాతం నమోదు కాగా.. ఖిల్లా వరంగల్‌లో 5.5మి.మీ, ఖానాపూర్‌లో 1.8, నల్లబెల్లిలో అత్యల్పంగా 0.5 మి.మీ వర్షపాతం నమోదయింది.

News August 29, 2025

మర్డర్ కేసు ఛేదించిన నల్గొండ పోలీసులు

image

NLGలో జరిగిన <<17539485>>మర్డర్ <<>>కేసును వన్ టౌన్ CI ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి బృందం 24 గంటలు గడవకముందే ఛేదించింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన లారీ క్లీనర్ షేక్ సిరాజ్.. రమేశ్‌ను హత్య చేసినట్లు DSP శివరాంరెడ్డి వెల్లడించారు. సిరాజ్ రోజూ పడుకునే ప్లేస్‌లో రమేశ్ పడుకోవడంతో కోపోద్రిక్తుడైన సిరాజ్ బండరాళ్లతో కొట్టి హత్య చేశాడన్నారు. కేసు ఛేదించిన బృందాన్ని జిల్లా ఎస్పీ అభినందించారు.